న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడానికి తాజాగా మరో కంపెనీ రంగంలోకి వచ్చింది. చైనాకు చెందిన ఫోసన్ హెల్త్ హోల్డింగ్స్ నుంచి తమకు ఆఫర్ అందిందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. ఇప్పటికే ఈ కంపెనీని దక్కించుకోవడానికి మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బీహెచ్‌డీ, మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు డాబర్‌కు చెందిన బర్మన్, హీరో ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ముంజాల్‌లు సంయుక్తంగా ఆసక్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫోసన్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఫోసన్ హెల్త్ హోల్డింగ్స్ కంపెనీ తమ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తోందని ఫోర్టిస్ కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. ఒక్కో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్‌ను రూ.156 చొప్పున కొనుగోలు చేయడానికి, మొత్తం రూ.2,295 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని పేర్కొంది.
కంపెనీ స్థితిగతుల మదింపును బట్టి ఈ ఆఫర్‌లో ఈ కంపెనీ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలున్నాయని వివరించింది. కాగా అన్ని సంస్థల ప్రతిపాదనల పరిశీలన కోసం నేడు(గురువారం) తమ కంపెనీ డైరెక్టర్లు సమావేశం కానున్నారని ఫోర్టిస్ తెలిపింది. ఫోర్టిస్ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.155 చొప్పున కొనుగోలు చేస్తామని మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్, రూ.156 చొప్పున కొనుగోలు చేస్తామని బర్మన్, ముంజాల్‌ల సంయుక్త సంస్థ, రూ.160 చొప్పున కొనుగోలు చేస్తామని ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ కంపెనీలు ఆఫర్ చేశాయి.
ఫోర్టిస్ రేసులో నాలుగో బిడ్డర్
Published Thu, Apr 19 2018 6:26 AM | Last Updated on Thu, Apr 19 2018 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment