వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు | Thota Subba Rao Naidu i dont left the ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

Published Mon, Dec 29 2014 12:22 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు - Sakshi

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు

 నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు
 సామర్లకోట : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. ఆదివారం ఒక దినపత్రికలో తాను బీజేపీలో చేరుతున్నట్టు అసత్య వార్త ప్రచురణ అయిందని, దానిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి తోట గోపాలకృష్ణ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టే పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌గా సూచించారని అన్నారు. తన తండ్రి మరణంతో బాధలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తనను ఓదార్చడంతో పాటు తండ్రి బాటలో రాజకీయాల్లోకి రావాలని పెద్దాపురం నియోజకవర్గ టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో చివరి వరకు జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని చెప్పారు. తన వివరణ తీసుకోకుండా తప్పుడు వార్త రావడం బాధగా ఉందన్నారు. ఇటువంటి వార్తల వల్ల కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement