'ఆ ఫ్లైట్ డిజైనింగ్కు నెల రోజులు పట్టింది' | Kabali airline took over a month to design | Sakshi
Sakshi News home page

'ఆ ఫ్లైట్ డిజైనింగ్కు నెల రోజులు పట్టింది'

Published Fri, Jul 1 2016 2:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

'ఆ ఫ్లైట్ డిజైనింగ్కు నెల రోజులు పట్టింది'

'ఆ ఫ్లైట్ డిజైనింగ్కు నెల రోజులు పట్టింది'

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలి. ఈ సినిమాకు అఫీషియల్ ఎయిర్లైన్ పార్టనర్గా వ్యవహరిస్తున్న ఎయిర్ ఏసియా ఇండియా, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏసియాలోనే తొలిసారిగా ఓ పాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ను సినిమా పోస్టర్లతో డిజైన్ చేయించింది. ఈ శుక్రవారం నుంచి ఈ కబాలి ఫ్లైట్ గగనవీధుల్లో షికారు ప్రారంభిస్తున్న సందర్భంగా.. ఎయిర్ ఏసియా ప్రతినిధి, ఫ్లైట్ డిజైనింగ్ వెనుక కష్టాలను వివరించాడు.

ఫ్లైట్పై కబాలి పోస్టర్ను ఏర్పాటుచేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ ఫ్లైట్ బెంగళూరు, న్యూ డిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు సేవలందించనుంది. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ తరువాత కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. మలేషియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ కాంత్ వయసు మళ్లిన డాన్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి సినిమాను ఈ నెల రెండో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement