గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల స్వీకరణ
Published Tue, Aug 9 2016 6:08 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ : జిల్లా ఎస్పీ కార్యాలయంలోని రూరల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. రూరల్ డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావుకు మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. జిల్లా నుంచి పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.అర్బన్ అడిషనల్ ఎస్పీ బి.పి.తిరుపాల్ 35 మొత్తం ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో..
జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జెడ్పీ ఇన్‌కార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య, పులిచింతల డిప్యూటీ కలెక్టర్ పి.రమాదేవి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యలను ఆలకించిన వారు వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.
Advertisement
Advertisement