Fortis Healthcare
-
వడపళని హాస్పిటల్‌ను విక్రయిస్తున్న ఫోర్టిస్
న్యూఢిల్లీ: చెన్నైలోని వడపళని హాస్పిటల్ కార్యకలాపాలను రూ.152 కోట్లకు శ్రీ కావేరీ మెడికల్ కేర్‌కు విక్రయిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ ప్రకటించింది. తప్పనిసరి అమలు చేసే ఒప్పందాన్ని శ్రీకావేరీ మెడికల్ కేర్‌తో కుదుర్చుకుంది. ఈ లావాదేవీ పూర్తిగా నగదు చెల్లింపుల రూపంలోనే ఉంటుంది. జూలై నాటికి పూర్తి అవుతుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. చెన్నైలోని ఆర్కాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన వడపళని హాస్పిటల్ 110 పడకల సామర్థ్యంతో ఉంది. దీన్ని 200 పడకల వరకు విస్తరించుకోవడానికి సౌలభ్యం కూడా ఉంది. కీలకమైన మార్కెట్లు, ప్రాంతాల వారీగా తమ హాస్పిటల్ ఆస్తులను మరింత అనుకూలంగా మార్చుకునే క్రమంలోనే ఈ విక్రయం నిర్వహిస్తున్నట్టు ఫోరి్టస్ హెల్త్‌కేర్ తెలిపింది. లాభదాయకత, మార్జిన్లను పెంచుకోవాలన్న తమ లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది. అలాగే, కీలక మార్కెట్లలో తమ హాస్పిటల్ ఆస్తుల క్రమబద్ధీకరణకు సైతం ఇది తోడ్పడుతుందని తెలిపింది. ఈ కొనుగోలుతో తమ ఆస్పత్రి పడకల సామర్థ్యం 750 పడకలకు పెరుగుతుందని కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ చంద్రకుమార్ తెలిపారు. దక్షిణాదిన ప్రముఖ, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదగాలన్న తమ ప్రణాళికలో ఇది భాగమన్నారు. -
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లకు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ: జపాన్ సంస్థ దైచీ సాంక్యోకు ర్యాన్‌బాక్సీ విక్రయ వ్యవహారంలో పలు అంశాలను దాచిపెట్టడం, ఈ కేసు విచారణలో ఉండగా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ తమ ఫోర్టిస్ షేర్లను మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గురువారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 26 శాతం వాటా కోసం ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌పై విధించిన స్టే ఎత్తివేసేందుకూ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. 2018 ఫోర్టిస్–ఐఐహెచ్ ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసును తిరిగి ఢిల్లీ హైకోర్టుకు విచారణ నిమిత్తం రిమాండ్ చేసింది. దైచి– ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ల మధ్య చట్టపరమైన పోరాటం కారణంగా ఐహెచ్‌హెచ్–ఫోర్టిస్ ఒప్పందం నిలిచిపోయింది. ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ షేర్ డీల్‌ను దైచీ సాంక్యో సవాలు చేసింది. జపనీస్ డ్రగ్ మేకర్ దైచీ 2008లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ యజమానులైన సింగ్ సోదరుల నుండి ర్యాన్‌బాక్సీ కొనుగోలు చేసింది. అయితే పలు అంశాలు దాచిపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని దైచీ ఆరోపిస్తూ, సింగ్ సోదరులపై న్యాయపోరాటాన్ని జరిపింది. సింగ్ సోదరులకు వ్యతిరేకంగా సింగపూర్ ట్రిబ్యునల్‌లో రూ.3,600 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు అమలుకు దైచీ న్యాయపోరాటం చేస్తోంది. షేర్ భారీ పతనం..: కాగా, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు షేర్ అమ్మకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల అనంతరం ఫోర్టిస్ ఒక ప్రకటన చేస్తూ, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫోర్టీస్ హెల్త్‌కేర్ షేర్ 15% పడిపోయి రూ.265.55 వద్ద ముగిసింది. -
చెరో 1,170 కోట్లు కట్టండి!
న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు (సింగ్ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2,341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్ ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వాపరాలు... ► సింగ్ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. తర్వాత ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ► అయితే ర్యాన్ బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్ సోదరులపై దైచీ సింగపూర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్ సోదరులు వెల్లడించలేదన్నది దైచీ ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్ నుంచి పొందింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సింగ్ సోదరులు భారత్, సింగ్‌పూర్ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రల్ అవార్డును హైకోర్టు సమర్థించింది. ► దీనితో ఆయా అంశాలపై సింగ్ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఫోర్టిస్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్ సోదరులను ఆదేశించింది. ► అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌లో వాటాలను సింగ్ సోదరు లు మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు అమ్మేశారు. ► ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్ 14న ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పం దంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ► మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది. ► ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఓపెన్ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్ ఆఫర్‌పై విచరణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
కుప్పకూలిన ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు
సాక్షి, ముంబై: సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా కుప్పకూలాయి. జపాన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ దైచీ శాంకో దాఖలు చేసిన కేసులొ రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్, శివిందర్ సింగ్‌లు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ తలా 1,175 కోట్ల రూపాయలు జమ చేయాలని కోర్టు తెలిపింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. దీంతోపాటు ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమో మోటో ధిక్కార చర్యల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఫోర్టిస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 161 రూపాయలను తాకిన తరువాత 17 శాతం పతనమయ్యాయి. అయితే ఫోర్టిస్ అనుబంధ సంస్థ ఎస్కార్ట్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ (ఇహెచ్ఆర్సిఎల్)కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి స్వల్ప ఊరటనిచ్చింది. ఢిల్లీలోని ఓఖ్లాలోనుంచి సంస్థను తొలగించే చర్యలను కోర్టు రద్దు చేసిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా 2005లో ఇహెచ్ఆర్సిఎల్ ఆసుపత్రి లీజును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) రద్దు చేయడంతో సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్‌ను 2006లో సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ఆ తరువాత మరోసారి సంస్థ దాఖలు చేసుకున్నస్పెషల్ లీవ్ పిటీషన్‌ను కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించింది. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంకో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను సమర్ధించింది. ఈ విషయంలో ఇప్పటికే సోదరులిద్దరికీ చివాట్లు పెట్టిన అత్యున్నత ధర్మాసనం తాజాగా సీరియస్‌గా స్పందించింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ. 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. అలాగే ఫోర్టిస్ ఐహెచ్‌హెచ్ ఓపెన్ ఆఫర్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించింది. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా 2008లో రాన్‌బాక్సీని దైచీ కొనుగోలు చేసింది. అయితే కంపెనీపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపడుతోందన్న నిజాన్ని దాచిపెట్టి రాన్‌బాక్సీ షేర్లను సింగ్ సోదరులు విక్రయించారంటూ దైచీ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ అనంతరం సింగ్ సోదరులు దైచీ సంస్థకు రూ .3500 కోట్ల చెల్లించాలని 2016లో ఆదేశించింది. అయితే ఆమొత్తాన్ని చెల్లించక పోవడంతో దైచీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం సింగ్ సోదరులు దైచీకి డబ్బులు చెల్లించాల్సిందేనని 2019 మార్చి 14న స్పష్టం చేసింది. అనంతరం సింగ్ బ్రదర్స్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం..కోర్టు దిక్కరణకు పాల్పడినట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ, 2019, ఏప్రిల్‌లో తీర్పును రిజర్వులో ఉంచింది. ఇది ఇలా వుంటే వేలకోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలతో గత నెలలో సింగ్ బ్రదర్స్‌ను ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
పోలీసు కస్టడీకి సింగ్ సోదరులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)ను రూ. 2,397 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. ‘ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును పక్కదోవ పట్టింది. స్వభావరీత్యా ఈ నేరం చాలా తీవ్రమైనది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పక్కదోవ పట్టిన నిధుల ఆచూకీ తెలుసుకోవడానికి, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వారిని పట్టుకోవడానికి నిందితుల పోలీసు కస్టడీ అవసరమని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ పేర్కొన్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ శివీందర్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పోలీసులు, కేంద్రానికి నోటీసులు ఇచ్చే విషయంపై ఉత్తర్వులను కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రెలిగేర్ మాజీ ప్రమోటర్, ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్, సింగ్ సోదరుల్లో ఒకరైన్ మల్విందర్ మోహన్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేయగా, ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు లుధియానాలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మల్విందర్ను ఢిల్లీకి తరలించనున్నారు. రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్, మల్విందర్ తమ్ముడు, శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెలిగేర్ ఫిన్‌వెస్ట్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ సూరి దాఖలు చేసిన ఫండ్ డైవర్షన్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టయిన వారిలో రెలిగేర్(ఆర్ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్ఈఎల్, ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు నిందితులందరినీ ఈ సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంటారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. చదవండి : ఫోర్టిస్ మాజీ ప్రమోటర్ శివీందర్ అరెస్ట్! -
ఫోర్టిస్ మాజీ ప్రమోటర్ శివీందర్ అరెస్ట్!
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ (ఆర్ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్ఈఎల్.. ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శివీందర్ సోదరుడు మల్వీందర్ సింగ్ పరారీలో ఉన్నారని, ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యిందని వివరించారు. ఆర్‌ఈఎల్‌కు ఆర్ఎఫ్ఎల్ అనుబంధ సంస్థ. 2018 ఫిబ్రవరి దాకా సింగ్ సోదరులు ఆర్ఈఎల్ ప్రమోటర్లుగా కొనసాగారు. వారి నిష్క్రమణ తర్వాత ఆర్ఈఎల్, ఆర్ఎఫ్ఎల్ బోర్డులు మారాయి. శివీందర్ సింగ్ ప్రమోటర్‌గా ఉన్న సమయంలో తీసుకున్న రుణాలను ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆర్ఎఫ్ఎల్ ఫిర్యాదు మేరకు తాజా అరెస్టులు జరిగాయి. ‘ఆర్ఎఫ్ఎల్ కొత్త మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్దిష్ట రుణమొత్తం.. సింగ్, ఆయన సోదరుడికి చెందిన కంపెనీల్లోకి మళ్లినట్లు గుర్తించింది. దీనిపై ఈవోడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. దానికి అనుగుణంగా ఎఫ్ఐఆర్ నమోదైంది‘ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ మాజీ ప్రమోటర్లు కూడా అయిన సింగ్ సోదరులతో పాటు గోధ్వానీపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ర్యాన్‌బాక్సీ విక్రయం విషయంలో మోసాలకు పాల్పడ్డారంటూ శివీందర్, మల్వీందర్ల నుంచి జపాన్ ఔషధ సంస్థ దైచీ శాంక్యో రూ. 2,600 కోట్ల మేర నష్టపరిహారాన్ని రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. -
ఐహెచ్‌హెచ్ చేతికే ఫోర్టిస్..
న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ’ఫోర్టిస్ హెల్త్‌కేర్’ టేకోవర్ కోసం నెలల తరబడి వివిధ సంస్థల మధ్య కొనసాగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్ బోర్డు వెల్లడించింది. టేకోవర్ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి 31 శాతం వాటాలు దక్కుతాయి. అదే ధరకు మరో 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో రూ. 3,300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. గురువారం నాటి ఫోర్టిస్ షేరు ముగింపు ధరతో పోలిస్తే ఆఫర్ ధర 20 శాతం అధికం. షేరు ఒక్కింటికి రూ. 170 లెక్కన ఫోర్టిస్ ఈక్విటీ వేల్యుయేషన్ మొత్తం రూ. 8,800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఫోర్టిస్‌ను కొనుగోలు చేసేందుకు పోటీపడిన టీపీసీ–మణిపాల్ కన్సార్షియం రూ. 2,100 కోట్లు సమకూర్చేలా, మణిపాల్ హాస్పిటల్స్‌ను ఫోర్టిస్‌లో విలీనం చేసేలా ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో ఫోర్టిస్ ఆమోదించిన ఆఫర్లలో ఐహెచ్‌హెచ్ ప్రతిపాదన మూడోది. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్‌కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల్లో 49 ఆస్పత్రులు, 10,000 పైచిలుకు బెడ్స్ ఉన్నాయి. ఫోర్టిస్‌కి 45 హెల్త్‌కేర్ సెంటర్లు, 368 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఓపెన్ ఆఫర్.. షేర్హోల్డర్లు, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదం వచ్చాక .. 7 రోజుల్లో లావాదేవీ పూర్తి కావొచ్చని ఫోర్టిస్ హెల్త్‌కేర్ పేర్కొంది. దీనంతటికీ 60–75 రోజుల సమయం పట్టొచ్చని వివరించింది. ఐహెచ్‌హెచ్ ప్రతిపాదన వ్యూహాత్మకంగా, ఆర్థికంగాను మెరుగైనదిగా ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ రవి రాజగోపాల్ పేర్కొన్నారు. డీల్ స్వరూపం సరళతరంగా ఉండటం, అవసరమయ్యే అనుమతులు తక్కువే ఉండటం, స్వల్ప వ్యవధిలో పూర్తి కానుండటం సానుకూలాంశాలని తెలిపారు. భారత ఉపఖండంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని ఐహెచ్‌హెచ్ ఎండీ టాన్ సీ లెంగ్ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. దీర్ఘకాలంలో తమ అంతర్జాతీయ బ్రాండ్ ’గ్లెన్ఈగిల్స్’ చెయిన్ కింద ఫోర్టిస్‌ను చేర్చే అవకాశం ఉందని లెంగ్ వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులను కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమని ఆయన చెప్పారు. ‘ప్రస్తుతం ఫోర్టిస్‌కి రూ. 5,800–6,000 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ముందుగా రూ. 4,000 కోట్లు సమకూరుస్తున్నాం. అవసరమైతే మిగతా వాటాదారులతో సంప్రదించి మరిన్ని నిధులను కూడా సమకూర్చే అవకాశం ఉంది‘ అని లెంగ్ తెలిపారు. హోరాహోరీ పోటీ.. రుణ వివాదంలో వ్యవస్థాపకులు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి రావడంతో ఫోర్టిస్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వ్యవస్థాపకులిద్దరూ నిధులు కూడా మళ్లించారన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోర్టిస్ టేకోవర్‌పై దిగ్గజ సంస్థలు కన్నేశాయి. ముందుగా మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ సంయుక్తంగా ఇచ్చిన ఆఫర్‌ను ఫోర్టిస్ బోర్డు ఆమోదించింది. అయితే, ఆ తర్వాత మరో నాలుగు సంస్థలు బరిలోకి దిగడంతో టేకోవర్ యుద్ధం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ముంజాల్–బర్మన్ కుటుంబాల కన్సార్షియం సంయుక్తంగా ఇచ్చిన రూ. 1,800 కోట్ల ఆఫర్‌ను రెండో విడతలో ఫోర్టిస్ ఆమోదించింది. కానీ, దీన్ని షేర్హోల్డర్లు ఆమోదించలేదు. దీంతో బిడ్డింగ్ ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. మొత్తం మీద ముగ్గురు బిడ్డర్లు (ఐహెచ్‌హెచ్, టీపీజీ–మణిపాల్ కన్సార్షియం, ముంజాల్–బర్మన్ కన్సార్షియం)తో పాటు రేడియంట్–కేకేఆర్ కన్సార్షియం కూడా ఫోర్టిస్ కోసం పోటీపడగా చివరికి ఐహెచ్హెచ్హెచ్ దక్కించుకుంది. ఐహెచ్‌హెచ్ బిడ్ ఆమోదం వార్తల నేపథ్యంలో శుక్రవారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 3.97 శాతం పెరిగి రూ. 147.80 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 5.10 శాతం కూడా ఎగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈలో ఫోర్టిస్ షేరు 3.93 శాతం పెరిగి రూ. 147.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 293 కోట్ల మేర ఎగిసి రూ. 7,666.13 కోట్లకు చేరింది. -
అక్షర దోషంతో 4 రెట్లు పెరిగిన వేతనం
న్యూఢిల్లీ: అక్షర దోషంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఈవో భవదీప్ సింగ్ వేతనం కాస్తా రూ.13 కోట్లు పెరిగిపోయింది. 2015 జూలై నుంచి 2017 మార్చి మధ్య కాలంలో భవదీప్ సింగ్ వేతనం నాలుగు రెట్లు పెరగ్గా, అదే కాలంలో కంపెనీ పనితీరు క్షీణించడం గమనార్హం. 2015 జూలైలో సింగ్‌ను రూ.3.91 కోట్ల వేతనానికి సీఈవోగా ఫోర్ట్స్ హెల్త్‌కేర్ నియమించుకుంది. మరుసటి సంవత్సరమే ఆయన వేతనం రూ.16.80 కోట్లకు పెరిగింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ నివేదికల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి. అయితే, భవదీప్ సింగ్ వేతన గణాంకాల్లో ముద్రిత దోషం ఉన్నట్టు ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘2016–17 ఆర్థిక సంవత్సరం నివేదికలో నంబర్ తప్పుగా ముద్రితమైంది. దీంతో సింగ్ ఆదాయం అధికంగా కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నివేదికలో సవరణ ప్రచురిస్తాం. వాస్తవానికి ఆ రెండు సంవత్సరాల్లో సింగ్ వేతనం కంపెనీ నిబంధనలకు అనుగుణంగా 6%, 8% చొప్పునే పెరిగింది’’ అని కంపెనీ ప్రతినిధి వివరించారు. అయితే ఈ అంకెలు వరుసగా రెండేళ్లు ఎలా తప్పు వస్తాయని షేర్ హోల్డర్లు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. కంపెనీ తీవ్ర కుంభ కోణాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
ఫోర్టిస్ రేసు నుంచి తప్పుకున్న ముంజాల్–బర్మన్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థ కొనుగోలు రేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటిదాకా బరిలో ముందున్న ముంజాల్–బర్మన్ కుటుంబాలు తాజాగా పక్కకు తప్పుకున్నాయి. ఫోర్టిస్ కొత్తగా బిడ్లు ఆహ్వానించినప్పటికీ.. ముంజాల్–బర్మన్ సవరించిన బిడ్లు దాఖలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, మణిపాల్–టీపీజీ సవరించిన బిడ్లు దాఖలు చేశాయి. బైండింగ్ బిడ్ దాఖలు చేసినట్లు ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయగా, మణిపాల్–టీపీజీ కూడా బరిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జులై 3 నాటికి కొత్తగా వచ్చిన బిడ్లను పరిశీలించనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలియజేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఫోర్టిస్‌ను కొనుగోలు చేసే సంస్థ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కనీసం రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్ కొనుగోలుకు నిధుల సమీకరణ ప్రణాళిక, డయాగ్నస్టిక్స్ సేవల అనుబంధ సంస్థ ఎస్ఆర్ఎల్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకు అవకాశం కల్పించే ప్రణాళిక మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. 2001లో మొహాలీలో తొలి ఆస్పత్రిని ప్రారంభించిన ఫోర్టిస్‌కు ప్రస్తుతం దేశవిదేశాల్లో 45 హెల్త్‌కేర్ కేంద్రాలు ఉన్నాయి. -
మరింత పెరిగిన ఫోర్టిస్ నష్టాలు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ నికర నష్టాలు మరింతగా పెరిగాయి. 2016–17 ఆర్థి క సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.38 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.914 కోట్లకు పెరిగాయని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. వివిధ సమస్యలు కొనసాగుతుండటం, వివిధ పద్దుల కింద రూ.580 కోట్ల మేర కేటాయింపులు జరపడం, ఇంపెయిర్మెంట్స్ కారణంగా నష్టాలు పెరిగాయని ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ రవి రాజగోపాల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.1,123 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.479 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.934 కోట్లకు పెరిగాయని, ఆదాయం రూ.4,574 కోట్ల నుంచి రూ.4,561 కోట్లకు తగ్గింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 0.9 శాతం లాభంతో రూ.136 వద్ద ముగిసింది. ఆ రూ. 500 కోట్లు రికవరీ చేస్తాం కంపెనీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు కంపెనీ నుంచి అక్రమంగా తరలించిన రూ.500 కోట్ల రికవరీ కోసం చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించామని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం లేకుండా, ష్యూరిటీలు లేకుండా ఈ మొత్తాన్ని సింగ్ సోదరులకు రుణాలుగా కంపెనీ ఇచ్చింది. దీన్ని రికవరీ చేస్తామని ఫోర్టిస్ తెలిపింది. -
ఫోర్టిస్, ఎస్ఆర్ఎల్ల విలీనం రద్దు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్, ఎస్ఆర్ఎల్ (డయాగ్నస్టిక్స్ విభాగం) విలీనం రద్దయింది. ఈ రెండు సంస్థల విలీనాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఈ రంగంలో సమస్యలు ప్రబలంగా ఉండటం, విలీన ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ రెండు సంస్థల విలీనం 6–8 నెలల్లో పూర్తవ్వగలదని అంచనా వేశామని, కానీ తమ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ ప్రక్రియ 19 నెలలుగా సాగుతోందని తెలిపింది. ఇంత సుదీర్ఘ కాలం జరిగినా ఇంకా విలీనం పూర్తవ్వలేని పేర్కొంది. కాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) చండీగఢ్ బెంచ్ వద్ద ఈ విలీన స్కీమ్ పెండింగ్‌లో ఉందని తెలిపింది. ఈ 19 నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎన్నో సమస్యలు చోటు చేసుకున్నాయని, డయాగ్నస్టిక్స్ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. అందుకు విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం పొందాల్సి ఉందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. -
ఫోర్టిస్ రేసులో నాలుగు సంస్థలు
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ కొనుగోలు రేసులో నాలుగు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. తమ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి గల సంస్థలు మే 31 లోపు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) దాఖలు చేయాలని ఫోర్టిస్ హెల్త్‌కేర్ పేర్కొనటంతో పలు కంపెనీలు స్పందించాయి. వీటిల్లో నాలుగింటిని షార్ట్‌లిస్ట్ చేశామని ఫోర్టిస్ హెల్త్‌కేర్ పేర్కొంది. హీరో ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్– బర్మన్ ఫ్యామిలీ ఆఫీస్ (డాబర్), ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్, రేడియంట్ లైఫ్ కేర్, మణిపాల్– టీపీజీ కన్సార్షియమ్లు నాలుగింటినీ తదుపరి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతించాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించినట్లు కంపెనీ తెలియజేసింది. తాజా నిబంధనలు.. తాజా నిబంధనల ప్రకారం, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయాలనుకున్న ఏ కంపెనీ అయినా కనీసం రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్ కొనుగోలుకు సంబంధించిన సమగ్ర పెట్టుబడి ప్రణాళికను కూడా సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు డయాగ్నస్టిక్ విభాగం ఎస్ఆర్ఎల్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు నిష్క్రమించడానికి సంబంధించిన ప్రణాళికను కూడా జత చేయాల్సి ఉంటుంది. గత వారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ను ఫోర్టిస్ హెల్త్‌కేర్ పునర్వ్యవస్థీకరించింది. పాత డైరెక్టర్లలో ఒకరైన బ్రియాన్ టెంపెస్ట్ను తొలగించాలని వాటాదారులు కోరారు. ఇద్దరు సంస్థాగత ఇన్వెస్టర్లు తొలగించాలని సూచించిన నలుగురు డైరెక్టర్లలో బ్రియాన్ టెంపెస్ట్ ఉన్నారు. గత నెల 22న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశానికి (ఈజీఎమ్) ముందే మరో ముగ్గురు డైరెక్టర్లు– హర్పాల్ సింగ్, సబీనా వైసోహ, తేజిందర్ సింగ్ షేర్గిల్ రాజీనామా చేశారు. ముం జాల్ బర్మన్ల ఆఫర్‌ను ఆమోదించిన డైరెక్టర్లలో ఈ నలుగురూ ఉన్నారు. వీరంతా వైదొలగడం, బోర్డ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ముంజాల్–బర్మన్ల ఆఫర్‌ను రద్దు చేసుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. దీంతో తాజా బిడ్డింగ్ మొదలైంది. కంపెనీ షార్ట్ లిస్ట్ చేసిన సంస్థలివీ.. 1. హీరో ముంజాల్– బర్మన్ 2. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ 3. రేడియంట్ లైఫ్ కేర్ 4. మణిపాల్– టీపీజీ కన్సార్షియమ్ -
మరో ఇద్దరు ఫోర్టిస్ డైరెక్టర్ల నిష్క్రమణ
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ విక్రయ అంశంలో సరిగ్గా వ్యవహరించడం లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు హర్పాల్ సింగ్, సబీనా వైసోహా సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నలుగురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. ఇద్దరు డైరెక్టర్లు తేజీందర్ సింగ్ షేర్గిల్, బ్రయాన్ టెంపెస్ట్ ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నలుగురినీ తప్పించే అజెండాతో మంగళవారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్‌హోల్డర్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ విక్రయం విషయంలో షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఈ నలుగురు డైరెక్టర్లు చర్యలు తీసుకోలేదని కంపెనీ ఇన్వెస్టర్లయిన నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్, ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ ఆరోపిస్తున్నాయి. ఆ నలుగురిని తప్పించడంపై వోటింగ్ కోసం మే 22న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఇవి డిమాండ్ చేశాయి. అదే సమయంలో సువలక్ష్మి చక్రవర్తి, రవి రాజగోపాల్, ఇంద్రజిత్ బెనర్జీలను కంపెనీ బోర్డులో డైరెక్టర్లుగా నియమించేందుకు కూడా ఈ సమావేశంలో వాటాదారుల అనుమతి కోరనున్నారు. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకూ.. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 12.04 శాతం వాటాలున్నాయి. ముంజాల్– బర్మన్ల కుటుంబ సంస్థలు, మణిపాల్– టీపీజీ, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ మొదలైనవి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. వీటిలో ముంజాల్– బర్మన్ల బిడ్‌కు ఫోర్టిస్ బోర్డు ఓకే చెప్పడం వివాదానికి దారి తీసింది. -
ఫోర్టిస్‌కు మరింత మెరుగైన మణిపాల్ ఆఫర్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలు ప్రక్రియలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్ మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌ను రూ.180కి కొనుగోలు చేస్తామని ఈ కన్సార్షియమ్ ముందుకు వచ్చిందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ముంజాల్–బర్మన్ల ఆఫర్‌కు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డ్ గత వారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. స్వతంత్ర మదింపు సంస్థ ఒకటి ఫోర్టిస్ హెల్త్‌కేర్ విలువను రూ.6,070 కోట్లుగా అంచనా వేసిందని, కానీ తాము ఒక్కో షేర్‌కు రూ.180 ఆఫర్ చేస్తున్నామని, ఈ ధర ప్రకారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ విలువ రూ.9,403 కోట్లవుతుందని మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్ ఫోర్టిస్ డైరెక్టర్ల బోర్డ్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 0.2 శాతం లాభంతో రూ. 149 వద్ద ముగిసింది. -
వాటాదారులే తేల్చాలి..!
న్యూఢిల్లీ: హీరో–బర్మన్ల ఆఫర్‌కు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం పట్ల ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్లు నిరాశను వ్యక్తం చేశాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ వాటాదారులతోనే నేరుగా మాట్లాడాలని యోచిస్తున్న మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ భవిష్యత్తు కార్యాచరణ పట్ల కసరత్తు చేస్తోంది. తమ ఆఫర్ ఉత్తమమైనదని ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఎమ్డీ, సీఈఓ ట్యాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు. ఫోర్టిస్ స్వల్పకాల రుణ అవసరాలను తీర్చడమే కాకుండా కంపెనీ దీర్ఘకాల లక్ష్యాల విషయంలో కూడా తమ ఆఫరే ఉత్తమమైనదని వివరించారు. ఫోర్టిస్ వాటాదారులు నిర్ణయం తీసుకునే ముందు బోర్డ్ ప్రతిపాదనను క్షుణ్నంగా సమీక్షిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్టిస్ ప్రతిపాదనను అంగీకరించాలో, వద్దో అన్న నిర్ణయాన్ని వాటాదారులు నిర్ణయించాలని మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఎమ్డీ, సీఈఓ రంజన్ పాయ్ వ్యాఖ్యానించారు. -
ఫోర్టిస్‌కు రూ.6,322 కోట్లిస్తాం!
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మరింత మొత్తాన్ని ఆఫర్ చేసింది. కొనుగోలు విలువను రూ.6,322 కోట్లకు పెంచింది. స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఫోర్టిస్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. హాస్పిటల్ వ్యాపారం విలువ రూ.5,003 కోట్లకు అదనంగా రూ.1,319 కోట్లను ప్రీమియం రూపంలో చెల్లించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. అన్ని బిడ్డింగ్ ఆఫర్లను పరిశీలించి సిఫారసు చేసేందుకు ఫోర్టిస్ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బోర్డు భేటీకి ముందే మణిపాల్ తన ఆఫర్‌ను సవరించడం గమనార్హం. రూ.750 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని తాజాగా ప్రతిపాదించింది. డెట్ ఫైనాన్స్ లేదా ఫోర్టిస్‌కు రుణాలిచ్చిన సంస్థలకు గ్యారంటీ, కంఫర్ట్ లేఖల రూపంలో ఈ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మణిపాల్/ టీపీజీ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు ఆఫర్‌ను సవరించడం ఇది రెండోసారి. మార్చి 27న మొదటి విడత రూ.5,003 కోట్లను చెల్లించేందుకు ముందుకు రాగా, ఈ నెల 10న రూ.6,061 కోట్లకు ఆఫర్నుపెంచింది. ఒక్కో షేరుకు రూ.155 ఇవ్వజూపింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు కేకేఆర్ ఆధ్వర్యంలోని రేడియెంట్ లైఫ్ కేర్, మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, చైనాకు చెందిన ఫోసన్ హెల్త్‌కేర్ సైతం ఆసక్తితో ఉన్న విషయం విదితమే. -
ఫోర్టిస్ రేసులో నాలుగో బిడ్డర్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడానికి తాజాగా మరో కంపెనీ రంగంలోకి వచ్చింది. చైనాకు చెందిన ఫోసన్ హెల్త్ హోల్డింగ్స్ నుంచి తమకు ఆఫర్ అందిందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఇప్పటికే ఈ కంపెనీని దక్కించుకోవడానికి మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బీహెచ్డీ, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు డాబర్‌కు చెందిన బర్మన్, హీరో ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ముంజాల్‌లు సంయుక్తంగా ఆసక్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫోసన్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఫోసన్ హెల్త్ హోల్డింగ్స్ కంపెనీ తమ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తోందని ఫోర్టిస్ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. ఒక్కో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్‌ను రూ.156 చొప్పున కొనుగోలు చేయడానికి, మొత్తం రూ.2,295 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని పేర్కొంది. కంపెనీ స్థితిగతుల మదింపును బట్టి ఈ ఆఫర్లో ఈ కంపెనీ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలున్నాయని వివరించింది. కాగా అన్ని సంస్థల ప్రతిపాదనల పరిశీలన కోసం నేడు(గురువారం) తమ కంపెనీ డైరెక్టర్లు సమావేశం కానున్నారని ఫోర్టిస్ తెలిపింది. ఫోర్టిస్ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.155 చొప్పున కొనుగోలు చేస్తామని మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్, రూ.156 చొప్పున కొనుగోలు చేస్తామని బర్మన్, ముంజాల్ల సంయుక్త సంస్థ, రూ.160 చొప్పున కొనుగోలు చేస్తామని ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ కంపెనీలు ఆఫర్ చేశాయి. -
మణిపాల్ చేతికి ‘ఫోర్టిస్’ హాస్పిటల్ వ్యాపారం
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ హాస్పిటల్ వ్యాపారాన్ని మణిపాల్ హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. ఫలితంగా ఏర్పడే సంస్థ విలువ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఈఓ భవదీప్ సింగ్ తెలిపారు. ఈ విలీన ప్రక్రియ 10–12 నెలల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.కంపెనీ ప్రమోటర్లు సింగ్ సోదరుల ద్వయం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అంశంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ దర్యాప్తునకు, ఈ డీల్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీకి చెందిన హాస్పిటల్ వ్యాపారాన్ని డీమెర్జ్ చేయడానికి ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ హాస్పిటల్ వ్యాపారంతో పాటు డయాగ్నస్టిక్స్ చెయిన్ ఎస్ఆర్ఎల్లో 20 శాతం వాటాను కూడా మణిపాల్ హాస్పిటల్స్, టీపీజీ క్యాపిటల్‌లు కొనుగోలు చేస్తాయి. ఈ విక్రయ వార్తలతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో 15 శాతం పతనమైన ఈ షేర్ చివరకు 13 శాతం నష్టంతో రూ.123 వద్ద ముగిసింది. -
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మరో సత్యం కానుందా?
ఫోర్టిస్ హెల్త్‌కేర్ వ్యవహారం చూస్తుంటే భారీ కుంభకోణమేదో బయటపడుతుందన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ర్యాన్‌బాక్సీతో అంచెలంచెలుగా ఎదిగి దాని విక్రయంతో బిలియనీర్ సింగ్ సోదరులుగా ఖ్యాతిగాంచిన మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు స్థాపించిన ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో పలు పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వరుస రాజీనామాలు, తరచుగా రీస్ట్రక్చరింగ్లు జరగటమే కాక... తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ప్రమోటర్లకు చెందిన రెండు హోల్డింగ్ కంపెనీల ఆస్తుల్ని జప్తు చేయటం గమనార్హం. ఈ వరుస పరిణామాలతో ఇప్పటికే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన ఈ సంస్థ వారి సంపదను కూడా భారీగా హరించేసింది. ట్రెజరీ ఆపరేషన్లలో భాగంగా సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట రూ.473 కోట్ల నిధులను కొల్లగొట్టిన బోర్డ్.. ఈ నిధులను సింగ్ సోదరుల ఇతర కంపెనీలకు బదలాయించేసిందనే ఆరోపణలు కొనసాగడం చూస్తుంటే ఫోర్టిస్ హెల్త్‌కేర్ మరో సత్యం కానుందని అనిపిస్తున్నట్లు ‘మనీలైఫ్’ పత్రిక పేర్కొంది. ఇది మామూలు మళ్లింపు కాదు: ఇన్‌గవర్న్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం అనేది పలు కంపెనీలలో తరచుగా జరిగేదే అయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న తరలింపు మాత్రం సత్యం, యూబీ గ్రూప్ తరహాలోనే ఉందని... ప్రాక్సీ వోటింగ్ అడ్వైజరీ సంస్థ ఒకటి అభిప్రాయపడింది. బెంగళూరుకు చెందిన ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపిన సమాచారం మేరకు కంపెనీ ప్రమోటర్లకు చెందిన పూర్తి అనుబంధ సంస్థల ద్వారా నిధులు మళ్లిపోగా.. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోలేదని తెలిసింది. నియంత్రణ సంస్థలకు ఎటువంటి సమాచారం లేకుండానే అనుబంధ సంస్థలు సంబంధిత వ్యక్తులకు రుణాలను మంజూరీ చేశాయి. మరోవైపు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... నిధులకు సంబంధించిన విషయాలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్ తమకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించి.. ఇందుకు ఈ నెల 26వ తేదీని (ఫిబ్రవరి, 2018) గడువుగా నిర్ణయించింది. ఒక కంపెనీ సంబంధిత వ్యక్తులకు రుణాలను జారీ చేయటం కంటే ముందే వాటాదారుల అనుమంతి పొందాల్సి ఉంటుందని కంపెనీల చట్టం 2013, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెబుతుండగా ఈ నిబంధనను ఫోర్టిస్ హెల్త్‌కేర్ అనుబంధ సంస్థలు పూర్తిగా విస్మరించాయి. కంపెనీ ఆర్థిక ఫలితాలను కూడా సమయానికి వెల్లడించకుండా రెలిగేర్ హెల్త్ ట్రస్ట్ ఆస్తులను విలీనం చేసుకోవడంలో నిమగ్నమైపోయిన ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్.. ఫిబ్రవరి 13న సమావేశం అయినప్పటికీ ఇదే నెల 28 వరకు అనుమతి పొందిందే తప్ప ఫలితాలను ఇప్పటికీ ప్రకటించకలేదు. ఇదంతా చూస్తుంటే స్కామ్ భారీ స్థాయిలోనే జరిగి ఉంటుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్స్ ద్వారా గతేడాదిలో నిధుల మళ్లింపు జరిగిందని, అప్పుడు కూడా షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే ఇదంతా జరిగిపోయిందని వెల్లడించిన ఇన్‌గవర్న్ రీసెర్చ్.. ఇలాంటి నిర్ణయాలు ఫోర్టిస్‌లో సర్వసాధారణంగా మారిపోయాయని తెలియజేసింది. సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొల్లగొట్టిన మొత్తాన్ని బ్యాలెన్స్ షీటులో ఆస్తుల వైపు కరెంట్ లోన్స్ రూపంలో చూపించాల్సి ఉండగా.. కన్సాలిడేటెట్ బ్యాలెన్స్ షీటులో నగదు కింద ఈ మొత్తాన్ని చూపింది. ఇది గతేడాదిలో రూ.142 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఈమొత్తం రూ.544 కోట్లుగా ఉందని, ఇంతగా పెరగడం అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు విరుద్ధమని వివరించింది. గతంలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ దారి మళ్లించిన నిధులు ♦ 2010లో ఫోర్టిస్ మారిష్ అనే 100% అనుబంధ సంస్థ ద్వారా పార్క్‌వే హోల్డింగ్స్ సింగపూర్‌లో 25% వాటాను కొనుగోలుచేసింది. ♦ ఎఫ్‌సీసీబీ మార్గంలో రూ.647 కోట్లను సమీకరించి అదే సమయంలో ఫోర్టిస్ మారిషస్‌కు రూ.395 కోట్ల రుణాన్ని ఇచ్చింది. ♦ పార్క్‌వే హోల్డింగ్స్‌లో వాటాను పెంచడం కో సం ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్ బిడ్ దాఖలు చేసింది. ♦ తొలుత ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్‌లో ఫోర్టిస్ మారిషస్‌కు 49 శాతం, ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉండగా.. ఇది క్రమంగా 100 శాతానికి పెరిగిపోయింది. ♦ రెండు సార్లు పేర్లు మార్చడం ద్వారా చివరకు ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్ కాస్తా ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్‌గా మారింది. ♦ 2010–11 సమయంలో ఫోర్టిస్ ఇంటర్నేషనల్ ద్వారా ఫోర్టిస్ ప్రమోటర్లు 6 విదేశీ ఆస్తులను కొనుగోలు చేశారు. ♦ ఈ మొత్తం వ్యవహారంలో ఫోర్టిస్ మారిషస్‌కు ఇచ్చిన రూ.395 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. ♦ ఇప్పటికీ ఇంటర్నేషనల్‌కు 4.4 శాతం వడ్డీ, ఎఫ్సీసీబీపై 5 శాతం వడ్డీ చెల్లిస్తూనే ఉండడం కొసమెరుపు. ♦ ఇంతటి స్థాయిలో నిధుల మళ్లింపులు జరుగుతుండడం, ఇదే సమయంలో ఉన్నట్టుండి వరుసగా డైరెక్టర్లు రాజీనామాలు చేయడం చూస్తుంటే అతి త్వరలోనే ఫోర్టిస్‌లో భారీ కుంభకోణం బయటపడనుందని ఇన్‌గవర్న్ రీసెర్చ్ అంచనావేస్తోంది. -
సింగ్ సోదరుల రాజీనామాలు ఆమోదం
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్లు–మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌ల రాజీనామాలను ఆమోదించామని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. సింగ్ సోదరులు ప్రమోటర్లుగా ఉన్న ఆర్‌హెచ్‌టీ హెల్త్ ట్రస్ట్ (ఆర్‌హెచ్‌టీ)ను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, సింగపూర్‌లో లిస్టైన ఈ కంపెనీని రూ..4,650 కోట్లకు కొనుగోలు చేయనున్నామని, ఈక్విటీ, రుణాల ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తామని కూడా తెలిపింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మల్వీందర్, నాన్–ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఉన్న శివిందర్ సింగ్ రాజీనామాలను మంగళవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని పేర్కొంది. కంపెనీ కార్యకలాపాల నిర్వహణ గాను ఒక మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశామని వివరించింది. క్యూ2, క్యూ3 ఆర్థిక ఫలితాలను ఈ నెల 28న వెల్లడిస్తామని, దీని కోసం ఆ రోజు డైరెక్టర్ల సమావేశం జరుగతుందని పేర్కొంది. రూ.66 కోట్ల జరిమానా చెల్లించాం...: బోర్డ్ మీటింగ్ జరిగే సమయానికల్లా ఆడిటర్లు ఆడిటింగ్‌ను పూర్తి చేయకపోవడంతో అదనంగా 15 రోజుల గడువును కోరుతున్నామని ఫోర్టిస్ హెల్త్‌కేర్ వివరించింది. షెడ్యూల్ ప్రకారమైతే, మంగళవారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లోనే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. బోర్డ్ ఆమోదం లేకుండా సింగ్ సోదరులు కంపెనీ నుంచి రూ.500 కోట్లు తీసుకున్నారని, దీనికి లెక్కలు లేకపోవడంతో ఆడిటింగ్ వ్యవహారాలు చూస్తున్న డెలాయిట్ హాస్కిన్స్ అండ్సెల్స్ ఎల్ఎల్పీ క్యూ2 ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించిందని గత వారం బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. క్యూ2 ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరిగినందుకు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు రూ.66 కోట్ల మేర జరిమానా చెల్లించామని వివరించింది. -
సింగ్ బ్రదర్స్ రూ.500 కోట్లు కాజేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దైచీ శాంక్యో పీటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ర్యాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్‌కు రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు నేపథ్యంలో తమ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివేందర్ సింగ్ డైరెక్టర్ల బోర్డును వీడారని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 13న బోర్డు సమావేశంకానున్నట్లు ఫోర్టిస్ పేర్కొంది. మల్వీందర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి, శివేందర్ సింగ్ వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలిపింది. అయితే తాజా పరిణామాలపై మార్కెట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్టిస్ సంస్థనుంచి భారీ ఎత్తున నిధుల చెల్లింపు జరిగిందనే అంచనాలు నెలకొన్నాయి. ఒక సంవత్సరం క్రితం బోర్డు ఆమోదం లేకుండా కనీసం రూ .500 కోట్లు (78 మిలియన్ డాలర్లు) సింగ్ బ్రదర్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఈ ఈ ఫండ్స్ తరలింపును నివేదించారనీ, కాని ఆ డబ్బు ఆ సమయంలో సింగ్ బ్రదర్స్ నియంత్రణలో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ నిధులను తిరిగి సంస్థకు చేరేదాకా, లెక్క తేలేదాకా సంస్థ రెండవ-త్రైమాసిక ఫలితాలపై సంతకం చేయడానికి ఫోర్టిస్ ఆడిటర్, డెలాయిట్ హస్కిన్స్ & సెల్స్ నిరాకరించారట. ఈ అంచనాలపై ఇరువర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. సింగ్ బ్రదర్స్ రాజీనామా అనంతరం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. ఒక దశలో రూ. 157వరకూ జంప్చేసియడం గమనార్హం. మరోవైపు హైకోర్టుతీర్పుపై సింగ్ బ్రదర్స్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా జపనీస్ దిగ్జం దైచీ శాంక్యో సింగ్బ్రదర్స్పై దాఖలు చేసిన 3500 కోట్ల రూపాయల దావాను గెలిచింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ తీర్పును సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
భారీ జరిమానాతో కుదేలైన షేర్లు
ముంబై: ఢిల్లీ సర్కార్ విధించిన భారీ జరిమానా నేపథ్యంలో ఫోర్టిస్ హెల్త్ కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందించడం లేదని ఆరోపిస్తూ ఫోర్టిస్ హెల్త్ కేర్ అనుబంధ సంస్థ పై 503 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించడంతో సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లో నష్టాలను మూటగట్టుకుంది. ఈ మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టరేట్ జనరల్ (డీహెచ్ ఎస్) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు 5 శాతం నష్టాలను చవిచూసింది. భూ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఫోర్టిస్ ఆసుపత్రిపై ఆప్ సర్కార్ కన్నెర్ర చేసింది. 1984-07 సంవత్సరాలకు సంబంధించిన ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్సిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆర్జించిన అసహజ లాభాల్లో 503 కోట్ల రూపాయలను జమ చేయాలని డీహెచ్ఎస్ ఆదేశించింది. దీంతో బీఎస్ఈ ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముగింపులో కోలుకొని రూ 165 దగ్గర నిలదొక్కుకుంది. అయితే ఈ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఫోర్టిస్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల రోగులకు సబ్సీడిపై చికిత్సను అందించడంలో విఫలమైనందుకు పలు ప్రయివేటు ఆసుపత్రులపై ఢిల్లీ సర్కార్ కొరడా ఝళిపించింది. పేదలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించాలన్న నిబంధనకు అంగీకరించి, తక్కువ ధరలకు విలువైన స్థలాలను పొంది, అనంతరం ఆ నిబంధనను తుంగలో తొక్కిన నగరంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకంద్ హాస్పిటల్, ధర్మషీలా క్యాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లపై రూ.600 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.