భద్రాచలం టు సామర్లకోట
410 కిలోమీటర్ల సాహసయాత్ర
భద్రాచలం అర్బన్: విజయవాడ ఆంధ్ర నావలింగ్ యూనిట్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో సైలింగ్ ఎక్స్‌పిడేషన్–2017 క్యాంప్‌లో భాగంగా గోదావరిలో 410 కిలోమీటర్ల సాహసయాత్ర సాగనుంది. భద్రాచలంలోని గోదావరి నుంచి ఏపీలోని సామర్లకోట వరకు సాగనున్న ఈ యాత్రను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు.
యాత్ర ఈ నెల 14న సామర్లకోట చేరుకుంటుందని ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్ తెలిపారు. ఏటా ఈ యాత్ర చేపడతామని, ఈ ఏడాది తొలిసారిగా 14 మంది మహిళా క్యాడెట్లు పాల్గొంటున్నారని చెప్పారు. మొత్తం 42 మంది విద్యార్థులతో యాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్.సి.నాయుడు, ఆంధ్ర నావల్ కమాండర్ ఎస్.పి. ఖాజా, డిప్యూటీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కె.సి.ఎస్ రావు, భద్రాచలం ఏఎస్పీ సునీల్ దత్, ఆర్డీవో శివనారాయణ రెడ్డి, సర్పంచ్ శ్వేత, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు.