Sapna
-
మణిపాల్‌సిగ్నాకు కీలక మార్కెట్లుగా తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమకు కీలక మార్కెట్లుగా మారాయని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్న దేశాయ్ తెలిపారు. 2022–23లో రెండు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల పైచిలుకు స్థూల ప్రీమియం (జీడబ్ల్యూపీ) వచి్చందని, దక్షిణాదిలో తమకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఈ ప్రాంతం నిలి్చందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా తమ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. తమ లైఫ్‌టైమ్ హెల్త్, ప్రైమ్ సీనియర్ పథకాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 2022–23లో దక్షిణాది మార్కెట్లో తమ జీడబ్ల్యూపీ 37 శాతం పెరిగి రూ. 500 కోట్లకు చేరినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 1,000 కోట్లకు పెంచుకోనున్నట్లు, కొత్త శాఖలను ప్రారంభించడంతో పాటు 10,000 మంది పైచిలుకు ఏజెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు సప్న వివరించారు. లైఫ్‌టైమ్ హెల్త్ ప్లాన్ కింద మణిపాల్‌సిగ్నా రూ. 50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు కవరేజీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించిన ప్రైమ్ సీనియర్ కింద 91 రోజుల తర్వాత నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు కూడా కవరేజీ ఇస్తోంది. -
నాడు ‘చిన్న సినిమాల శ్రీదేవి’... నేడు ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’...
ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు. సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి.. 1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది. వెబ్ సిరీస్‌లో బిజీ.. 2019లో పలు ఓటీటీ ప్లాట్ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె నటించిన ఎల్ఎల్డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా? -
టీమిండియా యువ ఓపెనర్‌కు ఎదురుదెబ్బ..! కష్టాలు తప్పకపోవచ్చు..
Prithvi Shaw- Sapna Gill: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం నేపథ్యంలో షాతో పాటు ముంబై పోలీసులకు కూడా గురువారం నోటీసులు ఇచ్చింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని ఓ స్టార్ హోటల్లో పృథ్వీ షా- సప్నా గిల్‌కు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చేతులు కలిపే ఇలా చేశారు ఈ నేపథ్యంలో తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు దురుసుగా మాట్లాడిన షా.. తనను అసభ్యంగా తాకాడంటూ సప్నా ఆరోపించింది. అతడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించడం లేదంటూ ఏప్రిల్ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సప్నా గిల్. పృథ్వీ షాతో పాటు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిసున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కశిఫ్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ.. ముంబై క్రికెటర్‌తో పోలీసులు చేతులు కలిపారని, తన క్లైంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని కోర్టుకు విన్నవించారు. సీసీటీవీ ఫుటేజీ చూస్తే నాటి గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే అసలు విషయమేమిటో అర్ధమవుతుందని పేర్కొన్నారు. తన క్లైంట్ అభ్యర్థన మేరకు పృథ్వీ షా, అతడికి సహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ధర్మాసనం సప్నా గిల్ అభ్యర్థన మేరకు నోటీసులు జారీ చేసింది. జూన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్బీ షుక్రే, ఎంఎం సతాయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటలో విఫలమవుతున్న షాకు సప్నా గిల్ రూపంలో వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదురవుతున్నాయంటూ అతడి అభిమానులు ఉసూరుమంటున్నారు. చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్ మొత్తం వాళ్లకే: హార్దిక్ -
Prithvi Shaw: అసలే దారుణ వైఫల్యం.. పృథ్వీ షాకు మరో భారీ షాక్!
Prithvi Shaw- Sapna Gill- Selfie Row: టీమిండియా యువ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షాకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2023లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న షాకు తాజాగా మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి సప్నా గిల్ అతడిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. కాగా ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ స్టార్ హోటల్ ఆవరణలో పృథ్వీ షా- సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. షాపై దాడి కేసులో సప్నా గిల్ సహా ఆమె వెంట ఉన్న వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షా అసభ్యంగా తాకాడంటూ ఆరోపణలు తాను, తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ తరచుగా ఆ హోటల్‌కు వెళ్తామని.. క్రికెట్ ఫ్యాన్ అయిన శోభిత్ పృథ్వీ షాను సెల్ఫీ అడుగగా అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ‘‘ఠాకూర్ టీనేజర్. తాగుబోతుల ప్రవర్తన ఎలా ఉంటుందో తనకి తెలియదు కదా! నిస్సహాయుడైన ఠాకూర్‌పై ఆ గుంపు దాడి చేయాలని చూసింది. అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గొడవకు దిగి ఠాకూర్‌ను గాయపరుస్తున్న షాను, అతడితో పాటు ఉన్న వాళ్లకు సర్ది చెప్పేందుకు మాత్రమే మధ్యలోకి వెళ్లాను’’ అని సప్నా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకి నెట్టివేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో బుధవారం.. ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించిన సప్నా గిల్.. పృథ్వీ షా, అతడి స్నేహితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బేస్‌బాల్ బ్యాట్‌తో తనను గాయపరచడం సహా తనని వేధించినందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా.. పృథ్వీ షాపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసిన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులపై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సప్నా గిల్ లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా షా ఐపీఎల్ పదహారో సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా 12, 7 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. చదవండి: బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్ -
‘లైట్’ వెయిట్
హ్యాపీ దీపావళి సప్న బరువు తగ్గిన క్రమం సప్నా వ్యాస్ పటేల్ వైద్య విద్యార్థిని. ఏడాది క్రితం 86 కిలోల బరువు ఉండేవారు. ఒక్క ఏడాదిలో 33 కిలోలు తగ్గి 53 కిలోలకు చేరుకున్నారు! సప్న వయసు 20. గుజరాత్ అమ్మాయి. 19 ఏళ్ల వయసులో ఆమె ఆరోగ్యంగానే కనిపించేవారు కానీ.. నడిచేందుకు, మెట్లెక్కి దిగేందుకు ఆయాసపడేవారు. ఒక్కోసారి తన ఫీలింగ్స్ హర్ట్ అయ్యేవట.. తన లావు గురించి ఎవరైనా మాట్లాడితే! దాంతో బరువు తగ్గాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు సప్న. తన శరీర స్వభావానికి తగ్గట్లు తన డైటింగ్‌ని మార్చుకున్నారు. ఇదిగో పై ఫోటోలోలా క్రమక్రమంగా సన్నబడ్డారు. ‘అరె.. సప్నా.. ఎంత సన్నబడిపోయావే? మాకు చెప్పవా ఆ సీక్రెట్ ఏంటో’ అని ఇరుగుపొరుగు, బంధువులు అడిగినప్పుడు (ఇప్పటికీ అడుగుతుంటారు) సప్న చెప్పే మాట ఒక్కటే. ‘ఎవరి లైఫ్‌స్టయిల్‌ను బట్టి వారికి డైట్ ప్లాన్, ఎక్సర్సైజ్ ప్లాన్ ఉంటుంది. దాన్ని ఫాలో అవడమే’ అని! నిజమే. మామూలు అనారోగ్యాలకంటే కూడా, లైఫ్ స్టెయిల్ వల్ల వచ్చే అనారోగ్యాలు ప్రమాదకరమైనవని కొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తూ వస్తోంది. సాధారణంగా జనవరి ఫస్ట్‌కి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. వెరైటీగా ఈసారి దీపావళికి తీసుకుందాం. బరువు తగ్గి... వచ్చే దీపావళిని మరింత తేలిగ్గా, ఆహ్లాదంగా జరుపుకుందాం.