feelings
-
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్‌ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు. బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు. ‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’, ‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’ వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది. ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు. ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది. మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం. ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది. నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ
కార్తీకేయ-2 సినిమా హిట్ తర్వాత అనుపమ క్రేజ్ పాన్ఇండియా రేంజ్లో పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత నిఖిల్‌తో 18పేజేస్‌లో కనిపించింది. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఈగల్లో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతే కాకుండా సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేరళ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చింది. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) అనుపమ మాట్లాడుతూ.. 'భావోద్వేగాలు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజయితీగా ఉంటా. నాకేదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా. ఆ విషయాన్ని అక్కడికక్కడే వదిలేస్తా. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ కొన్నాళ్లే ఉండేందుకు వచ్చాం.. మళ్లీ వెళ్లిపోతాం. ఆరోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. బతికి ఉన్న కొద్ది రోజులైనా మన ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి . సీసీ టీవీ పుటేజ్ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయినట్లు.. నా మెదడులోని చెత్తను డిలీట్ చేస్తుంటా.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: 30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!) -
మంచి మాట: దాటవలసిన మనోభావాలు
సత్యాలు వేరు; మనోభావాలు వేరు. ఎవరి మనోభావాలు వాళ్లవి. మనోభావాలు వ్యక్తులకు సంబంధించినవి; మనోభావాలు లేకుండా ఎవరూ ఉండరు. మనిషి అన్నాక మనోభావాలు తప్పకుండా ఉంటాయి. మనోభావాలు అనేవి వ్యక్తిగతమైనవి మాత్రమే. సత్యాలు సార్వజనీనమైనవి. మనోభావాల మత్తులో సత్యాల్ని కాదనుకోవడం, అందుకోలేకపోవడం, వదిలేసుకోవడం అనర్థదాయకం, అపాయకరం. మనోభావాలు కాదు సత్యాలు మాత్రమే అవసరమైనవి ఆపై ప్రయోజనకరమైనవి. మనోభావాలు దెబ్బతింటాయి లేదా దెబ్బతింటున్నాయి అనే మాటను మనం వింటూ ఉంటాం. మనోభావాలు దెబ్బతినడం అంటూ ఉండదు. వ్యక్తులలో ఉండే మనోభావాలు ఉన్నంత కాలం ఉంటాయి. కాలక్రమంలో పోతూ ఉంటాయి. మనోభావాలు అనేవి ప్రతి వ్యక్తికి వయసుతోపాటు మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఐదేళ్లప్పుడు ఉన్న మనోభావాలు పదేళ్లప్పుడు ఉండవు. పదేళ్లప్పటివి ఇరవై యేళ్లప్పుడు ఉండవు. వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, తెలివిని బట్టి, తెలివిడిని బట్టి మనోభావాలు అన్నవి వేరువేరుగా ఉంటాయి. విద్య, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాల్లోనూ, కళల్లోనూ, సార్వత్రికమైన విషయాల్లోనూ మనోభావాలు అనేవి అవసరం అయినవి కావు. సంఘ, ప్రపంచ ప్రయోజనాలపరంగా మనోభావాలు అనేవి ఎంత మాత్రమూ పనికిరావు. మానవ ప్రయోజనాలపరంగా సత్యాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలు చర్చనీయమూ, పరిగణనీయమూ అవవు. ఒక వ్యక్తి మనోభావాలు మరో వ్యక్తికి, సమాజానికి అక్కర్లేనివి. మనోభావాలు, మనోభావాలు అని అంటూ ఉండడమూ, తమ మనోభావాలు ముఖ్యమైనవి లేదా విలువైనవి అని అనుకుంటూ ఉండడం మధ్యతరగతి జాడ్యం. మనోభావాలు ప్రాతిపదికగా వ్యవహారాలు, సంఘం, ప్రపంచం నడవవు. ఈ విజ్ఞత ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. మనం మన మనోభావాలవల్ల మనకు, సంఘానికి సమస్యలం కాకూడదు. మన మనోభావాలు మనల్నే అడ్డగించే గోడలుకాకూడదు. మన మనోభావాలకు మనమే గుద్దుకోకూడదు. మనోభావాలు మనుగడ మునుసాగడాన్ని ఆపెయ్యకూడదు. మనిషి జీవితంలో ఒక మేరకు వరకే మనోభావాలకు స్థానాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనోభావాలకు అతీతంగా మనుగడను ముందుకు తీసుకువెళ్లడం మనిషి నేర్చుకోవాలి. మనోభావాలకు కట్టుబడి ఉండడం ఒక మనిషి జీవనంలో జరుగుతున్న తప్పుల్లో ప్రధానమైంది. స్వేచ్ఛగా సత్యాల్లోకి వెళ్లడం, వాటివల్ల స్వేచ్ఛను పొందడం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం. సత్యాలవల్ల వచ్చే స్వేచ్ఛ దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. తమ మనోభావాల్ని అధిగమించినవాళ్లే సత్యాలలోకి వెళ్లగలరు. సత్యాలను ఆకళింపు చేసుకోగలిగితే మనోభావాలు, మనోభావాలవల్ల కలిగే కష్ట, నష్టాలు చెరిగిపోతాయి. మతం, కులం, ప్రాంతీయత, ఉగ్రవాదం వంటివాటివల్ల జరుగుతున్న హానికి, అల్లకల్లోలానికి మనోభావాలే కారణం. మనిషికి సత్యాలపై తెలివిడి వచ్చేస్తే ఈ తరహా దుస్థితి, దుర్గతి ఉండవు. హిట్లర్ మనోభావాల కారణంగా ప్రపంచయుద్ధమే వచ్చి ప్రపంచానికి పెనుచేటు జరిగింది. మనోభావాలకు అతీతంగా సత్యాలపై ఆలోచన, అవగాహన హిట్లర్‌కు, మరికొంతమందికి ఉండి ఉంటే రెండో ప్రపంచయుద్ధం జరిగేదే కాదు. మనోభావాలవల్ల కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో దారుణాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి, జరుగుతున్నాయి. చరిత్రను, సమాజాన్ని, మనపక్కన ఉన్న కుటుంబాల్ని పరిశీలిస్తే ఈ సంగతి తెలియవస్తుంది. మన మనోభావాలను మనవరకే మనం పరిమితం చేసుకోవాలి. మన మనోభావాలకు తగ్గట్టు విషయాల్ని, ఇతరుల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. మన మనోభావాల ప్రాధాన్యతకు ఉన్న హద్దుల్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. మనోభావాలను దాటి సత్యాల ఆవశ్యకతను తెలుసుకుందాం; సత్యాలను ఆకళింపు చేసుకుందాం; సత్యాలవల్ల సత్ఫలితాలను పొందుదాం. సత్యాల సత్వంతో సరైన, సఫలమైన జీవనం చేస్తూ ఉందాం. – రోచిష్మాన్ -
నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా..
‘ఓ నటిగా భాషాపరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్ కాలేదు’ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ– ‘‘రాత్రికి రాత్రే నాకు సక్సెస్ రాలేదు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్‌పై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన నా ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది ఈ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు. కాగా రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రాలు ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ‘వారసుడు’, ‘యానిమల్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు రష్మిక. -
నేనేం రోబోను కాదు.. మనిషినే!: ఎలన్ మస్క్
ఎలన్ మస్క్.. ఈ వ్యక్తి మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఈయన్ని తిక్కలోడుగా భావిస్తుంటే.. ఎక్కువ మంది మాత్రం ఆయన్నొక మేధావిగా భావిస్తుంటారు. అయితే యువతకు మాత్రం ఆయనొక ఫేవరెట్ ఐకాన్. ఎవరేమీ అనుకున్నా.. తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఈ క్రమంలో ఆయన వ్యక్తిత్వం మీద పలువురికి అనుమానాలు కలగవచ్చు. అయితే అందరిలా తనకూ భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు ఎలన్ మస్క్. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక తొలిసారి ఎలన్ మస్క్ జనం మధ్యకు వచ్చాడు. న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా వార్షికోత్సవానికి ఈ అపర కుబేరుడు తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలను భరించేంత గుణం తనలో లేదని వ్యాఖ్యానించాడాయన. మీడియా, ఇంటర్నెట్లో నా మీద వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తుంటుంది. కానీ.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. నేనేం రోబోను కాను.. అందరిలా మనిషినే అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆ టైంలో నాకూ బాధ అనిపిస్తుంటుంది. కానీ, వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని, ప్రత్యేకించి ఆన్లైన్ ట్రోల్స్ విషయంలో అని ఆయన అన్నారు. అన్నట్లు.. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్.. చాడ్విక్ బోస్మాన్ నివాళి ట్వీట్ కాగా, రెండో స్థానంలో నిలిచింది ఎలన్ మస్క్ ఈ మధ్య ‘కోకా-కోలా’ను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ చేసిన ట్వీట్. చదవండి: ఆ పని చేస్తే నాకు నష్టం.. ఐనా పర్లేదు- ఎలన్ మస్క్ -
నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి : ఆర్జీవీ షాకింగ్ పోస్ట్
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనరూటే సెపరేటు అంటాడు. ఏ అంశాన్ని అయినా అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ఇక తనకెలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేవని చెప్పుకునే వర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశాడు. కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వర్మ నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఇతర జీవరాశులపై ఎలాంటి ప్రేమ లేదని చెప్పిన వర్మ లేటెస్ట్ ఫోటోతో అందరికి షాక్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) -
ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఆ షో విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు కేవలం ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అవుతున్న కరణ్ జోహార్ బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్‌లో ఒకరైన షమితా శెట్టి మొదటి సారి తన వ్యక్తిగత విషయాలను మరో కంటెస్టెంట్‌తో పంచుకొని ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి అనే విషయం తెలిసిందే. నా మొదటి ప్రేమ అలా.. తన తోటి కంటెస్టెంట్ నేహాతో జరిగిన సంభాషణలో.. తన మొదటి బాయ్‌ఫ్రెండ్ కారు ప్రమాదంలో మరణించాడని తెలిపింది. ఆ సమయంలో అతనితో తన అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది. అయితే వ్యక్తిగత విషయాల్లో ఎంతో గోప్యంగా ఉండే ఆమె ఇలాంటి విషయాలు పంచుకోవడం విశేషం. అనంతరం షమితా రాకేష్ బాపత్‌తో మాట్లాడుతూ.. ‘ఆమె ఒంటరిగా ఉన్నా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండేదని, కానీ కోవిడ్ వల్ల విధించిన లాక్డౌన్ సమయంలో మాత్రం ఒంటరితనంగా ఫీల్ అయినట్లు’ తెలిపింది. అలాగే తన తండ్రి మరణానంతరం తన భుజాలపై పడిన బాధ్యతల గురించి కూడా ఆ బ్యూటీ వివరించింది. ఇంకా శిల్పా సోదరిగానే.. ‘నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పైనే గడిచిపోయాయి. ఇప్పటి వరకు అందరూ నన్ను శిల్పాశెట్టి సోదరిగానే గుర్తిస్తున్నారు. ఆమె నాకు నీడలా ఉంది. అది నాకు సంతోషంగానే ఉన్నప్పటికి నా గురించి నిజం జనాలకు తెలీదు’ అని షోలో షమితా శెట్టి తెలిపింది. ఆ నీడ నుంచి బయటపడి తను ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా షో చూసిన వారికి ఎవరికైనా షమితా శెట్టి, రాకేష్ బాపత్కి మధ్య మంచి బంధం ఉందనే విషయం అర్థమవుతుంది. రాకేష్ అంటే తనకి ఇష్టమని, కానీ అవసరమైన సమయంలో తనని డిఫెండ్ చేసేవాడు తనకి కావాలని ఆమె షోలో చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: Bigg Boss 5 Telugu: మా అమ్మతో రవికి గట్టిగానే ఉంటుంది: మానస్ -
నవ్వుల సడినీ, విషాదపు తడినీ కొలిచేస్తారు సుమండీ!
వర్షించే మేఘాలనూ, శీతాకాలం వణికించే మంచురాత్రులనూ, సెగలుపుట్టించే వేసవి వేడినీ కొలిచే సాధనాలున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ మానవాళి ముఖకవళికలను బట్టి వారిలోని ఆనందాశ్చర్యాలకూ లెక్కకట్టేస్తున్నారు పరిశోధకులు. మీలోని దుఃఖాన్నీ, ఆనందాన్నీ, కోపాన్నీ, విషాదాన్నీ స్కేల్‌తో కొలిచిమరీ మీ అభివ్యక్తిని ఇట్టే పట్టేస్తారు. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? ఉంటే ఎంత సంతోషంగా ఉన్నారు? కోపమా? అయితే దాని బరువెంత? ఇలా మీ ముఖాన విరిసే అన్ని హావభావాలనూ ముఖ కండరాల కదలికలను బట్టి అంచనా కట్టేస్తున్నాయి తాజా అధ్యయనాలు. అలా లెక్కలు వేసే ప్రపంచంలో ఎన్ని రకాల నవ్వులు పూయించొచ్చో, ఎన్ని రకాలుగా మీలోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారో తేల్చి చెప్పేశారు. ఆనందానికి 17 వ్యక్తీకరణలు.. ప్రపంచవ్యాప్తంగా మనుషులు విసుగుని ప్రదర్శించడానికి ఒకే ఒక్క ముఖ కవళిక ఉందట. కానీ మనలోని సంతోషాన్నీ, ఆనందాన్నీ, ఉట్టిపడే ఉల్లాసాన్నీ 17 రకాలుగా మనం వ్యక్తీకరిస్తున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మనలో భయాన్ని మాత్రం కేవలం మూడు రకాలుగా ప్రదర్శిస్తున్నాం. ఆశ్చర్యాన్ని నాలుగురకాలుగా అభివ్యక్తీక రిస్తే, ప్రపంచ ప్రజలంతా తమలోని కోపాన్నీ, విషాదాన్నీ మాత్రం ఐదు విభిన్న ముఖ కవళికల ద్వారా, ముఖాకృతుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. మన ముఖంలోని కండరాల కదలికలను బట్టి మన నవ్వునీ, నవ్వుతున్న ప్పుడు మన కళ్ళ దగ్గర పడే చర్మపు ముడతలని బట్టి మనలోని ఆనందాన్ని చాలా సునాయాసంగా కొలిచేయొచ్చంటున్నారు పరిశోధకులు. ‘‘ఈ పరిశోధన చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే సంతోషంలోని క్లిష్టమైన విషయాలెన్నింటినో ఇది విడమరిచి చెప్పింది’’అని ఓహియో యూనివర్సిటీ అధ్యాపకులు అలెక్సీ మార్టినెజ్ పేర్కొన్నారు. 35 రకాల ఎమోషన్స్ కామన్ మనుషులు తమలోని ఆనందం, కోపం, సంతోషం, దుఃఖం, విషాదం లాంటి ఉద్విగ్నభరిత క్షణాలను వేనవేల రకాలుగా వ్యక్తీకరిస్తుంటారు. అయితే అందులో కేవలం 35 రకాల అభివ్యక్తులు మాత్రమే ఉంటాయని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వివిధ రకాల ఫీలింగ్స్‌ని వివరించే 821 రకాల పదాలను ఇంటర్నెట్లో పరిశోధించి వాటిని మనుషుల ముఖాభినయాలతో పోల్చి చూసినట్టు ఐఈఈఈ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో వివరించారు. స్పానిష్లోనూ, చైనా భాషలోకీ, పార్సీ, రష్యన్ మొదలుకొని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల్లోని మొత్తం 31 దేశాల భాషల్లోకి ఈ పదాలను అనువదించి సంబంధిత ముఖచిత్రాలతో పోల్చి చూశారు. ఈ అధ్యయనంలో దాదాపు 72 లక్షల ఫొటోల్లోని ముఖాభినయాలను పరిశీలించారు. అయితే కంప్యూటర్ ఆల్గరిథమ్స్ ఆధారంగా ముఖ కండరాల కదలికలను బట్టి 16,384 రకాలుగా మనుషులు తమలోని భావోద్వేగాలను వ్యక్తీకరించగలరని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. అయితే 72 లక్షల ఫొటోలను పరిశీలించిన మీదట అందులో 35 రకాల ఎమోషన్స్ సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. -
నవ్వు ముఖం
‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చొని ఉంది అన్విత. ‘‘చెప్పండి’’ అన్నాడు సైకియాట్రిస్ట్ గట్టిగా గుండె లోపలికి గాలి పీల్చుకుని.అన్వితకు పాతికేళ్ల వరకు ఉంటాయి. పెళ్లి కాలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా ఉంది. ఆయన ఎందుకంత గాఢంగా గుండె లోపలికి గాలి పీల్చుకోవలసి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. బీపీ చెక్ చేసే డాక్టర్లా ఈ సైకియాట్రిస్ట్‌లు దేహం లోపలి విపత్తుల్ని, విలయాలను సంకేతపరిచే ఫీలింగ్స్ ఏవో అప్పుడప్పుడూ పెడుతుండటం గురించి ఆమెకు తెలుసు. ఇప్పుడీ సైకియాట్రిస్ట్ కూడా ఏ కారణమూ లేకుండానే అదే విధమైన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి గుండె లోపలికి గాలిని పీల్చుకొని ఉండి ఉండొచ్చని ఆమె అనుకుంది. ‘‘మీవన్నీ అనవసర భయాలు’’ అన్నాడు డాక్టర్ తరుణ్.ఆ నగరంలో పేరున్న సైకియాట్రిస్ట్ అతను. మనిషి డాక్టర్లా ఉండడు. దెయ్యాలు పట్టేవాడిలానో, దెయ్యాల పనిపట్టేవాడిలానో ఉంటాడు. కానీ నవ్వు ముఖం. దెయ్యాల భయం ఉన్నవారికి అతడిని చూస్తే మందు చీటీ రాయకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ‘దెయ్యాల్ని మించినవాyì దగ్గరికే వచ్చాం’ అన్న దగ్గరి భావం ఏదో అతడి పట్ల కలుగుతుంది రోగికి. అయితే అలాంటి భావం అన్వితకు కలిగినట్లు లేదు. ‘‘ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అన్నాడు డాక్టర్ తరుణŠ . అతడికో అలవాటుంది. వచ్చినవాళ్లు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోడానికి ముందే.. ‘మీవన్నీ అనవసర భయాలు, ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అంటుంటాడు. ఇప్పుడు అన్వితతోనూ ఆ రెండు మాటలు అన్నాడు. అన్విత ఆశ్చర్యంగా చూసింది.‘‘నన్ను నేను రోగి అనుకోవడం లేదు డాక్టర్. భయపడుతున్నానంతే. ఆ భయమే రోగం అని మీరు అంటే కనుక.. ‘అప్పుడు.. ధైర్యం కూడా రోగమే అవ్వాలి కదా డాక్టర్’ అని నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సంకోచించను’’ అంది అన్విత. ఆ మాటకు నివ్వెరపోబోయి ఆగాడు డాక్టర్ తరుణ్. ‘‘మీ లాజిక్ బాగుంది. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉంటారని నాకు నమ్మబుద్ధేస్తోంది’’ అన్నాడు. ‘‘నమ్మబుద్ధి కావడం ఏంటి డాక్టర్?’’ అని ప్రశ్నించింది అన్విత విస్మయంగా. ‘‘నా ఉద్దేశం.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌నని నాతో చెప్పుకున్నారనీ, మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌లా నాకు అనిపించకపోయినప్పటికీ.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అని నాకు నమ్మబుద్ధేస్తోందని చెప్పడం కాదు మిస్ అన్వితా’’ అన్నాడు తరుణ్. ‘‘మరి!’’ అంది అన్విత.‘‘మీరు ఫిలాసఫీ స్టూడెంట్ అయి ఉండడం అన్న నా ఫీలింగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే.’’ ‘‘ఓకే.. డాక్టర్. నా సమస్య భయమూ కాదు, ధైర్యమూ కాదు. జస్ట్ సమస్య. ఆ సమస్యను నేను మానసిక ఆరోగ్యమనీ, మానసిక అనారోగ్యమనీ అనుకోవడం లేదు. దానర్థం చికిత్స కోసం నేను మీ దగ్గరకు రాలేదని కాదు. నేనూ మీతో కొన్ని ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంది. చెప్పమన్నట్లు చూశాడు తరుణ్. ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్ తరుణ్. అన్విత అందంగా ఉంటుంది. తెలిసిన వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులకు కూడా ఆమెను ఫాలో అవ్వాలని అనిపించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘‘ఒకప్పుడు నేనతన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించే స్థితిలో లేను. తను మాత్రం నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు’’‘‘చివరిసారి మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడు?’’ అడిగాడు తరుణ్. ‘‘చివరిసారి, మొదటిసారి అనేం లేదు డాక్టర్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నన్ను ఫాలో అయ్యాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఫాలో అయి ఏం చేస్తాడు?’’‘‘నువ్వంటే ఇష్టం అంటాడు. నువ్వు లేందే బతకలేనంటాడు. నీతో పాటు వచ్చేస్తానంటాడు’’‘‘హెడ్డేక్గా తయారయ్యాడంటారు. అంతేనా?’’అన్నాడు తరుణ్. ‘‘లేదు లేదు. అలాంటిదేం లేదు’’ ‘‘మరేంటి’’? ‘‘మా నాన్న నాకు వేరే సంబంధం తెచ్చారు. మా ఇద్దరికీ ఉన్న ప్రేమబంధం గురించి చెప్పాను. ‘వాణ్ణి చంపేస్తాను’ అని పెద్దగా అరిచారు. ‘వద్దు నాన్నా.. నా ప్రేమను చంపుకుంటాను. అతన్ని చంపకు’ అని నాన్న కాళ్లు పట్టుకున్నాను. నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ‘నా మాట విను. నీ జీవితం బాగుంటుంది’ అన్నాడు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న మాట వింటే నా జీవితం బాగుంటుందా, బాగుండదా అని నేను ఆలోచించలేదు. నాన్న మాట వినదలచుకున్నాను. నాన్న కోసం.. అతనిపై నాకున్న ప్రేమను చంపుకోడానికి నేను తయారైపోయాను కానీ, నాపై ఉన్న ప్రేమను చంపుకోడానికి అతను సిద్ధంగా ఉంటాడా అని ఆలోచించలేకపోయాను’’ అంది అన్విత. డాక్టర్ తరుణ్ మౌనంగా వింటున్నాడు. ఈ అమ్మాయి తన సమస్యను ఎక్కడికి తెచ్చి ఆపుతుందా అని అతడు ఎదురుచూస్తున్నాడు. ‘‘అతను నాకు సమస్య కాదు డాక్టర్. నేనే అతనికి సమస్యగా మారానేమోనని సందేహంగా ఉంది’’ అంది అన్విత.తరుణ్ నివ్వెరపోయాడు. మనసులోని విషయం గ్రహించినట్లే మాట్లాడింది అనుకున్నాడు. ‘‘అతన్ని చూడాలని అనిపించినప్పుడు అతనికి కనిపించకుండా దూరం నుంచి చూడొచ్చు. కానీ నేను అతన్ని చూస్తున్నప్పుడు అతను నన్ను చూడాలన్న కోరిక అతనికి నేను కంటపడేలా చేస్తోంది. ఆవెంటనే అతను నా వెంటపడుతున్నాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీకొచ్చిన సమస్యేమీ కనిపించడం లేదు అన్వితా. అతను మిమ్మల్ని ఫాలో అవడం మీకూ సంతోషమే కదా. నిజానికి మీరే అతన్ని మీ వెంటపడేలా చేసుకుంటున్నారు’’ అని నవ్వాడు తరుణ్. ‘‘నా భయం కూడా అదే డాక్టర్. నా సంతోషం కోసం అతన్నేమైనా నేను దుఃఖంలో ముంచేస్తున్నానా అని. ఆ ఫీలింగ్‌ని షేర్ చేసుకోడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’’ అంది అన్విత. ‘‘కానీ.. నాదొక సందేహం అన్వితా. మీ నాన్నతో అన్నారు కదా. అతనిపై మీకున్న ప్రేమను చంపుకుంటానని. మళ్లీ ఇదేమిటి?’’ అన్నాడు తరుణ్. ‘‘అవును డాక్టర్.అయితే ప్రేమను చంపుకోవడం కష్టమని నాకు తర్వాత తెలిసింది’’. ‘‘తర్వాత అంటే?’’‘‘ఆత్మలు మనుషుల మీద ప్రేమను చంపుకోలేక ఆ మనుషుల చుట్టూ తిరుగుతున్నట్లే.. ఆత్మలు కనిపించినప్పుడుమనుషులూ ఆత్మల మీద ప్రేమను చంపుకోలేక ఆ ఆత్మ చుట్టూ తిరుగుతారని నాకు తెలిశాక’’.. చెప్పింది అన్విత.డాక్టర్ తరుణ్‌ది నవ్వు ముఖం.అన్విత అలా చెప్పాక.. ముఖం మాత్రమే మిగిలింది. - మాధవ్ శింగరాజు -
కన్నుల్లో నీ వ్యక్తిత్వమే..
మెల్బోర్న్: ప్రేమ, ద్వేషం, కోపం, ఈర్ష్య, సిగ్గు ఇలా మన కళ్లు అనేక భావాలను అందంగా పలికించగలవు. అందుకేనేమో.. గుండెల్లో ఏముం దో కళ్లలో తెలుస్తుంది.. అంటాడు ఓ సినీ గేయ కవి. నయనాలు.. నవరసాలను మాత్రమే కాదు మనిషి వ్యక్తిత్వాన్ని కూడా తెలుపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కళ్లను చదివి.. ఓ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే కొత్త తరహా కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన సాంకేతిక కళ్ల కదలికలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుందని అంటున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్, ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ వర్సిటీకి చెందిన పరిశోధకులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయో గించి కళ్ల కదలికలు, వ్యక్తిత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనా న్ని చేపట్టారు. దీనిలో భాగంగా 42 మంది వ్యక్తు లను ఎంపిక చేసుకుని నిర్దిష్టమైన ప్రశ్నలతో పాటు రోజువారీ పనుల్లో వారి కళ్ల కదలికలను నమోదు చేసుకున్నారు. ముఖ్యమైన 5 వ్యక్తిత్వ లక్షణాల్లో 4 లక్షణాలను కచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ గుర్తించిందని తెలిపారు. -
మన ఫీలింగ్స్ చెప్పేస్తాయ్!
సాధారణంగా ఎవరైనా తక్కువగా మాట్లాడితే.. వాడి మనసులో మాట తెలుసుకోవడం చాలా కష్టం రా బాబూ అంటుంటాం. అయితే అలాంటి వారి మనసులో మాట కూడా బయటపెట్టొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. ఎలా అంటే కేవలం శరీరాన్ని స్కాన్ చేయడం ద్వారా మనసులో మనం ఏం ఆలోచిస్తున్నాం.. మన ఫీలింగ్స్‌ను కూడా తెలుసుకోవచ్చట. భవిష్యత్తులో రాబోయే కెమెరాలు.. చిన్న చిన్న పరికరాల ద్వారా ఇది సాధ్యపడుతుందని డాల్బీ ల్యాబ్స్ అధినేత, న్యూరో శాస్త్రవేత్త పాపీ క్రమ్ చెబుతున్నారు. థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, మనసును చదివే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ అనే పరికరాలను ఉపయోగించి మనసును చదివేయొచ్చంటున్నారు. గుండె కొట్టుకునే వేగం.. చర్మానికి అతికించే సెన్సర్ల నుంచి అందే సమాచారం ద్వారా మనసులో ఏం అనుకుంటున్నారో వలంటీర్లను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ‘వేరే వ్యక్తికి ఏం తెలుసు.. ఏం చూస్తున్నాడు.. ఏం అర్థం చేసుకున్నాడు.. ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సంతోషం.. బాధ.. ఇలా మనసులో ఉన్న భావాలన్నింటినీ గుర్తించొచ్చు’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటికే సాంకేతికత ద్వారా నిజం నవ్వుకు.. అబద్ధపు నవ్వుకు మధ్య తేడాను గుర్తించాయి.. ఇదే సాధ్యం అయినప్పుడు భావాలను గుర్తిస్తామనడంలో సందేహం లేదు’ అని స్పష్టం చేశారు. అతి త్వరలో మనసును చదివే పరికరాలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అంటే మన వ్యక్తిగత సమాచారానికే భద్రత లేదని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో మన మనసులో భావాలకు కూడా రక్షణ కరువయ్యే రోజులు దగ్గర పడ్డాయన్న మాట. -
‘లైట్’ వెయిట్
హ్యాపీ దీపావళి సప్న బరువు తగ్గిన క్రమం సప్నా వ్యాస్ పటేల్ వైద్య విద్యార్థిని. ఏడాది క్రితం 86 కిలోల బరువు ఉండేవారు. ఒక్క ఏడాదిలో 33 కిలోలు తగ్గి 53 కిలోలకు చేరుకున్నారు! సప్న వయసు 20. గుజరాత్ అమ్మాయి. 19 ఏళ్ల వయసులో ఆమె ఆరోగ్యంగానే కనిపించేవారు కానీ.. నడిచేందుకు, మెట్లెక్కి దిగేందుకు ఆయాసపడేవారు. ఒక్కోసారి తన ఫీలింగ్స్ హర్ట్ అయ్యేవట.. తన లావు గురించి ఎవరైనా మాట్లాడితే! దాంతో బరువు తగ్గాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు సప్న. తన శరీర స్వభావానికి తగ్గట్లు తన డైటింగ్‌ని మార్చుకున్నారు. ఇదిగో పై ఫోటోలోలా క్రమక్రమంగా సన్నబడ్డారు. ‘అరె.. సప్నా.. ఎంత సన్నబడిపోయావే? మాకు చెప్పవా ఆ సీక్రెట్ ఏంటో’ అని ఇరుగుపొరుగు, బంధువులు అడిగినప్పుడు (ఇప్పటికీ అడుగుతుంటారు) సప్న చెప్పే మాట ఒక్కటే. ‘ఎవరి లైఫ్‌స్టయిల్‌ను బట్టి వారికి డైట్ ప్లాన్, ఎక్సర్సైజ్ ప్లాన్ ఉంటుంది. దాన్ని ఫాలో అవడమే’ అని! నిజమే. మామూలు అనారోగ్యాలకంటే కూడా, లైఫ్ స్టెయిల్ వల్ల వచ్చే అనారోగ్యాలు ప్రమాదకరమైనవని కొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తూ వస్తోంది. సాధారణంగా జనవరి ఫస్ట్‌కి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. వెరైటీగా ఈసారి దీపావళికి తీసుకుందాం. బరువు తగ్గి... వచ్చే దీపావళిని మరింత తేలిగ్గా, ఆహ్లాదంగా జరుపుకుందాం. -
అదే లక్ష్యం
జాతీయ స్థాయిలో విజయం దిశగా పయనం రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారుల మనోగతం బరిలో దూకి.. ‘కూత’ పెట్టి జాతీయ స్థాయికి ఎదగడమే కాకుండా చాలామంది ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లాకు చెందిన కె.శ్రీనివాస్ అంతర్జాతీయ కబడ్డీలో బంగారు పతకం సాధించారు. కె.పవన్ వెంకటకుమార్ జిల్లా జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంటులో హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అలాగే కబడ్డీ కోటాలో ఎ.నవీన్‌కుమార్ పోస్టల్, ఆర్తీవదన్ ఇండియన్ ఆర్మీలో, కిర్లంపూడికి చెందిన మణికంఠ పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లా మహిళా కబడ్డీ టీములో కిర్లంపూడికి చెదిన వరమాణిక్యం (అంతర్జాయ గోల్డ్ మెడల్), కాకినాడకు చెందిన దైవకృప జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం, కాకినాడకు చెందిన శివజ్యోతి, గొల్లపాలేనికి చెందిన సత్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. సామర్లకోటకు చెందిన పోతుల సాయి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా శ్రీకాకుళంలో పని చేస్తున్నారు. ఇదే పట్టణానికి చెందిన బోగిళ్ల మురళీకుమార్ రెండుసార్లు ప్రో కబడ్డీకి అంపైర్‌గా జిల్లా నుంచి వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీల ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఇటువంటివారి స్ఫూర్తితో తాము కూడా జాతీయ స్థాయిలో విజయం సాధించడమే లక్ష్యంగా పయనిస్తున్నామని అంటున్నారు కబడ్డీ క్రీడాకారులు. ఎ¯Œæటీఆర్ స్మారక 64వ రాష్ట్రస్థాయి పురుషులు, స్త్రీల కబడ్డీ పోటీలు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూలు వెనుక ఉన్న పల్లంబీడు స్థలంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ‘సాక్షి’కి తమ లక్ష్యాలను వివరించారు. – సామర్లకోట శిక్షణ ఇచ్చేవారు ఉండటంతోనే.. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో చదువుకొంటున్న సమయంలో ఆరో తరగతి నుంచి కబడ్డీలో మురళీకుమార్ శిక్షణ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించాను. కబడ్డీ కోటాలో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం వచ్చింది. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు కప్పు సాధిస్తాం. – కె.శ్రీనివాస్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, తూర్పు గోదావరి జిల్లా తండ్రి స్ఫూర్తితో రాణింపు మా తండ్రి ఆశయం కోసం కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ పోటీలో పాల్గొని బెస్ట్ రైడర్‌గా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాను. – ఎస్ఎల్ శివజ్యోతి, కరప మండలం, తూర్పు గోదావరి ఒలింపిక్స్‌లో చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం ఒలింపిక్స్‌లో కబడ్డీ జట్టును చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం. మంచి క్రీడాకారులు ఉన్నారు. 2011 నుంచి కబడ్డీ ఆడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాం. స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంట్లో పని చేస్తున్నాను. – ఎం.మహేష్‌బాబు, కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా మంచి క్రీడాకారులను తయారు చేయాలి పదమూడు సంవత్సరాలుగా కబడ్డీలో ప్రతిభ చూపుతూ, ప్రైవేటు పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. కబడ్డీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, మహిళా క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వాలని ఉంది. – ఎన్.నవ్య, కృష్ణా జిల్లా పోలీసు కావాలని లక్ష్యం కబడ్డీ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉంది. 2011 నుంచి కబడ్డీ జట్టులో ఆడుతున్నాను. మా పాఠశాల పీఈటీ కె.అమ్మయ్యచౌదరి తర్ఫీదుతో కబడ్డీలో రాణిస్తున్నాను. సీనియర్ నేషనల్స్ ఆడాను. – ఎన్.నాగలత, ప్రకాశం జిల్లా జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి ఇండియన్ కబడ్డీ టీములో స్థానం సంపాదించి, అంతర్జాతీయ పోటీలో పాల్గొని, బహుమతి సా«ధించాలని ఉంది. స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. – ఎం.గౌరి, శ్రీకాకుళం అన్నయ్య స్ఫూర్తితో.. అన్నయ్య గంగాధర్‌రెడ్డి చెడుగుడు పోటీల్లో మంచి క్రీడాకారునిగా గుర్తింపు పొందాడు. ఆయన స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాను. – పి.లీలావతి, గుంటూరు జిల్లా కోచ్‌గా ఎదగాలని ఉంది కబడ్డీలో పూర్తిస్థాయి మెళకువలు తెలుసుకొని జిల్లా కబడ్డీ కోచ్‌గా ఎదగాలని ఉంది. పీఈటీ సుబ్బరాజు స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టాను. – షబానా, కర్నూలు జిల్లా చిన్నతనం నుంచీ మక్కువ గ్రామీణ స్థాయిలో నాకు చిన్నతనం నుంచీ కబడ్డీ అంటే మక్కువ. 13 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇండియన్ క్యాంప్ నిర్వహించాను. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నాను. కబడ్డీ అసోసియేషన్ నాయకులు వీరలంకయ్య, రాంబాబుల ప్రోత్సాహం ఉంది. – శ్రీకృష్ణ, ప్రకాశం జిల్లా అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. అమ్మానాన్నలకు కబడ్డీ అంటే ఇష్టం. వారి ప్రోత్సాహంతో కబడ్డీ టీములో స్థానం సంపాదించాను. పీఈటీ గంగాధరం ఎంతో ప్రోత్సహించారు. భారత జట్టులో స్థానం సంపాదించాలని ఉంది. – కె.మౌనిక, చిత్తూరు జిల్లా యూనివర్సిటీలో బంగారు పతకం యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాను. కబడ్డీలో ప్రవేశానికి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా కబడ్డీలో మెళకువలు నేర్చుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో మంచి కోచ్ కావాలని ఉంది. – బి.సంధ్య, పశ్చిమ గోదావరి జిల్లా -
భౌ... వావ్!
టెక్ టాక్ ‘‘మనసున మనసై... బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమూ అదే సౌఖ్యమూ’’ పాతకాలం సినిమా పాట ఇది. ఫొటోలో కనిపిస్తున్న డామ్గీ రోబోకు... ఈ వర్ణన అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటారా? ఈ రోబో కుక్కపిల్ల కూడా మీ ఇంట్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది కాబట్టి! అంతలేసి కళ్లు మిటకరిస్తూ... ఇంట్లో ఉన్నవారందరి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. అందుకు తగ్గట్టుగా పలకరిస్తుంది కూడా. మీ ముఖంలో ఫీలింగ్స్‌ను పసిగట్టి ఒకవేళ మీ మూడ్ బాగా లేదనుకుంటే మంచి సంగీతం వినిపిస్తుంది.. లేదా మీకిష్టమైన పనేదో చేసి మిమ్మల్ని మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేరనుకోండి.. ఇల్లంతా కలియదిరుగుతూ కొత్తవాళ్లెవరూ చొరబడకుండా కాపలా కాస్తూ ఉంటుంది కూడా. దీని ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. మీరు సోఫాలో జారగిలబడి టీవీ చూస్తున్నప్పుడు.. ఛానల్ మార్చేందుకు కూడా బద్దకించే వేళ డామ్గీ మీ టీవీ రిమోట్ అయిపోతుంది. ఒక్క మాటతో నచ్చిన ఛానల్‌ను తెరపైకి తెచ్చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతూంటే.. తానంతటతనే ప్లగ్ ఎక్కడుందో వెతుక్కుని రీఛార్జ్ చేసుకుంటుంది కూడా. అన్నిటికన్నా సదుపాయం... మనం ఈ కుక్కపిల్ల మూతీ ముక్కు తుడిచే పని లేదు. బయట ఎక్కడికీ తిప్పనవసరం లేదు. రూబో అనే చైనీస్ కంపెనీ తయారు చేసిన ఈ తొమ్మిది అంగుళాల రోబో కుక్కపిల్ల త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. -
సంకెళ్లు తెంచిన కుంచె
అది కారాగారం. అక్కడ గొలుసు తెంచుకుపోయిన వాళ్ల దగ్గర్నుంచి గొంతుకోసిన వాళ్ల దాకా ఎందరో.. చేసిన తప్పుకు వేసిన శిక్షను భరిస్తూనే... అలా చేయకుండా ఉంటే బాగుండేదనే ఆలోచన చేస్తున్నవాళ్లు ఎందరో. వీరంతా అయినవాళ్లకు దూరంగా నాలుగు గోడల మధ్య, తమలాంటి మరికొందరు ‘నేరరూప దానవుల’ మధ్య బతుకీడుస్తూంటారు. ఈ నేపథ్యంలో.. పడిన సంకెళ్లు చేతుల్ని మరింత మొద్దుబారేలా చేసేస్తున్న పరిస్థితుల్లో... ఆ చేతులకు అందిందో కుంచె. అంతే... ఆ చేతులిప్పుడు అద్భుత చిత్రాలను లిఖిస్తున్నాయి. మనసులను కదిలిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు ఓ మధ్యవయసు వ్యక్తి. గోడకు చేరబడి కూర్చున్నాడు. ఆ చూపుల్లో అంతులేని నిర్వేదం. ఆ కూర్చున్న శైలిలో అనంతమైన శూన్యం. చిత్రంగా... తానేడుస్తున్న విషయం, చెంపలకు అంటిన తడి కూడా అతనికి తెలిసినట్టు లేదు. చిత్రంగా అతనో చిత్రమే. కారాగారవాసం అనుభవిస్తున్న ఖైదీ భావాలకు ప్రతి రూప చిత్రమది. ఓ ప్రసిద్ధ చిత్రకారుడు వేస్తే ఆ చిత్రం బహుశా చాలా గొప్పగా ఉండేదేమో.. అయితే అచ్చంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఖైదీ గీసింది కాబట్టి అత్యంత సహజంగా ఉంది. ఖైదీలు గీసిన ఇలాంటి ఎన్నో చిత్రాలు బంజారాహిల్స్‌లోని కళాకృతి గ్యాలరీ కేఫ్‌లో కొలువుదీరాయి. జైలులో... ‘కళ’‘కలం’... బహుశా దేశంలోనే ఇలాంటి ప్రయోగం ఎక్కడా జరిగి ఉండదు. నగరానికి చెందిన కృష్నాకృతి ఫౌండేషన్ ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘బియాండ్ ది బార్స్’... గత 7 నెలలుగా నగర చిత్రకళా ప్రపంచంలో సంచలనం. జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు, కత్తులు, కత్తెరలు తప్ప తెలీని ఖైదీల చేతులకు కుంచెనిచ్చి, వారిలోని కళాతృష్ణను వెలికితీసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను అందిస్తోంది. పలువురు ఖైదీలను ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది, వారు గీసిన చిత్రాలను ఇప్పటికే ఒక దఫా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. రెండో దఫా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో 180 చిత్రాల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభమై, ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది. ‘రంగు’మారింది... కరడుగట్టిన హృదయాలు ‘కళ’కనేలా చేసిందీ ప్రయోగం. మోడువారిన మనసుల్లోని సున్నితత్వాన్ని తట్టి లేపింది. చర్లపల్లి, చంచల్‌గూడ కారాగారాల్లో బందీలుగా ఉన్న ఖైదీలు... 40 మంది వారంలో రెండు రోజుల పాటు చొప్పున చిత్రలేఖనంలో శిక్షణ పొందిన అనంతరం వారు స్వయంగా గీసిన చిత్రాలు ఈ మార్పునకు నిదర్శనంగా నిలిచాయి. పోలీసు కావాలనుకుని నేరస్తుడి గా మారిన ఓ ఖైదీ మానసిక సంఘర్షణ పోలీసుల గొప్ప తనాన్ని చాటి చెప్పేలా గీసిన ఓ చిత్రం ప్రతిఫలిస్తే, మనిషి అంతర్ముఖంలో ఉండే భావాలు ఒకేసారి బయటికి వస్తే ఆ మనిషి ముఖం ఎన్ని ముఖాలుగా మారుతుందో మరో చిత్రం తెలియజేస్తుంది. ఇబ్రహీం, విక్రమ్, రాజ్‌కుమార్, రమేష్, చిన్నా... తదితర ఖైదీల చేతుల్లో ప్రాణం పోసుకున్న దేశనాయకుల పోట్రైట్ల నుంచి ప్రకృతి దృశ్యాల దాకా... ఇక్కడ కనువిందు చేస్తాయి. ‘ఈ చిత్రాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో ఖైదీలకే అందిస్తాం. అయితే ఇది కేవలం ఖైదీలకు ఆదాయం అందించడానికి మాత్రమే కాదు వారిలో సున్నితత్వాన్ని మేల్కొలిపి జీవితం పట్ల వారి దృక్పథాన్ని మార్చేందుకు కూడా’ అని కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటి అన్నారు. మొదట భయపడ్డా... తొలుత ఖైదీలకు ఆర్ట్ వర్క్ అంశంలో శిక్షణ అంటే భయపడ్డాను. అయితే పోలీసు ఉన్నతాధికారులు, కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటిలు అందించిన ప్రోత్సాహంతో దీన్ని అధిగమించాను. తొలి దశలో వారికి చెప్పడం కాస్త కష్టమైంది. అయితే వారిలో ఆసక్తి పెరిగిన తర్వాత నా పని సులభం అయింది. ఇప్పుడు కొందరైతే ప్రసిద్ధ చిత్రకారులకు తీసిపోని రీతిలో చిత్రాలు గీస్తున్నారు. అంతేకాదు ఖైదీ నుంచి కళాకారుడిగా రూపాంతరం చెందిన తర్వాత వారి మాట, మర్యాదల్లో ఎంతో మార్పు వచ్చింది. ఒక ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఇప్పటిదాకా ఎవరికీ రాని అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. - సయ్యద్, ఆర్ట్ టీచర్. -
ఉత్సవం లాంటి చిత్రం
‘‘‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అన్నీ కలగలసిన చిత్రం ఇది. సినిమాలాగా కాకుండా ఓ ఉత్సవంలా ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్, సమంత అన్నారు. మహేశ్‌బాబు హీరోగా కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా కాజల్, సమంత తమ అనుభూతులను ఈ విధంగా పంచుకున్నారు. సింపుల్‌గా.. హోమ్లీగా... - కాజల్ * ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసి, ‘నటించాలా? వద్దా?’ అని మొదట ఆలోచించా. కానీ, శ్రీకాంత్ అడ్డాలగారు చెప్పిన కథ, అందులో నా పాత్ర నచ్చడంతో నటించేందుకు ఒప్పేసుకున్నా. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లు, చాలామంది నటులతో సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. శ్రీకాంత్‌గారు అన్ని క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా హ్యాండిల్ చేశారు. * ఇందులో నా పాత్ర పేరు కాశి. ఎన్ఆర్ఐ గర్ల్‌గా నటించా. ఎన్ఆర్ఐ అంటే మోడ్రన్ అమ్మాయిలా ఉండను. వెరీ సింపుల్‌గా, హోమ్లీ గర్ల్‌లా ఉంటా. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ‘డార్లింగ్’ చిత్రంలోనూ ఎన్ఆర్ఐ అమ్మాయి పాత్రయినా, బబ్లీ గర్ల్‌గా చేశా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రాక్టికల్‌గా ఆలోచించే పాత్ర. * మహేశ్‌బాబుగారితో మొదట ‘బిజినెస్ మేన్’ చేశా. రెండో చిత్రం ‘బ్రహ్మోత్సవం’. అప్పటికీ ఇప్పటికీ ఆయన అంతే అందంగా ఉన్నారు. మహేశ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్. పోటీ ఉన్నా కూడా చాలా పాజిటివ్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. దట్స్ వెరీ గ్రేట్. * ఈ చిత్రంలో రేవతి, జయసుధ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం వల్ల నటనలో కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా. ఆనందంగా... సందడిగా... - సమంత * మానవతా విలువలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ కోవలోకే వస్తుంది. అటువంటి చిత్రాలు ఆయన బాగా తీయగలరు. ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులు, బంధువులంతా ఓ చోట కలిస్తే ఎంత ఆనం దంగా, సందడిగా ఉంటుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉంటాయి. నేను ఆంగ్లో-ఇండియన్ని. నా మూలాలు ప్రపంచం అంతా ఉంటాయి. మా బంధువులందర్నీ కలుసుకోవాలంటే ప్రపంచం మొత్తం చుట్టేయాలి (నవ్వుతూ). * మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘దూకుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేశా. ఈ సినిమాలో ఆయన్ను చూస్తే వయస్సు వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపి స్తుంది. అంత అందంగా ఉన్నారు. ప్రత్యేకించి టైటిల్ సాంగ్‌లో చాలా అందంగా కనిపిస్తారు. * నా ఫేవరేట్ నటి రేవతితో కలిసి ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. అంత సీనియర్ అయినా కూడా సెట్లో ‘ఇది నా ఫస్ట్ సినిమా.. నేను నటిస్తున్న మొదటి రోజు ఇదే’ అనే భావనలో ఉంటారు. * ఈ చిత్రంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో నాకు సన్నివేశాలు తక్కువ. మహేశ్, ‘వెన్నెల’ కిశోర్‌తో ఎక్కువ ఉంటాయి. * పీవీపీగారు మంచి నిర్మాత. రత్నవేలు కెమేరా, తోట తరణి గారి ఆర్ట్ చాలా ప్లస్. హరిద్వార్, ఉదయ్‌పూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎండ, దుమ్ము బాగా ఉండేది. అయినా రత్నవేలుగారు నన్ను అందంగా చూపించారు. * ‘బ్రహ్మోత్సవం’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలు అవసరం. సమంత మంచి నటి అనిపించుకోవాలన్నదే ప్రస్తుతానికి నా లక్ష్యం. -
ఆ విషయంలో ముసలివాళ్లే మేలట..!
న్యూయార్క్: భావ వ్యక్తీకరణలో వయో వృద్ధులే మేలంటున్నారు పరిశోధకులు. యువత కన్నా.. అరవై ఏళ్ళ వయసు దాటినవారే బాధ, ఒంటరితనం వంటి అన్ని రకాల భావాలను వ్యక్త పరచడంలో సానుకూల స్పందన కలిగిఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నట్లు చెబుతున్నారు. భావోద్వేగాల విషయంలోనూ వృద్ధులే అత్యంత అనుకూలమైన, చురుకైన ప్రవర్తన కలిగి ఉంటున్నారని చెప్తున్నారు. యువతలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటున్నాయని, వృద్ధులు నిర్మలమైన అనుభూతులను, ప్రశాంతతను కలిగి ఉన్నట్లు అమెరికా మసాచెట్స్ ఆమ్హెస్గ్ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకుడు రెబెక్కా రెడీ ఓ నివేదికలో వెల్లడించారు. 60 నుంచి 90 ఏళ్ళ వయసువారితోపాటు, 18 నుంచి 32 ఏళ్ళ వారిలో అనుకూల, ప్రతికూల భావోద్వేగాలపై పరిశోధనలు జరిపిన అధ్యయనకారులు వివరాలను ఏజింగ్ అండ్ మెంటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. పరిశోధనల్లో వృద్ధులు యువతకన్నా సంతోషంగా, ఆనందంగా ఉండటమే కాక, ఎంతో నిర్మలమైన మనసుతోనూ, సానుకూల భావోద్వేగాలను కలిగి ఉండటాన్ని గమనించినట్లు వెల్లడించారు. యువ, వృద్ధ బృందాల్లో అనేక లక్షణాల్లో పోలిక ఉన్నప్పటికీ విచారం, ఒంటరితనం, ప్రశాంతత వంటి వాటిలో మాత్రం విభేధాలను గమనించినట్లు చెప్తున్నారు. యువత.. సిగ్గు, విచారం, చికాకు, ఒంటరితనం వంటి వాటిని వ్యక్త పరచడంలో స్వీయ నిందను వెలిబుచ్చడం చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు ప్రధాన పరిశోధకుడు రెడీ చెప్తున్నారు. ఇటువంటి విషయాల్లో వృద్ధులే సాపేక్ష స్వభావాన్ని కలిగి ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. అమెరికాలోని వృద్ధుల్లో భావోద్వేగాలను తెలుసుకోవడం వల్ల వైద్య పరంగా గణనీయమైన ఫలితాలను అందించే అవకాశం ఉంటుందని పరిశోధక బృందం వెల్లడించింది. మానసిక వైద్యులకు, కేర్ టేకర్లకు, వర్కర్లకు వృద్ధుల సంరక్షణా బాధ్యతలు నిర్వహించడంలో వారి స్వభావ పరిశీలన ఎంతో అవసరమని, తమ పరిశోధన అందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. -
అతడే నా వరుడు!
ఇంటర్వ్యూ చార్మి అంటే చాలామందికి ఇష్టం. కానీ చార్మికి ఏమంటే ఇష్టం? ఏం తినడం ఇష్టం? ఏం ధరించడం ఇష్టం?ఏయే ప్రదేశాలు తిరగడం ఇష్టం? ఏమేం చేయడమంటే ఇష్టం? అడిగితే ఆపకుండా చెబుతుంది. అందంగా నవ్వుతూ ఇష్టాలన్నీ తెలుపుతుంది. ఆ నవ్వే... కుర్రాళ్ల గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది. చార్మింగ్ బ్యూటీ చార్మి ఇష్టాయిష్టాలు... మీకోసం! పుట్టినరోజు: మే 17 ముద్దుపేరు: చార్మ్స్ నచ్చే రంగులు: బ్లూ, వైట్, రెడ్ నచ్చే దుస్తులు: జీన్స్, టీషర్ట్స్, చీరలు నచ్చే ఫుడ్: హైదరాబాదీ బిర్యానీ నచ్చే డ్రింక్: వైట్ గ్రేప్ జ్యూస్ నచ్చే ప్రదేశాలు: బీచ్లుండే ప్రదేశం ఏదైనా ఇష్టమే. నచ్చే క్రీడ: క్రికెట్ నచ్చిన సినిమా: తారే జమీన్ పర్ నచ్చే హీరోలు: షారుఖ్, అమితాబ్ నచ్చే హీరోయిన్లు: జూహీ చావ్లా, డింపుల్ కపాడియా, రమ్యకృష్ణ హాబీలు: పుస్తకాలు విపరీతంగా చదువుతాను. శివ్ ఖేరా రాసిన మోటి వేషనల్ బుక్స్ అంటే మరీ ఇష్టం. నేను స్విమ్మింగ్ చాంపియన్ని కాబట్టి బాగా స్విమ్ చేస్తుంటాను. డ్యాన్స్ చేయడం, ఫ్రెండ్స్‌తో చాటింగ్... మూడ్‌ని బట్టి ఇలా ఏదో ఒకటి చేస్తుంటా. బలం: ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్. బలహీనత: చాక్లెట్స్. మిగిలినవాటి విషయంలో ఎంత కంట్రోల్ చేసినా, చాక్లెట్స్ విషయంలో మాత్రం నా వల్లకాదు. మార్చుకోవాలనుకునేది: ఫిజికల్‌గా అయితే నన్ను నేను మొత్తం మార్చేసు కోవాలనిపిస్తుంది. నాలో ఏదీ నాకు నచ్చదు. మానసికంగా అయితే అంద రినీ నమ్మేసే బలహీనతను మార్చాలి. దైవభక్తి: చాలా ఉంది. దేవుడు ఎవరైనా దేవుడే అనుకుంటాను. అందరికీ ప్రార్థన చేస్తాను. ఆంజనేయ స్వామి అంటే మాత్రం కాస్త ఎక్కువ ఇష్టం. ఎదుటివారిలో నచ్చేది: అమాయకత్వం, నిజాయతీ, ప్రకృతిని ప్రేమించడం ఇతరుల్లో నచ్చనిది: అపరిశుభ్రత, క్రూరత్వం ఫిట్నెస్ సీక్రెట్స్: హెల్దీ డైట్, యోగా, ఏరోబిక్స్ రోల్ మోడల్: మా నాన్న. నావరకూ నాకు ఈ ప్రపంచంలో అతి తెలివైన వ్యక్తి ఆయనే అనిపిస్తుంది. ప్రేమంటే: బలమైన స్నేహం స్నేహమంటే: కష్టనష్టాల్లో సైతం తోడు వీడక నిలబడే బంధం పెళ్లెప్పుడు: నేను చేసుకోవాలను కున్నప్పుడు. నాకో తోడు అవసరమని నేను ఫీలైనప్పుడు. నచ్చే వరుడు: మనసుకి నచ్చేవాడు, దేవుడు మనకి రాసిపెట్టిన వాడు. నా కో-స్టార్ కావచ్చు, డెరైక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు... అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనివాడూ కావచ్చు. నాకు తగినవాడు, నా మనసు దోచినవాడే నా వరుడు. ఇంకా తీరని కోరిక: ఒక్క సినిమాలో పది రకాల పాత్రలు చేయాలని ఉంది. కమల్ హాసన్ ‘దశావతారం’ చేశారు. ‘నట్టీ ప్రొఫెసర్’ చిత్రంలో ఎడ్డీ మర్ఫీ ఏడు రకాల రోల్స్ చేశారు. ఏ నిర్మాత అయినా నాకు అలాంటి అవకాశం ఇస్తే ఫ్రీగా నటిస్తా. ఎవ్వరూ ముందుకు రాక పోతే ఎప్పుడో నేనే తీసినా తీసేస్తాను. వెంటాడే కల: కల అంటే నిద్రలో వచ్చే కల కాదు గానీ... నాకయితే ఓ విచిత్రమైన కల ఉంది. అదేంటంటే నేను మూనీవుడ్లో రారాణిని కావాలని. ఇదెక్కడుందా అనుకుంటు న్నారా! చంద్రమండలంలో. మనిషి చంద్రుడి మీద నివాసం ఏర్పరచు కోడానికి ట్రై చేస్తున్నాడు కదా! అది సక్సెస్ అవ్వాలి. చంద్రుడి మీదికి చాలామంది వెళ్లాలి. అక్కడ కూడా సినిమాలు తీయాలి. వాటిలో నేను నటించాలి. మళ్లీ జన్మంటూ ఉంటే: ఐశ్వర్యారాయ్ కళ్లు, జెన్నిఫర్ లోపెజ్ ఫిగర్, జూహీ చావ్లా లాంటి నవ్వు, ‘బాబీ’లో డింపుల్ కపాడియా చూపించి నటువంటి యాక్టింగ్ టాలెంట్, కృష్ణవంశీ లాంటి బ్రెయిన్‌తో పుట్టాలను కుంటాను. ఆ జన్మలో షారుఖ్ ఖాన్ లాంటి బాయ్ ఫ్రెండ్ కూడా దొరకాలనుకుంటాను. -
మనోభావాలను గమనించాలి
గొడ్డు మాంసానికీ, గొర్రె మాంసానికీ తేడా ఏమీ లేదని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, న్యాయనిపుణుడు మార్కండేయ కట్జు చెప్పడం విచారకరం. ఆవును హిందువులు చూసే పద్ధతి వేరు. ఆ జీవి వారికి పవిత్రమైనది. దేవునితో సమంగా కొలుస్తారు. ఆవు పేడ, మూత్రం, పాలు అన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తా యని శాస్త్రీయంగా రుజువైంది. ఇప్పుడు ఆవు మాంసం వివా దం దేశాన్ని కుదిపివేస్తున్నది. అయితే ఈ పేరుతో భౌతిక దాడులు సరైనవి కావు. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే, హిందు వుల మనోభావాలను కించపరిచే విధంగా ఆవు మాంసం గురించి వ్యాఖ్యలు చేసే వారిపట్ల సుప్రీంకోర్టు కొరడా ఝళి పించవలసి ఉంది. గోవు మాంసం తినడం వ్యక్తిగతమే. కానీ ఆవు మాంసానికీ, మేక మాంసానికీ తేడా లేదని చెప్పడం మూర్ఖత్వమే. అదే సమయంలో ఆవు మాంసం వివాదం నేప థ్యంలో హిందూ మనోభావాలను అవమానిస్తూ, హిందూ దేవుళ్లను అవమానించడం సరికాదని గుర్తించాలి. భారతదేశం లో ముస్లింలకు సామాజికంగా ఉన్నత స్థానం ఇస్తున్నారు. ఇక్కడ హిందువులదే ఎక్కువ సంఖ్య అయినప్పటికీ ఆ విధ మైన సమరసత కనిపిస్తుంది. కాబట్టి ఆవు విషయంలో మైనారి టీలు కొంత ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాను. కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా -
సమ్...అంత
ఇంటర్వ్యూ మనమిచ్చే సమ్‌థింగ్ (కొంత) వాళ్లకు ఎవ్రీథింగ్ (అంతా) అంటూ సేవకు భాష్యం చెబుతుంది ‘సమ్... అంత’. ఎవరైనా ‘సమ్’ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు... తనకున్నది ‘అంతా’ ఇచ్చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతుంది. ఎదుటివారి కళ్లల్లో సంతోషాన్ని చూడటానికి ఏం చేయడానికైనా రెడీ అంటుంది. తెరపై తారకలా మెరుస్తూ... సమాజంలో మంచి వ్యక్తిగా మన్ననలందుకుంటోన్న సమంత ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఇవి... ♦ మీకు నచ్చే రంగు? నలుపు. తెలుపు కూడా ఇష్టమే. ♦ నచ్చే ఆహారం? సౌత్ ఇండియన్ వంటకాలు ఏవైనా ఇష్టమే. ♦ నచ్చే దుస్తులు? జీన్స్, టీషర్ట్స్ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్య సందర్భాల్లో చీరలు ఇష్టపడతాను. ♦ నచ్చే హీరోలు? షారుఖ్, రజనీకాంత్, కమల్ హాసన్ ♦ నచ్చే హీరోయిన్లు? శ్రీదేవి, రేఖ, శోభన ♦ ఎదుటివారిలో నచ్చేది? నిజాయితీ, పాజిటివ్ దృక్పథం ♦ ఇతరుల్లో నచ్చనిది? అబద్ధాలు చెప్పడం ♦ భక్తిగా ఉంటారా? మరీ అంత కాదు. ఎప్పుడైనా ఓసారి ప్రార్థన చేసుకుంటానేమో కానీ అన్నీ క్రమం తప్పకుండా పాటించేయను. కాకపోతే దేవుడంటే నమ్మకం ఉంది. మనం తప్పటడుగులు వేయకుండా ఆపేది దేవుడిపై ఉండే నమ్మకం, భయమే! ♦ తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఏమీ చేయను. ఒక్కోసారి అలా ఖాళీగా ఉండటంలో కూడా ఆనందం ఉంటుంది. టీవీ చూస్తూనో, పాటలు వింటూనో గడిపేస్తాను. నాకు పెద్ద పెద్ద శబ్దాలు నచ్చవు. అలాగే ఎక్కువ జనం ఉండే చోట్లకు వెళ్లడం కూడా ఇష్టముండదు. అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతాను. ♦ మీ ఫిట్నెస్ సీక్రెట్? బరువు తగ్గడానికి నేనెప్పుడూ వ్యాయామాలు చేయను. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వంటి జాగ్రత్తలేవో తీసు కుంటాను తప్ప వర్కవుట్లు ఉండవు. ♦ గాసిప్స్‌కి బాధపడతారా? కచ్చితంగా. మన గురించి తప్పుగా మాట్లాడితే బాధ ఉండదా చెప్పండి! కాకపోతే వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోను. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఎవరో ఏదో అంటారని నన్ను నేను మార్చేసుకోలేను కదా! ♦ గుర్తుండిపోయిన కాంప్లిమెంట్? కాంప్లిమెంట్స్‌ని పెద్దగా గుర్తుంచుకోను కానీ కామెంట్స్‌ని మాత్రం గుర్తుంచుకుంటాను. అది కూడా సద్విమర్శ అయితేనే. అలాంటి విమర్శలు మనలో ఉన్న లోపాల్ని సరి చేసుకోవడానికి పనికొస్తాయి. మనల్ని మనం ఇంకా బెటర్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయి. ♦ అవార్డులు కోరుకుంటారా? నేను నటనను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఒక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్ చాలు నన్ను ఇంటికి పంపేయడానికి అనుకుంటాను. అందుకే ఎప్పుడూ పనిని నిర్లక్ష్యం చేయను. బాగా చేయాలి అని తపిస్తాను తప్ప అవార్డులు రావాలి అన్న దృష్టితో బాగా నటించడం అన్నది ఉండదు. మన పని పర్ఫెక్ట్గా ఉంటే అవార్డులు, రివార్డులు అవే వస్తాయి. ♦ పరాజయాలకు కుంగిపోతారా? కుంగిపోను కానీ కంగారుపడతాను. ఆ మధ్య వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. దాంతో కాస్త బెంగపడ్డాను. ఎందుకంటే ప్రతి సినిమా సక్సెస్ కావాలనే శాయశక్తులా కష్టపడతాం. తీరా అది ఫెయిలైతే చాలా నిరాశ అనిపిస్తుంది. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సక్సెస్ కావడంతో నా బెంగ తీరిపోయింది. ♦ మీకు సేవ చేయడం ఇష్టం కదా? అవును. నేనో సమయంలో పదిహేను రోజుల పాటు అనారోగ్యంతో మంచమ్మీదే ఉండిపోయాను. అప్పుడు నాలో పెద్ద మథనమే జరిగింది. జీవితపు విలువ తెలిసింది. ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. అందుకే స్వార్థంగా ఉండకూడదని, వీలైనంత వరకూ ఇతరులకు ప్రేమను పంచాలని నిర్ణయించుకున్నాను. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. ♦ అసలు మీ జీవిత లక్ష్యం ఏమిటి? ఈ భూమి మీద పుట్టినందుకు, సుఖంగా జీవిస్తున్నందుకు ఈ సమాజానికి కొంతయినా మేలు చేయాలి. నేనే కాదు... అందరూ ఇలానే ఆలోచించాలి. అలా అని ఉన్నదంతా పెట్టాల్సిన పని లేదు. మనకి ఉన్నదాంట్లో కొంత ఇతరుల కోసం ఇవ్వగలిగితే చాలు. కొందరి కళ్లలోనైనా మన వల్ల సంతోషం కనిపిస్తే చాలు. సాక్షి ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
అంతరంగాలు.
-
హావభావాలు మార్చే డిజిటల్ మోనాలిసా
లండన్: మోనాలిసా నవ్వు వెనక మర్మమేంటో నేటికీ తెలియదు. దీని వెనక రసహ్యమేంటో తెలియక ఇప్పటికీ పరిశోధకులు జుట్టు పీక్కుంటున్నారు. అలాంటిది మోనాలిసా చిత్రం చూసే ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘లివింగ్ మోనాలిసా’ డిజిటల్ చిత్రం. 40 మంది ఫ్రెంచ్ కళాకారులు, టెక్నీషియన్లు ఏడాదిపాటు కష్టపడి దీన్ని తయారుచేశారు. వీడియోగేముల్లో ఉపయోగించే మోషన్ సెన్సింగ్ డివైజ్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగించారు. సందర్శకుల కదలికలు, ఆలోచనలను బట్టి ఈ చిత్రం కనిపించే విధానం మారుతూ ఉండటం దీని ప్రత్యేకత. ప్రపంచానికి మోనాలిసాను కొత్తగా చూపించాలన్న ఆలోచనే ఈ ఆవిష్కరణకు దోహదం చేసిందని ఈ బృందంలో కీలకపాత్ర పోషించిన ఫ్లోరెంట్ తెలిపారు. తన పరిసరాల్లో జరుగుతున్న మార్పులను ఇప్పుడు మోనాలిసా గుర్తించగలదని వెల్లడించారు. ‘‘మోనాలిసా చిత్రానికి డావెన్సీ తన కళతో ప్రాణం పోస్తే.. నేడు మేం టెక్నాలజీతో జీవం ఇచ్చాం’’ అని ఆయన అన్నారు. త్వరలో డిజిటల్ చిత్రం మార్కెట్లోకి అందుబాటులో రానుంది. -
దేవుడా..! అమ్మాయి ఇలా కూడా ఉంటుందా..?
-
నేపాళం ప్రశాంతతకు భూపాలం
యాత్ర కొలువుదీరిన హిమవత్పర్వతాలు... ఆకట్టుకునే ప్రకృతి సోయగాలు... అడుగడుగునా ప్రశాంత నిలయాలు...బుద్ధుని జన్మస్థలి అయిన నేపాల్ యాత్రానుభవాలు జీవితకాలం హృదయంలో పదిలపరచుకునే ఆనందామృతాలు...హాయిగా పాడుకునే భూపాల రాగాలు ‘విజయవాడ, విశాఖపట్నం, కాకినాడల్లో ఉన్న 30 మంది మిత్ర బృందంతో కలసి కొన్నాళ్లుగా అనుకుంటున్న నేపాల్‌కు రైలులో బయల్దేరాం.ఆ ప్రయాణ అనుభూతులు, పర్యావరణ అందాలు, ప్రశాంతత.. నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ మరపురానివే. ఆ రోజు ఉదయం 5 గంటలకు విజయవాడలో త్రివేండ్రం-గోరఖ్‌పూర్ రైలు ఎక్కి, సాయంత్రం 6 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకున్నాం. ముందుగా బుక్ చేసి ఉంచిన రూముల్లో కాసేపు సేద తీరి, గోరఖ్‌పూర్‌లో ప్రముఖ దేవాలయమైన గోరఖ్‌నాథ్ మందిరాన్ని సందర్శించుకున్నాం. అక్కడి ఆలయప్రాంగణంలోని ప్రశాంతత నూ అలుపు తీర్చేసింది. గోరఖ్‌పూర్ వాసులు రసాయన ఎరువులు లేకుండా పంటలు పండిస్తారని అక్కడివారు చెప్పారు. వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. ఆ రాత్రి అక్కడే బస చేసి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన లుంబినికి చేరాం. బుద్ధుడు పుట్టిన పుణ్యస్థలి... లుంబిని ప్రసవ సమయంలో రాణీ మాయాదేవి ప్రయాణిస్తుండగా రూపాందేహి జిల్లా ప్రాంతంలోని లుంబినిలో ఒక చెట్టు క్రింద సిద్ధార్థుడు జన్మించాడని కథనం. అతని తండ్రి చక్రవర్తి అవడం వల్ల అతని హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెబుతుంటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రముఖ బుద్ధ పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రాంతాన్ని తిలకిస్తే అడవిలో ఉన్నామనే అనుభూతితో పాటు మరెన్నో దేశాలను ఏకకాలంలో సందర్శించామనే ఆనందమూ కలుగుతుంది. మనదేశంతో పాటు చైనా, జపాన్, శ్రీలంక, థాయిలాండ్ ఇతర దేశాల బుద్ధుని దేవాలయాలు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని పూర్తిగా అధ్యయనం చే స్తూ తిలకించాలంటే కొన్ని రోజులు పడుతుంది. పైపైన చూసేందుకు మాత్రం నడుస్తూ, రిక్షాలు, మినీ వ్యానులలో వెళ్లవచ్చు. ఇక్కడి మ్యూజియం బుద్ధునిపై పరిశోధనలు చేయడానికి చక్కగా దోహదపడుతుంది. విదేశీయులతో కళ కళ... ప్రపంచంలో ఏ దేశంలోనూ కనిపించనంత మంది విదేశీయు లు నేపాల్‌లో కనిపించారు. ఇందుకు ప్రపంచంలో అతి పెద్ద పర్వాతాల్లో 8 ఇక్కడే ఉండటం, బౌద్ధమత సంప్రదాయాలు, చల్లటి వాతావరణం ప్రధాన కారణాలుగా తెలుసుకున్నాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఇక్కడ నుంచే అధిరోహిస్తారు. ఎక్కలేని వారు హెలికాప్టర్ ద్వారా శిఖరపు అంచులను తిలకించి రావచ్చు. అత్యంత ఆనందం రోప్ వే... ఖాట్మండ్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గోర్ఖాజిల్లాలో మనోకామనా దేవాలయం ఉంది. ఈ ఆలయానికి కిందనుంచి పైకి వెళ్లడానికి రోప్ వేలో వెళుతుంటే అక్కడ ప్రవహిస్తున్న నదీ ప్రవాహంతో పాటు ప్రకృతి అందాలు సుందరంగా కనిపిస్తుంటాయి. పశుపతినాథుడు... ఖాట్మండ్ లోయలో భాగమతీ నదికి ఆనుకుని ఉన్న పశుపతినాథ్ దేవాలయంలోకి అడుగుపెట్టగానే నేపాలీల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కనిపిస్తాయి. శక్తి పీఠాల్లో ఒకటైన గుజ్జేశ్వర అమ్మవారి దేవాలయం ఖాట్మండ్‌లోనే ఉంది. అమ్మవారి విగ్రహం ఉన్న చోట నీరు ఎంత పోసినా, తీసినా ఒకే కొలమానంలో ఉంటుంది. నేపాల్ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు భక్తాపూర్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ప్రజా దర్బారు, ప్రత్యేక కొలను ఇక్కడ కనిపించాయి. ప్రస్తుతం వాటిని మ్యూజియంలా ఏర్పాటు చేశారు. నేపాల్‌లో బెజవాడ భోజనం... మేం నేపాల్‌లో హోటల్ కల్పబ్రిక్షలో బస చేశాం. ఆ హోటల్ నిర్వాహకుడు హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్బజ్గల్ కావడంతో మాకు కలిసి వచ్చింది. ప్రయాణం మొత్తంలో తెలుగింటి వంటలను ఆస్వాదించాం. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. వారం రోజులు పాటు సాగిన మా ప్రయాణ అనుభూతులను నెమరువేసుకుంటూ విజయవాడకు చేరుకున్నాం.’ - వి.సత్యనారాయణ, విజయవాడ