ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కబాలీ | kabali first south film to release in malay | Sakshi
Sakshi News home page

ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కబాలీ

Published Sun, May 22 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కబాలీ

ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కబాలీ

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇన్నాళ్లు ఎక్కువగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసిన రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాడు. మద్రాస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ కబాలీ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ ఇమేజ్, స్టైల్కు తగ్గట్టుగా భారీగా ఈ సినిమాను తెరకెక్కించాడు రంజిత్.

ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలీ రజనీ కెరీర్లో సరికొత్త రికార్డ్లను సెట్ చేస్తోంది. జపాన్ లాంటి దేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీ ఈ సినిమాతో మలేషియా ఆడియన్స్ను టార్గెట్ చేశాడు. ఎక్కువగా భాగం మలేషియాలోనే షూటింగ్ జరుపుకొన్నకబాలీలో చాలా మంది మలేషియన్ నటులు నటించారు. అందుకే ఈ సినిమాను తమిళ్, తెలుగుతో పాటు ఒకేసారి మలేషియా అధికారిక భాష మళాయ్లోనూ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో మళాయ్ భాషలో రిలీజ్ అవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా కబాలీ రికార్డ్ సృష్టించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement