samalkot
-
రాక్ సిరామిక్స్ కార్మికుల ఆందోళన
-
భద్రాచలం టు సామర్లకోట
410 కిలోమీటర్ల సాహసయాత్ర భద్రాచలం అర్బన్: విజయవాడ ఆంధ్ర నావలింగ్ యూనిట్, ఎన్సీసీ ఆధ్వర్యంలో సైలింగ్ ఎక్స్పిడేషన్–2017 క్యాంప్‌లో భాగంగా గోదావరిలో 410 కిలోమీటర్ల సాహసయాత్ర సాగనుంది. భద్రాచలంలోని గోదావరి నుంచి ఏపీలోని సామర్లకోట వరకు సాగనున్న ఈ యాత్రను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. యాత్ర ఈ నెల 14న సామర్లకోట చేరుకుంటుందని ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్ తెలిపారు. ఏటా ఈ యాత్ర చేపడతామని, ఈ ఏడాది తొలిసారిగా 14 మంది మహిళా క్యాడెట్లు పాల్గొంటున్నారని చెప్పారు. మొత్తం 42 మంది విద్యార్థులతో యాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్.సి.నాయుడు, ఆంధ్ర నావల్ కమాండర్ ఎస్.పి. ఖాజా, డిప్యూటీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కె.సి.ఎస్ రావు, భద్రాచలం ఏఎస్పీ సునీల్ దత్, ఆర్డీవో శివనారాయణ రెడ్డి, సర్పంచ్ శ్వేత, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు. -
ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్న ప్రసాద్
సామర్లకోట : విశాఖలో ఈ నెల 20న లలితా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్లో వియత్నాం ఇంటర్నేషన్ డ్యాన్స్ ఎక్స్‌లెన్సీ అవార్డును అలమండ ప్రసాద్ అందుకున్నారు. ఆ విషయాలను గురువారం ఆయన విలేకర్లకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్ర్తి పాల్గొని కూచిపూడి నాట్యం శాస్త్రీయమైనదని, ఈ నాట్య కళను విశ్వ వ్యాప్తంగా చేయడానికి అందరూ అంకితభావంతో కృషి చేయాలని కోరినట్టు అలమండ ప్రసాద్ తెలిపారు. అవార్డు అందుకుని సామర్లకోట వచ్చిన ప్రసాద్‌ను పలువురు అభినందించారు. -
హోరా హోరీగా కబడ్డీ పోటీలు
సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల స్త్రీ, పురుష జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్త్రీ, పురుష కబడ్డీ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం శనివారం రాత్రి పోటీలను తిలకించారు. అంతర్జాతీయ కోచ్ పోతుల సాయిని, పీఈటీ తాళ్లూరి వైకుంఠంలను డిప్యూటీ సీఎం, రాజప్పలు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్ బ్యాగ్‌లు, స్టాప్ వాచ్, విజిల్ అందజేశారు. మహిళా విభాగంలో విజయనగరం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 48 పాయింట్ల తేడాతో, గుంటూరు జట్టుపై తూర్పుగోదావరి 37 పాయింట్ల ఆధిక్యతతో, విశాఖ జట్టు అనంతపురం జట్టుపై 41 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టు శ్రీకాకుళం జట్టుపై 35 పాయింట్ల తేడాతోను ఘన విజయం సాధించాయి. పురుషుల విభాగంలో గుంటూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 32 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టుపై విశాఖ జట్టు 9 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచాయి. ప్రకాశం జట్టు నెల్లూరు జట్టుపై 10 పాయింట్ల తేడాతోను, విజయనగరం– పశ్చిమ గోదావరిపై మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రాత్రి 8.30 గంటకు సీమి ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభించారు. పురుషుల మొదటి సెమీ ఫైనల్ తూర్పు– విశాఖ జట్ల మధ్య, మహిళల సెమీ ఫైనల్ తూర్పు –విజయనగరం జట్ల మధ్య జరిగాయి. మహిళా విభాగంలో విజయనగరం జట్టు తూర్పు గోదావరిపై 19 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తూర్పు గోదావరి పురుషుల జట్టు విశాఖ జట్టుపై 22 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, నలమాటి జానికి రామయ్య, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
అదే లక్ష్యం
జాతీయ స్థాయిలో విజయం దిశగా పయనం రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన క్రీడాకారుల మనోగతం బరిలో దూకి.. ‘కూత’ పెట్టి జాతీయ స్థాయికి ఎదగడమే కాకుండా చాలామంది ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లాకు చెందిన కె.శ్రీనివాస్ అంతర్జాతీయ కబడ్డీలో బంగారు పతకం సాధించారు. కె.పవన్ వెంకటకుమార్ జిల్లా జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంటులో హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అలాగే కబడ్డీ కోటాలో ఎ.నవీన్‌కుమార్ పోస్టల్, ఆర్తీవదన్ ఇండియన్ ఆర్మీలో, కిర్లంపూడికి చెందిన మణికంఠ పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జిల్లా మహిళా కబడ్డీ టీములో కిర్లంపూడికి చెదిన వరమాణిక్యం (అంతర్జాయ గోల్డ్ మెడల్), కాకినాడకు చెందిన దైవకృప జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం, కాకినాడకు చెందిన శివజ్యోతి, గొల్లపాలేనికి చెందిన సత్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. సామర్లకోటకు చెందిన పోతుల సాయి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా శ్రీకాకుళంలో పని చేస్తున్నారు. ఇదే పట్టణానికి చెందిన బోగిళ్ల మురళీకుమార్ రెండుసార్లు ప్రో కబడ్డీకి అంపైర్‌గా జిల్లా నుంచి వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీల ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఇటువంటివారి స్ఫూర్తితో తాము కూడా జాతీయ స్థాయిలో విజయం సాధించడమే లక్ష్యంగా పయనిస్తున్నామని అంటున్నారు కబడ్డీ క్రీడాకారులు. ఎ¯Œæటీఆర్ స్మారక 64వ రాష్ట్రస్థాయి పురుషులు, స్త్రీల కబడ్డీ పోటీలు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూలు వెనుక ఉన్న పల్లంబీడు స్థలంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ‘సాక్షి’కి తమ లక్ష్యాలను వివరించారు. – సామర్లకోట శిక్షణ ఇచ్చేవారు ఉండటంతోనే.. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో చదువుకొంటున్న సమయంలో ఆరో తరగతి నుంచి కబడ్డీలో మురళీకుమార్ శిక్షణ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించాను. కబడ్డీ కోటాలో బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం వచ్చింది. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు కప్పు సాధిస్తాం. – కె.శ్రీనివాస్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, తూర్పు గోదావరి జిల్లా తండ్రి స్ఫూర్తితో రాణింపు మా తండ్రి ఆశయం కోసం కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ పోటీలో పాల్గొని బెస్ట్ రైడర్‌గా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాను. – ఎస్ఎల్ శివజ్యోతి, కరప మండలం, తూర్పు గోదావరి ఒలింపిక్స్‌లో చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం ఒలింపిక్స్‌లో కబడ్డీ జట్టును చేరిస్తే స్వర్ణపతకం సాధిస్తాం. మంచి క్రీడాకారులు ఉన్నారు. 2011 నుంచి కబడ్డీ ఆడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాం. స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంట్లో పని చేస్తున్నాను. – ఎం.మహేష్‌బాబు, కొవ్వూరు మండలం, నెల్లూరు జిల్లా మంచి క్రీడాకారులను తయారు చేయాలి పదమూడు సంవత్సరాలుగా కబడ్డీలో ప్రతిభ చూపుతూ, ప్రైవేటు పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. కబడ్డీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, మహిళా క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వాలని ఉంది. – ఎన్.నవ్య, కృష్ణా జిల్లా పోలీసు కావాలని లక్ష్యం కబడ్డీ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉంది. 2011 నుంచి కబడ్డీ జట్టులో ఆడుతున్నాను. మా పాఠశాల పీఈటీ కె.అమ్మయ్యచౌదరి తర్ఫీదుతో కబడ్డీలో రాణిస్తున్నాను. సీనియర్ నేషనల్స్ ఆడాను. – ఎన్.నాగలత, ప్రకాశం జిల్లా జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి ఇండియన్ కబడ్డీ టీములో స్థానం సంపాదించి, అంతర్జాతీయ పోటీలో పాల్గొని, బహుమతి సా«ధించాలని ఉంది. స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. – ఎం.గౌరి, శ్రీకాకుళం అన్నయ్య స్ఫూర్తితో.. అన్నయ్య గంగాధర్‌రెడ్డి చెడుగుడు పోటీల్లో మంచి క్రీడాకారునిగా గుర్తింపు పొందాడు. ఆయన స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టి జిల్లా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాను. – పి.లీలావతి, గుంటూరు జిల్లా కోచ్‌గా ఎదగాలని ఉంది కబడ్డీలో పూర్తిస్థాయి మెళకువలు తెలుసుకొని జిల్లా కబడ్డీ కోచ్‌గా ఎదగాలని ఉంది. పీఈటీ సుబ్బరాజు స్ఫూర్తితో కబడ్డీలో అడుగు పెట్టాను. – షబానా, కర్నూలు జిల్లా చిన్నతనం నుంచీ మక్కువ గ్రామీణ స్థాయిలో నాకు చిన్నతనం నుంచీ కబడ్డీ అంటే మక్కువ. 13 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇండియన్ క్యాంప్ నిర్వహించాను. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటులో పని చేస్తున్నాను. కబడ్డీ అసోసియేషన్ నాయకులు వీరలంకయ్య, రాంబాబుల ప్రోత్సాహం ఉంది. – శ్రీకృష్ణ, ప్రకాశం జిల్లా అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. అమ్మానాన్నలకు కబడ్డీ అంటే ఇష్టం. వారి ప్రోత్సాహంతో కబడ్డీ టీములో స్థానం సంపాదించాను. పీఈటీ గంగాధరం ఎంతో ప్రోత్సహించారు. భారత జట్టులో స్థానం సంపాదించాలని ఉంది. – కె.మౌనిక, చిత్తూరు జిల్లా యూనివర్సిటీలో బంగారు పతకం యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాను. కబడ్డీలో ప్రవేశానికి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా కబడ్డీలో మెళకువలు నేర్చుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో మంచి కోచ్ కావాలని ఉంది. – బి.సంధ్య, పశ్చిమ గోదావరి జిల్లా -
ఉత్కంఠ భరితం
‘కోట’లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు క్రీడాకారులను పరిచయం చేసుకున్న డిప్యూటీసీఎం నేటితో ముగియనున్న పోటీలు సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పురుష, మహిళల జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను తిలకించారు. శుక్రవారం కర్నూలు– గుంటూరు మహిళల కబడ్డీ పోటీ ఆసక్తిగా సాగింది. ఇరు జట్లు 38 పాయింట్ల వంతున సాధించడంతో చెరో ఒక పాయింటు కేటాయించారు. పురుషుల విభాగంలో కడప 27 పాయింట్లు సాధించగా, తూర్పు గోదావరి 66 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కర్నూలు– పశ్చిమ గోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో పశ్చిమ 29 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు జట్టు శ్రీకాకుళం జట్టుపై రెండు పాయింట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నంపై ప్రకాశం జట్టు 44 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. నెల్లూరు జట్టు అనంతపురం జుట్టుపై 44 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. చిత్తూరు జట్టుపై విశాఖపట్నం 23 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అనంతపురంపై కృష్ణా జట్టు 34 పాయింట్ల తేడా విజేతగా నిలిచింది. అదే విధంగా మహిళా విభాగంలో నెల్లూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 43 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జట్టు కడప పై 46 పాయింట్ల తేడాతో, ప్రకాశం జట్టు చిత్తూరుపై ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై 24 పాయింట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసుకుంది. నెల్లూరుపై అనంతపురం 31 పాయింట్ల ఆధిక్యంతో, శ్రీకాకుళంపై విజయనగరం 31 పాయింట్ల తేడాతో, గుంటూరుపై విశాఖ పట్నం 27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌ న్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
రైలు కింద పడి ఒకరు ఆత్మహత్య
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి రైలుకిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం అగ్రహారం ప్రాంతానికి చెందిన కొజ్జారపు లోవరాజు (35) తెల్లవారు జామున పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద విశాఖపట్నం వైపు Ðð ళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెచ్‌సీ గోవిందరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్‌సీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ ఫలించదన్న వేదనతో..
యువజంట ఆత్మహత్యాయత్నం యువకుడు మృతి, ఆస్పత్రిలో మృత్యువుతో యువతి పోరాటం సామర్లకోట: పెద్దలు తమ ప్రేమను అంగీకరించనే భయంతో యువజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆ సంఘటనలో యువకుడు మరణించగా యువతి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గామానికి చెందిన కల్వకుంట చంద్రశేఖర్, రత్నకుమారిల రెండో సంతానం అనిత (21). రాజోలుకు చెందిన ఆకుల సుబ్బయ్యమ్మ, వెంకటేశ్వర్లు ఏకైక కుమారుడు మణిదీప్ సురేంద్ర కుమార్ (21). వీరిద్దరూ పెద్దాపురం మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ చదువుతున్నారు. అనిత పెద్దాపురం సుధాకాలనీలోని బీసీ బాలికల హాస్టల్ ఉంటూ ప్రతీ రోజూ కళాశాలకు వెళుతోంది. మణిదీప్ సురేంద్రకుమార్ పిఠాపురంలోని మేనమామ ఇంటి వద్ద ఉంటూ ప్రతీ రోజు కళాశాలకు వెళుతున్నాడు. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని ఇద్దరూ భావించారు. దాంతో సురేంద్రకుమార్ బుధవారం అనితకు ఫోన్ చేసి ‘నేను ఈ లోకానికి దూరంగా పోతున్నాను. నాకు ఎవరితోను సంబంధం లేదు’ అని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇద్దరూ చనిపోవాలని సెల్ ఫోన్‌కు మెసెజ్‌లు పెట్టుకున్నట్టు రైల్వే పోలీసులు చెప్పారు. సామర్లకోట మండలం పీబీ దేవం వద్ద సురేంద్రకుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా అనిత హాస్టల్లో పురుగుల మందు సేవించింది. గురువారం తెల్లవారుజామున వసతి గృహంలో అపస్మారక స్థితిలో ఉన్న అనితను కమాటి సూర్యప్రభ, తోటి విద్యార్థినులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడికల్ వార్డు ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. స్టడీ అవర్ కోసం విద్యార్థులను నిద్ర లేపడానికి వెళ్ళగా అనిత కలవరంగా ఉందని, దానిపై తాను ప్రశ్నించగా పురుగుల మందు తాగానని, డబ్బా బాత్రూమ్లో పడేశానని చెప్పినట్టు కమాటి వివరించింది. అయితే విద్యార్థినులు మాత్రం అనిత అపస్మారక స్థితిలో గ్రౌండ్ ప్లోర్ గేటు వద్ద పడిపోయి ఉందని తెలిపారు. అనిత పురుగులు మందు తాగడంతో పాటు ఉరివేసుకునేందుకు యత్నించింది. మెడపై నల్లగా ఉండడంపై తాము అనిత ను ప్రశ్నించగా చున్నీతో లాగుకున్నట్టు తెలిపిందని విద్యార్థినులు, కమాటి తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అనిత తల్లిదండ్రులు రత్నకుమారి చంద్రశేఖర్ ఆసుపత్రికి చేరుకున్నారు. రైల్వే కీమన్ వీరబాబు సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరారు. సామర్లకోట నుంచి రాజమండ్రి వెళ్లే రైలు కింద కేఎం నెం.616/13-15 మధ్య సురేంద్రకుమార్ మృత దేహం లభించింది. మృత దేహం మాంసం ముద్దగా నుజ్జునుజ్జు అయింది. ట్రాక్ సమీపంలో ఉన్న రైలు సిమెంటు కమ్మిలపై బ్యాగ్ ఉంచి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బ్యాగ్‌లో ఉన్న గుర్తింపుకార్డు ఆధారంగా మృతుని వివరాలు సేకరించారు. అతని తల్లిదండ్రులు సుబ్బయ్యమ్మ, వెంకటేశ్వర్లు, బంధువులు సామర్లకోట పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రేమ విషయం తమకు తెలియదని వారు రోదించారు. మృతదేహానికి పెద్దాపురం ఆస్పత్రిలో పోస్టు మార్టమ్ నిర్వహించి కేసు నమోదు చేసి రైల్వే ఎస్సై ఎ. వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మదపిచ్చి’ మగ మృగాలు..
సామర్లకోట :తమ బిడ్డకు పట్టిన దుర్గతి.. కలలో కూడా మరెవరి బిడ్డకూ రాకూడదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘పిచ్చితల్లులను’ కూడా మదపిచ్చి తీర్చుకునే పనిముట్లుగా చూసే వారి నీచత్వానికి ఎన్నడు తెరపడుతుందని ఆక్రోశిస్తున్నారు. ఆడదై పుట్టినంత మాత్రాన ఈ లోకంలో అణువణువునా ఆపదలను, అభద్రతనూ ఎదుర్కోవలసిందేనా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక రజకపేటకు చెందిన ముమన కావమ్మ(23) అనే మతిస్థిమితం లేని యువతి శుక్రవారం రైల్వేస్టేషన్ వద్దనున్న జయ డార్మిటరీ బాత్రూమ్లో ప్రసవవేదనతో మరణించిన విషయం తెలిసిందే. కావమ్మకు చాలా కాలం నుంచి మతిస్థిమితం లేదు. వైద్యులకు చూపినా ఫలితం లేదనడంతో తల్లిదండ్రులైన గంగ, త్రిమూర్తులు చేసేది లేక మిన్నకుండిపోయారు. కావమ్మ పట్టణంలోనే తిరుగుతూ దుకాణాల్లో చిన్నచిన్న పనులు చేస్తూ వారిచ్చే డబ్బులు తీసుకునేది. మధ్యమధ్య ఇంటికి వస్తుండేది. పిచ్చిదైన తమ బిడ్డ ఎక్కడెక్కడ తిరిగినా అప్పుడప్పుడూ కనిపిస్తే చాలని, పిచ్చితనమే ఓ రకంగా ఆమెకు రక్షణ అని తల్లిదండ్రులు భావించారు. అంతేతప్ప ఆడదైతే చాలు అని.. కాముకతను తీర్చుకోవడానికి సిద్ధమయ్యే పరమ నికృష్టులు ఉంటారని వారు అనుమానించలేదు. ఈ క్రమంలోనే కావమ్మను ఎవరో కామాం ధులు గర్భవతిని చేశారు. ఆ విషయం కూడా ఆమె తల్లిదండ్రులు గమనించలేకపోయారు. ఆమె ఎప్పటిలాగే ఊరు పట్టుకుని తిరిగేది. శుక్రవారం తాను అప్పుడప్పుడూ చిన్నచిన్న పనులు చేసే జయ డార్మిటరీకి వెళ్లింది. ఆ సమయంలో పురిటినొప్పులు రావడంతో పరిస్థితి విషమించి బాత్రూమ్లో ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డా తల్లినే అనుసరించి, కన్నుతెరవకుం డానే కన్నుమూసింది. కావమ్మ మృతిపై పోలీసు లు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎప్పుడూ డార్మిట రీకి వచ్చే కావమ్మ పరిస్థితిని అక్కడివారు ప ట్టించుకుని, సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే తమ కుమార్తె ప్రాణం దక్కేదని గంగ,త్రిమూర్తులు రోదిస్తున్నారు. ఆమెను తల్లిని చేసిన ముష్కరుల్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఏదేమై నా.. ప్రభుత్వం మతిస్థిమితం లేని వారి ఆలనాపాలన బాధ్యత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు
నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు సామర్లకోట : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. ఆదివారం ఒక దినపత్రికలో తాను బీజేపీలో చేరుతున్నట్టు అసత్య వార్త ప్రచురణ అయిందని, దానిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి తోట గోపాలకృష్ణ జగన్మోహన్రెడ్డి పెట్టే పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌గా సూచించారని అన్నారు. తన తండ్రి మరణంతో బాధలో ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి తనను ఓదార్చడంతో పాటు తండ్రి బాటలో రాజకీయాల్లోకి రావాలని పెద్దాపురం నియోజకవర్గ టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో చివరి వరకు జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని చెప్పారు. తన వివరణ తీసుకోకుండా తప్పుడు వార్త రావడం బాధగా ఉందన్నారు. ఇటువంటి వార్తల వల్ల కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. -
నరకయాతన
సామర్లకోట : లిఫ్ట్‌లో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 12 మంది ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు నానా అవస్థలూ పడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో సామర్లకోట చేరింది. అందులోనుంచి కాకినాడకు చెందిన 12 మంది ప్రయాణికులు దిగారు. ఒకటో నంబర్ ప్లాట్ఫారానికి వెళ్లేందుకు.. వారు మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న లిఫ్ట్ ద్వారా ఓవర్‌బ్రిడ్జి పైకి చేరారు. అక్కడ నుంచి కిందకు దిగేందుకు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న లిఫ్ట్ ఎక్కారు. అది కిందకు దిగుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి, మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో అందులో ఉన్నవారు హడలెత్తారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అరగంట తరువాత అక్కడకు చేరుకున్నారు. సుమారు 30 నిమిషాలపాటు ప్రయత్నించి గేట్లు తెరచి, లిఫ్ట్ పైభాగంలో ఓపెన్ చేశారు. దీంతో లోపలికి గాలి, వెలుతురు ప్రసరించడంతో ప్రయాణికులు ఉపిరి పీల్చుకున్నారు. 10.40 గంటల సమయానికి వారిని లిఫ్ట్ పైభాగం నుంచి సిబ్బంది బయటకు తీశారు. తాగునీరు, ఆహారం అందజేశారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులకు రైల్వే డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఆర్పీఎఫ్ ఎస్సై రవిశంకర్సింగ్లు ప్రయాణికుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇది నిర్లక్ష్యమే.. సామర్లకోట స్టేషన్లో నెల రోజుల క్రితం కూడా ఇదేవిధంగా లిఫ్ట్ నిలిచిపోయింది. మళ్లీ అటువంటి సంఘటనే చోటుచేసుకుందని, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఈ సందర్భంగా ప్రయాణికులు ఆరోపించారు. నిలిచిపోయిన లిఫ్ట్‌లో గుండె జబ్బు ఉన్నవారుంటే పరిస్థితి ఏమిటని కాకినాడకు చెందిన జ్యోతి, హరిక, నిర్మల, శ్రీదేవి, మోహినీ, చరణ్‌తేజ్, అభిషేక్, ఎస్.శ్రీనివాసులు ప్రశ్నించారు. చిన్న పిల్లలతో లిఫ్ట్ ఎక్కామని, రెండు గంటల పాటు నరకయాతన అనుభవించామని చెప్పారు. అద్దాలతో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే గమనించి, తక్షణ చర్యలు తీసుకునే వీలుంటుంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో జారిపడిన లిఫ్ట్ కాకినాడ క్రైం : కాకినాడ టూటౌన్ నూకాలమ్మ గుడి సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లిఫ్ట్ మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా జారిపడింది. అందులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఐదో అంతస్తులో ఉన్న ఆస్పత్రి యజమాని ఇంట్లో పూజా కార్యక్రమానికి ఆస్పత్రి సిబ్బంది మంగళవారం రాత్రి వెళ్లారు. అనంతరం కిందకు దిగేందుకు ఐదుగురు లిఫ్ట్ ఎక్కారు. మూడో ఫ్లోర్లో మరో పదిమంది కూడా ఎక్కారు. వాస్తవానికి అందులో ఆరుగురు మాత్రమే ఎక్కే వీలుంది. అయితే రోగులను స్ట్రెచర్‌తో తీసుకెళ్లేందుకు వీలుగా లోపల విశాలంగా ఉండడంతో సామర్థ్యానికి మించి జనం ఎక్కారు. అంత బరువు తట్టుకోలేక లిఫ్ట్ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో అది మూడో అంతస్తు నుంచి అమాంతం కిందకు జారి పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా, మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు లేకపోవడంతో దీనిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. -
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
సామర్లకోట/పెద్దాపురం :సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పూర్తి పారదర్శకంగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సర్వే నిర్వహణపై సామర్లకోట టీటీడీసీలో బుధవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మెప్మా అధికారులు, ఐటీడీఏ అధికారులు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 82 రోజులపాటు సర్వే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సంబంధిత అధికార కార్యాలయాలకు పంపించామన్నారు. ఈసర్వేలో ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సమగ్ర సమాచారం, కుల వివరాలు, సామాజిక అంశాలు సేకరించాలన్నారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకొనే నిధుల కేటాయింపు, బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్నారు. గతంలో చేసిన సర్వేలో లోపాలు ఈ సర్వేలో లేకుండా అన్ని స్థాయిల్లో సిబ్బంది కృషి చేయాలన్నారు. సర్వేలో ప్రజలు పూర్తిగా భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులను, అవసరమైతే భారత్ నిర్మాణ్ వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలో 2011లో సేకరించిన సర్వే వివరాలను ఈ నెల 26వ తేదీన ప్రచురిస్తారని, ఆముసాయిదా జాబితాపై 30 రోజుల లోపు ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆక్షేపణలను పరిష్కరించాలన్నారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 52వ రోజు నుంచి 80వ రోజు వరకు అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. 82వ రోజున తుది జాబితా ప్రచురించాలన్నారు. జాబితాను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, గ్రామసంఘాల వద్ద ఉంచాలన్నారు. సెక్ రాష్ట్ర అధికారి రాంబాబు మాట్లాడుతూ 2011లో సేకరించిన డేటా ముసాయిదా జాబితాలోని దిద్దుబాట్లు, సవరణకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 2011లో గణన సమయంలో తొలగించబడిన నివాస స్థలం నుంచి దూరంగా ఉన్న ఆయా కుటుంబాలను చేర్చడానికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ ఈసర్వే కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్ర సర్వేపై అవగాహన కల్పించారు. ట్రైనీ కలెక్టర్ శశాంక్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, మెప్మా పీడీ శైలజావల్లి, ఆర్డీవోలు అంబేద్కర్, కూర్మనాథ్, సుబ్బారావు, శంకరవరప్రసాద్ పాల్గొన్నారు. -
‘గ్రీన్‌ఫీల్డ్’ పునః ప్రారంభం
కాకినాడ క్రైం : వివాదాస్పదమైన సామర్లకోట రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాల శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది. ప్రత్యేకాధికారి పాలనలో పాఠశాల కొనసాగుతోంది. శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు డిప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయురాలిని అధికారులు నియమించారు. ఈ నెల 18న పాఠశాలలో ఉంటున్న కూర్తి జాన్సన్, పాముల సురేంద్ర, పులప సాయిని ప్రిన్సిపాల్ టేకుమూడి శ్రీనివాస్, కరస్పాండెంట్ కోలకొండ వెంకటేశ్వర రావు అమానుషంగా దాడి చేసి, గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలకు అటు విద్యాశాఖ నుంచి కాని, ఇటు ఐసీడీఎస్ నుంచి కాని అనుమతులు లేవని గుర్తించారు. స్థలానికి కూడా పూర్తి స్థాయిలో అనుమతి లేకపోవడంతో భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి పాఠశాల స్థితిగతులపై విచారణ నిర్వహించారు. పాఠశాలలో 53 మంది అంధ బాలలు ఆశ్రయం పొంది, విద్యనభ్యసిస్తున్నారు. పూర్తిగా అనుమతులు లేకుండా నడుస్తుండడంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి పదో తరగతి విద్యార్థులను సమీపంలోని హైస్కూల్లో తాజాగా ఎన్రోల్ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా బియ్యం, కూరగాయలు ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడం, అది చూసిన మరికొంత మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను ఇళ్లకు తీసుకుపోవడంతో, 39 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తీసుకుపోతారేమోనని భావించిన అధికారులు వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని, రాజీవ్ విద్యామిషన్‌లోని విలీన విద్య జిల్లా కో-ఆర్డినేటర్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని అధికారులు భరోసా కల్పించారు. శుక్రవారం నుంచి పాఠశాల పునఃప్రారంభం కావడంతో 39 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి విద్యబోధించేందుకు వికలాంగుల విద్యలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గంగనాపల్లి పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై ఇక్కడకు తీసుకొచ్చారు. ఇంతకుముందే ఆ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. పాఠశాల స్థలం తిమ్మాపురం పంచాయతీకి చెందిన సామాజిక స్థలం కావడంతో దానితో పాటు భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశాల మేరకు విద్య, వికలాంగ సంక్షేమ శాఖలు, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వారి పేర్లను నమోదు చేయించారు. ప్రస్తుతానికి గతంలో పనిచేసే ఉపాధ్యాయులు, ఆయాలనే కొనసాగిస్తున్నారు. త్వరలోనే అంధుల ఆశ్రమ పాఠశాలకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించనున్నట్టు అధికారులు తెలిపారు. వికలాంగ పెన్షన్లూ స్వాహా? గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన 24 మంది అంధ విద్యార్థులకు ప్రతి నెలా రూ.500 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తున్న పెన్షన్ కూడా నిర్వాహకులు స్వాహా చేస్తున్నారు. పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉండడంతో, వారిలో 24 మంది ఇక్కడే ఉంటున్నందున పెన్షన్లను తిమ్మాపురం పంచాయతీ పరిధిలోకి మార్చాలని నాలుగేళ్ల క్రితం అధికారుల నుంచి అనుమతులు పొందారు. పెన్షన్లను పాఠశాలకు అందజేయాల్సిందిగా అధికారులు సూచించడంతో, వాటిని కూడా నిర్వాహకులు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుని, స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 22 మందికి చెందిన పెన్షన్లు రూ.11 వేలు పాఠశాలకు అందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి తల్లిదండ్రులకు చేరడం లేదు. మిగిలిన విద్యార్థులు మాత్రం ప్రతి నెలా వారి ఇళ్ల వద్ద పెన్షన్ తీసుకుంటున్నందున, ఆ సొమ్ము వారి తల్లిదండ్రులకు అందుతోంది. దీనిపై జిల్లా అధికారులు విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పోలీసు స్టిక్కర్.. జీపులో లిక్కర్
పోలీసు స్టిక్కర్ ఉన్న జీపులో మద్యం షాపులకు సరకు సరఫరా చేయడం పలువురిని విస్మయపరి చింది. ప్రత్యేక వాహనంలో మద్యం రవాణా చేయాల్సి ఉండగా, పోలీసు స్టిక్కర్ ఉన్న జీపు ను వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్‌ను వివరణ కోరగా, మద్యం షాపుల యజమానులకు చెందిన జీపును ఇటీవల కోడిపందాల దాడుల కో సం వినియోగించినట్టు చెప్పారు. ఆ సమయంలో పోలీసు స్టిక్కర్‌ను అంటించినట్టు తెలిపారు. ఈ విషయం గుప్పుమనడంతో జీపు స్టిక్కరును పోలీసులు తొలగిం చారు. ఈ విష యం సర్వత్రా చర్చనీయాంశ మైంది.