Taken
-
సింగ్ బ్రదర్స్ రూ.500 కోట్లు కాజేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దైచీ శాంక్యో పీటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ర్యాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్‌కు రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు నేపథ్యంలో తమ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్ డైరెక్టర్ల బోర్డును వీడారని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 13న బోర్డు సమావేశంకానున్నట్లు ఫోర్టిస్ పేర్కొంది. మల్వీందర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి, శివేందర్ సింగ్ వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలిపింది. అయితే తాజా పరిణామాలపై మార్కెట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్టిస్ సంస్థనుంచి భారీ ఎత్తున నిధుల చెల్లింపు జరిగిందనే అంచనాలు నెలకొన్నాయి. ఒక సంవత్సరం క్రితం బోర్డు ఆమోదం లేకుండా కనీసం రూ .500 కోట్లు (78 మిలియన్ డాలర్లు) సింగ్ బ్రదర్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఈ ఈ ఫండ్స్ తరలింపును నివేదించారనీ, కాని ఆ డబ్బు ఆ సమయంలో సింగ్ బ్రదర్స్ నియంత్రణలో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ నిధులను తిరిగి సంస్థకు చేరేదాకా, లెక్క తేలేదాకా సంస్థ రెండవ-త్రైమాసిక ఫలితాలపై సంతకం చేయడానికి ఫోర్టిస్ ఆడిటర్, డెలాయిట్ హస్కిన్స్ & సెల్స్ నిరాకరించారట. ఈ అంచనాలపై ఇరువర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. సింగ్ బ్రదర్స్ రాజీనామా అనంతరం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. ఒక దశలో రూ. 157వరకూ జంప్చేసియడం గమనార్హం. మరోవైపు హైకోర్టుతీర్పుపై సింగ్ బ్రదర్స్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా జపనీస్ దిగ్జం దైచీ శాంక్యో సింగ్బ్రదర్స్పై దాఖలు చేసిన 3500 కోట్ల రూపాయల దావాను గెలిచింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
దళిత సర్పంచ్ ఫిర్యాదుపై చర్యలేవీ
ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫిర్యాదు కాకినాడ : స్పష్టమైన ఆధారాలున్నా ఓ దళిత సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆలమూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎస్పీ విశాల్‌గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కాకినాడలో ఎస్పీని కలిసి ఈ అంశంపై చర్చించారు. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామ సర్పంచ్ డెక్కాపాటి పాప తమ గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని ప్రశ్నించడంతో మే 20వ తేదీన అడ్డుచెప్పారన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అక్కడ నిర్మాణం చేస్తున్న మద్దిరాజు కామరాజు ఆమెపై దౌర్జన్యం చేసి కులంపేరుతో దుర్భాషలాడారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఆమెపై పారతో దాడి చేసి హత్యాయత్నం కూడా చేశారన్నారు. ఇందుకు సంబంధించి రికార్డింగ్‌లు, స్పష్టమైన ఆధారాలతో ఆలమూరు స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్య తీసుకోవడలేదని ఎస్పీకి వివరించారు. దళిత సర్పంచ్‌పై దురుసుగా వ్యవహరించి అవమానకరంగా ప్రవర్తించిన అక్కడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని జగ్గిరెడ్డి చెప్పారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే డీఎస్పీతో మాట్లాడారు. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీటీసీ లంక వెంకటరమణ, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ తదితరులు ఉన్నారు. -
పాత 500 తీసుకునేది ఇక్కడ మాత్రమే
-
గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల స్వీకరణ
గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ : జిల్లా ఎస్పీ కార్యాలయంలోని రూరల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. రూరల్ డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావుకు మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. జిల్లా నుంచి పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.అర్బన్ అడిషనల్ ఎస్పీ బి.పి.తిరుపాల్ 35 మొత్తం ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో.. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జెడ్పీ ఇన్కార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, పులిచింతల డిప్యూటీ కలెక్టర్ పి.రమాదేవి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యలను ఆలకించిన వారు వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. -
రజనీ సినిమా కాపీనా..?
రెండు భారీ డిజాస్టర్ల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్ చేస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'కపాలి'. కోలీవుడ్‌లో రియలిస్టిక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా రజనీ కొత్త సినిమా కాపీ అంటూ వస్తున్న వార్తలు సూపర్‌స్టార్ అభిమానులను కలవరపెడుతున్నాయి. కపాలి సినిమాలో రజనీ తెల్లగడ్డంతో వయసైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు డాన్‌గా చక్రం తిప్పి తరువాత వాటన్నింటికీ దూరంగా ఉండే డాన్ కూతురు కిడ్నాప్ అవ్వటం, ఆమెను రక్షించుకునేందుకు తిరిగి మాఫీయా రంగంలోకి అడుగుపెట్టడం అనే లైన్‌తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ సీరీస్ 'టేకెన్' కథకు కాపీ అన్న టాక్ వినిపిస్తోంది. 'టేకెన్' సినిమాలో హీరో భారీ యాక్షన్ సీక్వెస్స్లు చేస్తాడు, మరి రజనీ ఈ ఏజ్‌లో అలాంటి సీన్స్ చేస్తాడా..? లేక కేవలం రజనీ స్టైల్స్ బిల్డప్ మీదే సినిమా నడిపించేస్తారా..? అన్న ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ వార్తలన్నింటికీ చెక్ చెప్పాలంటే చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది.