హోరా హోరీగా కబడ్డీ పోటీలు | kabaddi competitions | Sakshi
Sakshi News home page

హోరా హోరీగా కబడ్డీ పోటీలు

Published Sat, Oct 8 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

హోరా హోరీగా కబడ్డీ పోటీలు

హోరా హోరీగా కబడ్డీ పోటీలు

సామర్లకోట :
సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల స్త్రీ, పురుష జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్‌ లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్త్రీ, పురుష కబడ్డీ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం శనివారం రాత్రి పోటీలను తిలకించారు. అంతర్జాతీయ కోచ్‌ పోతుల సాయిని, పీఈటీ తాళ్లూరి వైకుంఠంలను డిప్యూటీ సీఎం, రాజప్పలు ఘనంగా సన్మానించారు. మ్యాచ్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులకు నవభారత్‌ వెంచర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగభైరవ ప్రభాకర్‌ బ్యాగ్‌లు, స్టాప్‌ వాచ్, విజిల్‌ అందజేశారు. మహిళా విభాగంలో విజయనగరం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 48 పాయింట్ల తేడాతో, గుంటూరు జట్టుపై తూర్పుగోదావరి 37 పాయింట్ల ఆధిక్యతతో, విశాఖ జట్టు అనంతపురం జట్టుపై 41 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టు శ్రీకాకుళం జట్టుపై 35 పాయింట్ల తేడాతోను ఘన విజయం సాధించాయి. పురుషుల విభాగంలో  గుంటూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 32 పాయింట్ల తేడాతోను,  కృష్ణా జట్టుపై విశాఖ జట్టు 9 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచాయి. ప్రకాశం జట్టు నెల్లూరు జట్టుపై 10 పాయింట్ల తేడాతోను, విజయనగరం– పశ్చిమ గోదావరిపై మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రాత్రి 8.30 గంటకు సీమి ఫైనల్‌ మ్యాచ్‌లు ప్రారంభించారు. పురుషుల మొదటి సెమీ ఫైనల్‌ తూర్పు– విశాఖ జట్ల మధ్య, మహిళల సెమీ ఫైనల్‌ తూర్పు –విజయనగరం జట్ల మధ్య జరిగాయి. మహిళా విభాగంలో విజయనగరం జట్టు తూర్పు గోదావరిపై 19 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తూర్పు గోదావరి పురుషుల జట్టు విశాఖ జట్టుపై 22 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్‌ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, నలమాటి జానికి రామయ్య, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్‌ చైర్మన్‌ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్‌ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement