కార్తీకేయ-2 సినిమా హిట్ తర్వాత అనుపమ క్రేజ్ పాన్‌ఇండియా రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత నిఖిల్‌తో 18పేజేస్‌లో కనిపించింది. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఈగల్‌లో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతే కాకుండా సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్‌లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేరళ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చింది.
(ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా)
అనుపమ మాట్లాడుతూ.. 'భావోద్వేగాలు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజయితీగా ఉంటా. నాకేదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా. ఆ విషయాన్ని అక్కడికక్కడే వదిలేస్తా. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ కొన్నాళ్లే ఉండేందుకు వచ్చాం.. మళ్లీ వెళ్లిపోతాం. ఆరోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. బతికి ఉన్న కొద్ది రోజులైనా మన ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి . సీసీ టీవీ పుటేజ్ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయినట్లు.. నా మెదడులోని చెత్తను డిలీట్ చేస్తుంటా.' అంటూ చెప్పుకొచ్చింది.
(ఇది చదవండి: 30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!)
Comments
Please login to add a commentAdd a comment