25న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
25న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
Published Wed, Sep 21 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
బాపట్ల: గుంటూరు జిల్లా స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 25న బాపట్ల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరుగుతుందని గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరి ఊసా రాంబాబు తెలిపారు. ఎంపికైన జట్లు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పల్లంబీడు గ్రౌండ్‌లో జరిగే 64వ అంతర్రాష్ట్ర స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పురుషులు 80 కిలోలు, స్త్రీలు 70 కేజీలు మించి ఉండరాదన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా జిల్లా వాసులై ఉండాలని, ఆధార్‌కార్డు ఒరిజినల్‌తో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కత్తి శ్రీనివాసరావు ఉన్నారు.
Advertisement
Advertisement