ఫోర్టిస్‌కు రూ.6,322 కోట్లిస్తాం! | Fortis Rs 6,322 crores | Sakshi
Sakshi News home page

ఫోర్టిస్‌కు రూ.6,322 కోట్లిస్తాం!

Published Thu, Apr 26 2018 12:48 AM | Last Updated on Thu, Apr 26 2018 12:48 AM

Fortis Rs 6,322 crores - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలుకు మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మరింత మొత్తాన్ని ఆఫర్‌ చేసింది. కొనుగోలు విలువను రూ.6,322 కోట్లకు పెంచింది. స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు ఫోర్టిస్‌ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. హాస్పిటల్‌ వ్యాపారం విలువ రూ.5,003 కోట్లకు అదనంగా రూ.1,319 కోట్లను ప్రీమియం రూపంలో చెల్లించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. అన్ని బిడ్డింగ్‌ ఆఫర్లను పరిశీలించి సిఫారసు చేసేందుకు ఫోర్టిస్‌ బోర్డ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బోర్డు భేటీకి ముందే మణిపాల్‌ తన ఆఫర్‌ను సవరించడం గమనార్హం. రూ.750 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని తాజాగా ప్రతిపాదించింది. డెట్‌ ఫైనాన్స్‌ లేదా ఫోర్టిస్‌కు రుణాలిచ్చిన సంస్థలకు గ్యారంటీ, కంఫర్ట్‌ లేఖల రూపంలో ఈ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

మణిపాల్‌/ టీపీజీ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలుకు ఆఫర్‌ను సవరించడం ఇది రెండోసారి. మార్చి 27న మొదటి విడత రూ.5,003 కోట్లను చెల్లించేందుకు ముందుకు రాగా, ఈ నెల 10న రూ.6,061 కోట్లకు ఆఫర్‌నుపెంచింది. ఒక్కో షేరుకు రూ.155 ఇవ్వజూపింది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలుకు కేకేఆర్‌ ఆధ్వర్యంలోని రేడియెంట్‌ లైఫ్‌ కేర్, మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్, చైనాకు చెందిన ఫోసన్‌ హెల్త్‌కేర్‌ సైతం ఆసక్తితో ఉన్న విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement