మళ్లీ 600కే విమాన టికెట్లు! | air fares again start from Rs. 600 | Sakshi
Sakshi News home page

మళ్లీ 600కే విమాన టికెట్లు!

Published Tue, Aug 26 2014 11:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

మళ్లీ 600కే విమాన టికెట్లు!

మళ్లీ 600కే విమాన టికెట్లు!

హైదరాబాద్ నగరం లాంటి చోట్ల 600 రూపాయలు పెడితే ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి క్యాబ్ ఛార్జీలు మాత్రమే వస్తాయి. కానీ, అదే 600 రూపాయలు పెడితే చాలు.. ఏకంగా విమానమే ఎక్కేయొచ్చు. ఆపైన ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు! అవును, చవక ధరలకే విమాన యానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు సంబంధించి, ఆగస్టు 31వ తేదీలోగా ఈ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లు 600 రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి.

ఈ ఆఫర్ కింద బెంగళూరు నుంచి చెన్నై గానీ, కొచ్చి గానీ వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కూడా 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మొత్తం పన్నులతో కలిపిన మొత్తం. ఇక బెంగళూరు నుంచి గోవా, లేదా అటునుంచి ఇటు వెళ్లాలంటే టికెట్ ధర 900 మాత్రమే. ఇక బెంగళూరు- చండీగఢ్, జైపూర్ మార్గాల్లో అయితే టికెట్లు రూ. 1900 చొప్పున ఉన్నాయి.

మరోవైపు స్పైస్జెట్ కూడా చౌక టికెట్లను ప్రవేశపెట్టింది. అయితే దాని టికెట్ ధర రూ. 1888 అని పేర్కొన్నారు. దానికి ఆగస్టు 27వ తేదీలోగా బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement