హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమకు కీలక మార్కెట్లుగా మారాయని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్న దేశాయ్ తెలిపారు. 2022–23లో రెండు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల పైచిలుకు స్థూల ప్రీమియం (జీడబ్ల్యూపీ) వచి్చందని, దక్షిణాదిలో తమకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఈ ప్రాంతం నిలి్చందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా తమ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు.
తమ లైఫ్‌టైమ్ హెల్త్, ప్రైమ్ సీనియర్ పథకాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 2022–23లో దక్షిణాది మార్కెట్లో తమ జీడబ్ల్యూపీ 37 శాతం పెరిగి రూ. 500 కోట్లకు చేరినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 1,000 కోట్లకు పెంచుకోనున్నట్లు, కొత్త శాఖలను ప్రారంభించడంతో పాటు 10,000 మంది పైచిలుకు ఏజెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు సప్న వివరించారు. లైఫ్‌టైమ్ హెల్త్ ప్లాన్ కింద మణిపాల్‌సిగ్నా రూ. 50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు కవరేజీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించిన ప్రైమ్ సీనియర్ కింద 91 రోజుల తర్వాత నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు కూడా కవరేజీ ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment