అదే లక్ష్యం | sports target | Sakshi
Sakshi News home page

అదే లక్ష్యం

Published Fri, Oct 7 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

sports target

  • జాతీయ స్థాయిలో విజయం దిశగా పయనం
  • రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారుల మనోగతం
  •  
     
    బరిలో దూకి.. ‘కూత’ పెట్టి జాతీయ స్థాయికి ఎదగడమే కాకుండా చాలామంది ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లాకు చెందిన కె.శ్రీనివాస్‌ అంతర్జాతీయ కబడ్డీలో బంగారు పతకం సాధించారు. కె.పవన్‌ వెంకటకుమార్‌ జిల్లా జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటులో హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అలాగే కబడ్డీ కోటాలో ఎ.నవీన్‌కుమార్‌ పోస్టల్, ఆర్తీవదన్‌ ఇండియన్‌ ఆర్మీలో, కిర్లంపూడికి చెందిన మణికంఠ పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లా మహిళా కబడ్డీ టీములో కిర్లంపూడికి చెదిన వరమాణిక్యం (అంతర్జాయ గోల్డ్‌ మెడల్‌), కాకినాడకు చెందిన దైవకృప జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం, కాకినాడకు చెందిన శివజ్యోతి, గొల్లపాలేనికి చెందిన సత్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. సామర్లకోటకు చెందిన పోతుల సాయి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా శ్రీకాకుళంలో పని చేస్తున్నారు. ఇదే పట్టణానికి చెందిన బోగిళ్ల మురళీకుమార్‌ రెండుసార్లు ప్రో కబడ్డీకి అంపైర్‌గా జిల్లా నుంచి వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీల ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఇటువంటివారి స్ఫూర్తితో తాము కూడా జాతీయ స్థాయిలో విజయం సాధించడమే లక్ష్యంగా పయనిస్తున్నామని అంటున్నారు కబడ్డీ క్రీడాకారులు. ఎ¯Œæటీఆర్‌ స్మారక 64వ రాష్ట్రస్థాయి పురుషులు, స్త్రీల కబడ్డీ పోటీలు స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూలు వెనుక ఉన్న పల్లంబీడు స్థలంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ‘సాక్షి’కి తమ లక్ష్యాలను వివరించారు.   
     – సామర్లకోట
     
     
     
    శిక్షణ ఇచ్చేవారు ఉండటంతోనే..
    స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో చదువుకొంటున్న సమయంలో ఆరో తరగతి నుంచి కబడ్డీలో మురళీకుమార్‌ శిక్షణ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించాను. కబడ్డీ కోటాలో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం వచ్చింది. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు కప్పు సాధిస్తాం.
    – కె.శ్రీనివాస్, అంతర్జాతీయ కబడ్డీ 
    క్రీడాకారుడు, తూర్పు గోదావరి జిల్లా
     
    తండ్రి స్ఫూర్తితో రాణింపు
    మా తండ్రి ఆశయం కోసం కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్‌ పోటీలో పాల్గొని బెస్ట్‌ రైడర్‌గా సిల్వర్, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించాను.
    – ఎస్‌ఎల్‌ శివజ్యోతి, కరప మండలం, తూర్పు గోదావరి
     
    ఒలింపిక్స్‌లో చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం
    ఒలింపిక్స్‌లో కబడ్డీ జట్టును చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం. మంచి క్రీడాకారులు ఉన్నారు. 2011 నుంచి కబడ్డీ ఆడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాం. స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్నాను.
    – ఎం.మహేష్‌బాబు,  
    కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా
     
    మంచి క్రీడాకారులను తయారు చేయాలి
    పదమూడు సంవత్సరాలుగా కబడ్డీలో ప్రతిభ చూపుతూ, ప్రైవేటు పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. కబడ్డీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, మహిళా క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వాలని ఉంది.
    – ఎన్‌.నవ్య, కృష్ణా జిల్లా
     
    పోలీసు కావాలని లక్ష్యం
    కబడ్డీ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉంది. 2011 నుంచి కబడ్డీ జట్టులో ఆడుతున్నాను. మా పాఠశాల పీఈటీ కె.అమ్మయ్యచౌదరి తర్ఫీదుతో కబడ్డీలో రాణిస్తున్నాను. సీనియర్‌ నేషనల్స్‌ ఆడాను.
    – ఎన్‌.నాగలత, ప్రకాశం జిల్లా
     
    జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి
    ఇండియన్‌ కబడ్డీ టీములో స్థానం సంపాదించి, అంతర్జాతీయ పోటీలో పాల్గొని, బహుమతి సా«ధించాలని ఉంది. స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.
    – ఎం.గౌరి, శ్రీకాకుళం
     
    అన్నయ్య స్ఫూర్తితో..
    అన్నయ్య గంగాధర్‌రెడ్డి చెడుగుడు పోటీల్లో మంచి క్రీడాకారునిగా గుర్తింపు పొందాడు. ఆయన స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు నాయకత్వం 
    వహిస్తున్నాను.         – పి.లీలావతి, గుంటూరు జిల్లా
     
    కోచ్‌గా ఎదగాలని ఉంది
    కబడ్డీలో పూర్తిస్థాయి మెళకువలు తెలుసుకొని జిల్లా కబడ్డీ కోచ్‌గా ఎదగాలని ఉంది. పీఈటీ సుబ్బరాజు స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టాను.   – షబానా, కర్నూలు జిల్లా
     
    చిన్నతనం నుంచీ మక్కువ
    గ్రామీణ స్థాయిలో నాకు చిన్నతనం నుంచీ కబడ్డీ అంటే మక్కువ. 13 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇండియన్‌ క్యాంప్‌ నిర్వహించాను. జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించి, ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంటులో పని చేస్తున్నాను. కబడ్డీ అసోసియేషన్‌ నాయకులు వీరలంకయ్య, రాంబాబుల ప్రోత్సాహం ఉంది.                         – శ్రీకృష్ణ, ప్రకాశం జిల్లా 
     
    అమ్మానాన్నల ప్రోత్సాహంతో..
    అమ్మానాన్నలకు కబడ్డీ అంటే ఇష్టం. వారి ప్రోత్సాహంతో కబడ్డీ టీములో స్థానం సంపాదించాను. పీఈటీ గంగాధరం ఎంతో ప్రోత్సహించారు. భారత జట్టులో స్థానం సంపాదించాలని ఉంది.                        – కె.మౌనిక, చిత్తూరు జిల్లా
     
    యూనివర్సిటీలో బంగారు పతకం
    యూనివర్సిటీలో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. కబడ్డీలో ప్రవేశానికి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా కబడ్డీలో మెళకువలు నేర్చుకున్నాను. స్పోర్ట్స్‌ కోటాలో మంచి కోచ్‌ కావాలని ఉంది.
    – బి.సంధ్య, పశ్చిమ గోదావరి జిల్లా
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement