రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే.. | Rajinikanth Old Look 20 Mins in Kabali Movie | Sakshi
Sakshi News home page

రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..

Published Tue, Jun 28 2016 4:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..

రజనీ అలా కనిపించేది 20 నిమిషాలే..

ప్రస్తుతం రిలీజ్కు రెడీగా ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కబాలి. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డ్లు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు తగ్గట్టుగానే చిత్రయూనిట్ భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే కబాలి చిత్రానికి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం రజనీ లుక్. వయసైన డాన్ పాత్రలో రజనీ లుక్కు మంచి స్పందన వచ్చింది. భాషా సినిమా తరువాత రజనీ డాన్గా నటిస్తుండం కూడా సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వటానికి కారణం అయ్యింది. అయితే కోలీవుడ్లో వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. కబాలి సినిమాలో రజనీ కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే డాన్ కనిపిస్తాడట.

మలేషియాలో ఉంటున్న శరణార్థుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ ఎక్కువగా భాగం యంగ్గానే కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్లో వచ్చే కీలక సన్నివేశాల్లో మాత్రం రజనీ డాన్ లుక్లో కనిపిస్తాడట. మరి రజనీని డాన్ గా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement