‘లైట్’ వెయిట్ | 'Light' Weight | Sakshi
Sakshi News home page

‘లైట్’ వెయిట్

Oct 30 2016 12:29 AM | Updated on Sep 4 2017 6:41 PM

‘లైట్’ వెయిట్

‘లైట్’ వెయిట్

సప్నా వ్యాస్ పటేల్ వైద్య విద్యార్థిని. ఏడాది క్రితం 86 కిలోల బరువు ఉండేవారు.

 హ్యాపీ దీపావళి
సప్న బరువు తగ్గిన క్రమం


సప్నా వ్యాస్ పటేల్ వైద్య విద్యార్థిని. ఏడాది క్రితం 86 కిలోల బరువు ఉండేవారు. ఒక్క ఏడాదిలో 33 కిలోలు తగ్గి 53 కిలోలకు చేరుకున్నారు! సప్న వయసు 20. గుజరాత్ అమ్మాయి. 19 ఏళ్ల వయసులో ఆమె ఆరోగ్యంగానే కనిపించేవారు కానీ.. నడిచేందుకు, మెట్లెక్కి దిగేందుకు ఆయాసపడేవారు. ఒక్కోసారి తన ఫీలింగ్స్ హర్ట్ అయ్యేవట.. తన లావు గురించి ఎవరైనా మాట్లాడితే! దాంతో బరువు తగ్గాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు సప్న. తన శరీర స్వభావానికి తగ్గట్లు తన డైటింగ్‌ని మార్చుకున్నారు. ఇదిగో పై ఫోటోలోలా క్రమక్రమంగా సన్నబడ్డారు. ‘అరె.. సప్నా.. ఎంత సన్నబడిపోయావే? మాకు చెప్పవా ఆ సీక్రెట్ ఏంటో’ అని ఇరుగుపొరుగు, బంధువులు అడిగినప్పుడు (ఇప్పటికీ అడుగుతుంటారు) సప్న చెప్పే మాట ఒక్కటే.

‘ఎవరి లైఫ్‌స్టయిల్‌ను బట్టి వారికి డైట్ ప్లాన్, ఎక్సర్‌సైజ్ ప్లాన్ ఉంటుంది. దాన్ని ఫాలో అవడమే’ అని! నిజమే. మామూలు అనారోగ్యాలకంటే కూడా, లైఫ్ స్టెయిల్ వల్ల వచ్చే అనారోగ్యాలు ప్రమాదకరమైనవని కొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తూ వస్తోంది. సాధారణంగా జనవరి ఫస్ట్‌కి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. వెరైటీగా ఈసారి దీపావళికి తీసుకుందాం. బరువు తగ్గి... వచ్చే దీపావళిని మరింత తేలిగ్గా, ఆహ్లాదంగా జరుపుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement