సింగ్ బ్రదర్స్ ( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: దైచీ శాంక్యో పీటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ర్యాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్‌కు రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు నేపథ్యంలో తమ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్ డైరెక్టర్ల బోర్డును వీడారని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 13న బోర్డు సమావేశంకానున్నట్లు ఫోర్టిస్ పేర్కొంది. మల్వీందర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి, శివేందర్ సింగ్ వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలిపింది.
అయితే తాజా పరిణామాలపై మార్కెట్‌లో అనేక అనుమానాలు వ్యక‍్తమవుతున్నాయి. ఫోర్టిస్ సంస్థనుంచి భారీ ఎత్తున నిధుల చెల్లింపు జరిగిందనే అంచనాలు నెలకొన్నాయి. ఒక సంవత్సరం క్రితం బోర్డు ఆమోదం లేకుండా కనీసం రూ .500 కోట్లు (78 మిలియన్ డాలర్లు) సింగ్ బ్రదర్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఈ ఈ ఫండ్స్ తరలింపును నివేదించారనీ, కాని ఆ డబ్బు ఆ సమయంలో సింగ్ బ్రదర్స్ నియంత్రణలో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ నిధులను తిరిగి సంస‍్థకు చేరేదాకా, లెక్క తేలేదాకా సంస్థ రెండవ-త్రైమాసిక ఫలితాలపై సంతకం చేయడానికి ఫోర్టిస్ ఆడిటర్, డెలాయిట్ హస్కిన్స్ & సెల్స్ నిరాకరించారట. ఈ అంచనాలపై ఇరువర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇది ఇలా ఉంటే.. సింగ్ బ్రదర్స్ రాజీనామా అనంతరం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. ఒక దశలో రూ. 157వరకూ జంప్‌చేసియడం గమనార్హం. మరోవైపు హైకోర్టుతీర్పుపై సింగ్ బ్రదర్స్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా జపనీస్ దిగ్జం దైచీ శాంక్యో సింగ్‌బ్రదర్స్‌పై దాఖలు చేసిన 3500 కోట్ల రూపాయల దావాను గెలిచింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment