రజనీ సినిమా కాపీనా..? | copy rumours around rajani kanth next film kabali | Sakshi
Sakshi News home page

రజనీ సినిమా కాపీనా..?

Published Sat, Nov 7 2015 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

రజనీ సినిమా కాపీనా..?

రజనీ సినిమా కాపీనా..?

రెండు భారీ డిజాస్టర్ల తరువాత సూపర్స్టార్ రజనీకాంత్ చేస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'కపాలి'. కోలీవుడ్లో రియలిస్టిక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా రజనీ కొత్త సినిమా కాపీ అంటూ వస్తున్న వార్తలు సూపర్స్టార్ అభిమానులను కలవరపెడుతున్నాయి.

కపాలి సినిమాలో రజనీ తెల్లగడ్డంతో వయసైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు డాన్గా చక్రం తిప్పి తరువాత వాటన్నింటికీ దూరంగా ఉండే డాన్ కూతురు కిడ్నాప్ అవ్వటం, ఆమెను రక్షించుకునేందుకు తిరిగి మాఫీయా రంగంలోకి అడుగుపెట్టడం అనే లైన్తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ సీరీస్ 'టేకెన్' కథకు కాపీ అన్న టాక్ వినిపిస్తోంది.

'టేకెన్' సినిమాలో హీరో భారీ యాక్షన్ సీక్వెస్స్లు చేస్తాడు, మరి రజనీ ఈ ఏజ్లో అలాంటి సీన్స్ చేస్తాడా..? లేక కేవలం రజనీ స్టైల్స్ బిల్డప్ మీదే సినిమా నడిపించేస్తారా..? అన్న ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ వార్తలన్నింటికీ చెక్ చెప్పాలంటే చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement