
న్యూఢిల్లీ: హీరో–బర్మన్‌ల ఆఫర్‌కు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం పట్ల ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్‌లు నిరాశను వ్యక్తం చేశాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ వాటాదారులతోనే నేరుగా మాట్లాడాలని యోచిస్తున్న మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ భవిష్యత్తు కార్యాచరణ పట్ల కసరత్తు చేస్తోంది. తమ ఆఫర్ ఉత్తమమైనదని ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఎమ్‌డీ, సీఈఓ ట్యాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు.
ఫోర్టిస్ స్వల్పకాల రుణ అవసరాలను తీర్చడమే కాకుండా కంపెనీ దీర్ఘకాల లక్ష్యాల విషయంలో కూడా తమ ఆఫరే ఉత్తమమైనదని వివరించారు. ఫోర్టిస్ వాటాదారులు నిర్ణయం తీసుకునే ముందు బోర్డ్ ప్రతిపాదనను క్షుణ్నంగా సమీక్షిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్టిస్ ప్రతిపాదనను అంగీకరించాలో, వద్దో అన్న నిర్ణయాన్ని వాటాదారులు నిర్ణయించాలని మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఎమ్‌డీ, సీఈఓ రంజన్ పాయ్ వ్యాఖ్యానించారు.