
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనరూటే సెపరేటు అంటాడు. ఏ అంశాన్ని అయినా అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ఇక తనకెలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేవని చెప్పుకునే వర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశాడు.
కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వర్మ నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఇతర జీవరాశులపై ఎలాంటి ప్రేమ లేదని చెప్పిన వర్మ లేటెస్ట్ ఫోటోతో అందరికి షాక్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment