
కబాలి రిలీజ్ డేట్ వచ్చేసింది
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కబాలి విడుదలపై సందిగ్ధత తొలగిపోయింది. సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు నమోదు చేసిన కబాలి రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్ లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా సూచించకపోవటం విశేషం. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాలం, హిందీలలోనూ ఒకేసారి రిలీజ్ అవుతున్న కబాలి మలయ్ లాంటి విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. కొచ్చాడయాన్, లింగా లాంటి భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
#Kabali will be releasing worldwide on 22 July 2016 !! We couldn't be more excited @superstarrajini @beemji :) pic.twitter.com/HOll88EzuU
— Kalaippuli S Thanu (@theVcreations) 11 July 2016