district team
-
బాల్‌బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
లింగారావుపాలెం(యడ్లపాడు): స్కూల్æగేమ్స్ జిల్లా బాల్ బాడ్మింటన్ జట్ల ఎంపిక ప్రక్రియ మండలంలోని లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మొదలైంది. స్కూల్‌గేమ్స్ కమిటీ జిల్లా కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా ఎంపిక చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఉదయం పది గంటలకు ఈ ఎంపిక ప్రక్రియను వ్యాయామోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కరిముల్లారావుచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడి పోయి, ఎంతో చురుగ్గా, శారీరక ధృఢత్వాన్ని కలిగి ఉంటారన్నారు. ఫలితంగా విద్యలోనూ రాణించగలరన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి.రవీంద్రబాబు, పీఈటీ షేక్ ఖాదర్‌మస్తాన్, పీఈటీలు పాల్సుధాకర్, ఇస్మాయిల్, సీనియర్ పీఈటీ అమ్మయ్య తదితరులు ప్రతిభా పోటీలను పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అండర్ 14, అండర్–17 బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు. -
హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఫిరంగిపురం: పట్టుదలతో ఆడి జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్వో) శ్రీనివాసరావు సూచించారు. ఫిరంగిపురంలోని సెయింట్ ఆన్స్ బాలికల హైస్కూల్లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు, ఫిరంగిపురం మండలాలకు చెందిన విద్యార్థినులను పోటీలకు ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 5,6 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ వెంగళరెడ్డి, పీఈటీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
సబ్ జూనియర్ హాకీ జిల్లా జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : స్థానిక అనంత క్రీడాగ్రామంలో బుధవారం సబ్–జూనియర్ హాకీ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఎంపికైన జట్టు ఈ నెల 7–10 వరకు నెల్లూరులో జరిగే 7వ సబ్–జూనియర్ పోటీల్లో పాల్గొంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ట్రెజరర్ బాబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన హాకీ బాలుర జట్టు ఇదే : చరణ్‌కుమార్, శివకుమార్‌నాయక్(పెడపల్లి), శివకుమార్‌నాయక్, సురేష్, జశ్వంత్(వెంకటాద్రిపల్లి), చంద్రమౌళి, సుమంత్(తలుపురు), వెంకటేష్(నరిమెట్ల), అశోక్(గోట్లూరు), రాకే ష్‌బాబు, యతీష్, ప్రవీణ్‌చంద్, సాయికిరణ్(అనంతపురం), కుశాల్‌కుమార్, ముకేష్, సాయికుమార్, సాయినాథ్‌రెడ్డి, గణేష్(ధర్మవరం), కోచ్ : హస్సేన్, మేనేజర్ : బాలాజీ, కో–ఆర్డీనేటర్ : బాబయ్య -
రైఫిల్ షూటింగ్ జిల్లా జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలబాలికల జిల్లా రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపిక నిర్వహించినట్లు ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఎంపికలను వ్యాయామ ఉపా«ధ్యాయుడు సంజీవరెడ్డి పర్యవేక్షించారు. బాలుర విభాగంలో హర్షవర్ధన్‌రెడ్డి, వరుణ్ అవినాష్, బాలికల విభాగంలో వై.శ్రీనిత్య, ఎం.రిషిత ఎంపికైనట్టు చెప్పారు. -
చౌక్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
గణపవరం (గుంటూరు జిల్లా) గణపవరం చుండి రంగనాయకులు పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జిల్లా స్ధాయి చౌక్‌బాల్ అండర్ 19 జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి వంద మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చౌక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్ సుధాకరరావు, ఉపాధ్యక్షుడు మువ్వా వేణు, జిల్లా చౌక్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, సిఆర్ కళాశాల అధ్యక్షుడు చుండి విజయసారధి, కార్యదర్శి ఫిలిప్‌రాజు, ట్రెజరర్ ఊసా సుబ్బారావులు హాజరయ్యారు. బాయ్స్ విభాగంలో 12 మంది జట్టును ఎంపిక చేశారు. వీరితో పాటూ అదనంగా మరో ముగ్గురు క్రీడాకారులను ఎంపికచేశారు. ఎంపికైన ఈ రెండు జట్లు ఈ నెల 3, 4, 5 తేదీల్లో కడప జిల్లా, ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ 19 జిల్లా జట్టు తరపున స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొననున్నారు. ఈ టీములకు కోచ్‌లుగా మనోహర్, అమీర్, మేనేజర్లుగా ఫిలిప్‌రాజు, వెంకటరమణ వ్యవహరించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి లక్ష్మీరాజ్యం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాదూసింగ్ఠాకూర్, అధ్యాపకులు పి శ్రీనివాసరావు ఉన్నారు. ఎంపికైన వారి వివరాలు. డి సుమంత్, గోపీకష్ణ (చైతన్య కళాశాల, చిలకలూరిపేట), ఐ వంశీకష్ణ, కె బాబు, ఎస్కే సమీర్ (మోడరన్ కళాశాల, చిలకలూరిపేట) బి నవీన్, (నారాయణ కళాశాల, చిలకలూరిపేట) ఎ భావనసాయి (భాష్యం, గుంటూరు), వి మణి (సిఆర్ కళాశాల గణపవరం) కె విద్యాసాగర్ (జెడ్పీ హెచ్ఎస్, పసుమర్రు), ఐ మణికంఠ (వేద, చిలకలూరిపేట), ఎం సిసింద్రీ (జెడ్పిహెచ్ఎస్, మురికిపూడి) పి గోపీపూర్ణచందు (జెడ్పిహెచ్ఎస్, బొప్పూడి) అదనంగా కె కిరీటి (భాష్యం, గుంటూరు) పవన్‌కళ్యాణ్ (నారాయణ, చిలకలూరిపేట) కె జాన్ (జెడ్పీహెచ్ఎస్, పసుమర్తి) ఎస్కే జానీ (మోడరన్, చిలకలూరిపేట) బాలికల విభాగంలో ఎంపికైన వారి వివరాలు.... ఎస్ సువర్ణ (సెయింట్ ఛార్లెస్, చిలకలూరిపేట) కె రేణుక (ఏఎంజీ, చిలకలూరిపేట), ఎస్కే మునీరా, ఎస్కే ఆసిఫా, ఎస్కే ఆరిఫా (జెడ్పిహెచ్ఎస్, పసుమర్తి), బి శిల్ప (జెడ్పీహెచ్ఎస్; బొప్పూడి) పి శిరీష, పి భార్గవి, ఎన్ కవిత, అనూష (వేద, చిలకలూరిపేట), అలేఖ్య, పావని (మోడరన్, చిలకలూరిపేట), అదనంగా కె జ్యోతి, సిహెచ్ జయరాణి, భవానిలను ఎంపికచేశారు. -
జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాకారులు 6 నుంచి గూడూరులో రాష్ట్రస్థాయి పోటీలు తెనాలి: రాష్ట్ర అంతర జిల్లాల సీనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్న వాలీబాల్ పురుషుల, మహిళల జిల్లా జట్లను ఆదివారం ఇక్కడ ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ మైదానానికి జిల్లావ్యాప్తంగా వచ్చిన క్రీడాకారుల నుంచి ఎంపిక నిర్వహించారు. అక్టోబరు 6– 9 తేదీల్లో నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే అంతరజిల్లాల వాలీబాల్ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఆయనతోపాటు ఎస్.నిరంజనరావు, జె.సింగారావు, జీకేవీఎస్ విజయ్‌చంద్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి జి.బుల్లిప్రసాద్, రిటైర్డ్ జిల్లా క్రీడాభివద్ధి అధికారి ఆర్.సత్యనారాయణ పాల్గొన్నారు. పురుషుల జట్టు ఇదీ.. షేక్ బాజీ (కొలనుకొండ), వి.సాయినితిన్, కె.ఉదయ్‌కుమార్, టి.తరుణ్ చమన్య (వడ్డేశ్వరం), కె.మధుసూదనరావు, టి.రవి (మంగళగిరి), కె.జెస్సిబాబు (మాచవరం), డి.సాయికృష్ణ, ఇ.రవీంద్ర (తెనాలి), షేక్ షమ్మీ సోహిల్, డి.సాయితేజ (వెదుళ్లపల్లి), ఎం.రాహుల్ (గుంటూరు), జి.కోదండరామయ్య (గంగవరం), జి.నవీన్ (వేమూరు), టి.నాగరాజు (ఈమని). ఇది మహిళల జట్టు.. వీఎస్ఎల్కే దుర్గ, ఎ.నందిని (నంబూరు), డి.నారూష, పి.మాధురి, సీహెచ్.జెష్మ (గుంటూరు), వి.ద్రాక్షాయని, బీఎల్ కాంతమ్మ, వి.శిరీష, డి.వాణి, ఎ.రమ్య (తెనాలి), బి.మదర్‌థెరిస్సా (భట్టిప్రోలు), ఎ.కావ్య (అమతలూరు), బి.పరిమళ, బి.వైష్ణవి (వడ్లమూడి). -
25న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
బాపట్ల: గుంటూరు జిల్లా స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 25న బాపట్ల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతుందని గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరి ఊసా రాంబాబు తెలిపారు. ఎంపికైన జట్లు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పల్లంబీడు గ్రౌండ్లో జరిగే 64వ అంతర్రాష్ట్ర స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పురుషులు 80 కిలోలు, స్త్రీలు 70 కేజీలు మించి ఉండరాదన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా జిల్లా వాసులై ఉండాలని, ఆధార్‌కార్డు ఒరిజినల్‌తో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కత్తి శ్రీనివాసరావు ఉన్నారు. -
వెయిట్‌లిఫ్టింగ్ జిల్లా జట్టు ఎంపిక
డోర్నకల్ : హైదరాబాద్ లో ఆదివారం నుంచి ప్రా రంభమయ్యే రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూని యర్ వెయిట్‌లిఫ్టింగ్ పో టీలకు జిల్లా జట్లను శనివారంమండల కేంద్రంలో ఎంపిక చేశారు. స్థానిక హనుమా¯ŒS వ్యాయామశాలలో జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేష¯ŒS జనరల్ సెక్రటరీ కొత్త్త రాంబాబు జట్లను ప్రకటిం చారు. సబ్‌జూనియర్ బాలుర జట్టుకు సంబంధించి 50 కేజీల విభాగంలో ఎం. వేణు, జి.గణేష్, 56 కేజీల విభాగంలో కె.హర్షిత్, బి.కార్తీక్, 62 కేజీల విభాగంలో ఎ¯ŒS.రాజేష్, 69 కేజీల విభాగంలో జె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎండీ.మాదుర్, 85 కేజీల విభాగంలో జి.గణేష్ ఎంపికైనట్లు తెలిపారు. జూని యర్ బాలుర జట్టుకు 50 కేజీల విభాగంలో కె.ప్రవీణ్, 56 కేజీల విభాగంలో కె.సందీప్, 62 కేజీల విభాగంలో రాజేష్, జి.హేమంత్, 69 కేజీల విభాగంలో జె.సాయి, 77 కేజీల విభాగంలో కె.నరేంద్రబాబు, ఎ¯ŒS ఉమేష్, 85 కేజీల విభాగంలో కె.యాకేష్, 94 కేజీల విభాగంలోఎండీ.ఖలీల్, జె.రమేష్ ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల జట్టుకు 44 కేజీల విభాగంలో బి.కావేరి, 48 కేజీల విభాగంలో ఎం.సుష్మ, 53 కేజీల విభాగంలో పి.స్రవంతి, 58 కేజీల విభాగంలో ఎం.మౌనిక, 63 కేజీల విభాగంలో బి.సింధు, 68 కేజీల విభాగంలో ఎస్.సంధ్య, 75 కేజీల విభాగంలో డి.ప్రియాంక, ఎస్.సోని ఎంపికయ్యారు. జూనియర్ బా లికల జట్టుకు 44 కేజీల విభాగంలో జి.రోజా, 53 కేజీల విభాగంలో బి.వాణీశ్వరి, 63 కేజీల విభాగంలో మహాలక్ష్మి ఎంపికయ్యారు. బాలుర టీంకు కొత్త కుమార్, బాలికల టీంకు అనిల్‌కుమార్ కోచ్‌లుగా వ్యవహరిస్తారని రాం బాబు తెలిపారు. -
ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా జట్ల ఎంపిక
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 బాలురు, బాలికల జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వై.తాతబ్బాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్, చదరంగం, విలువిద్య పోటీలకు సంబంధించి క్రీడాకారుల ఎంపిక జరిగిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన పీడీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజుపంతులు క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించి ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్‌కు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి అన్నవరంలో జరిగే ఏపీ బాల్ బ్యాడ్మింటన్ చాంపియ¯Œæషిప్ పోటీల్లో పాల్గొంటారని, మిగిలిన పోటీలకు తేదీలు, ఖరారు కావాల్సి ఉందని అన్నారు. ఎంపికైన క్రీడాకారులు వీరే బాల్ బ్యాడ్మింటన్ (బాలురు) : కేఎస్ శివప్రసాద్, డి.రమేష్, ఎం.సాయిరాం, కె.జయప్రసన్న (జీబీఆర్ కాలేజీ, అనపర్తి); జీవీఎన్ ప్రసాద్ (ఎస్ఎస్డీ జూనియర్ కళాశాల, అన్నవరం); ఎస్కే సంసిద్ (శ్రీ ప్రజ్ఞ జూనియర్ కాలేజీ, బిక్కవోలు); ఎన్.నాగ అరుణస్వామి (జీజేసీ, మండపేట); ఎ.దశరథరాము (ఆదిత్య కాలేజీ, కాకినాడ); టి.కిషోర్ (ఏపీటీడబ్ల్యూ, రంపచోడవరం); కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు). బాల్ బ్యాడ్మింటన్ (బాలికలు) : గీతా ప్రసన్న (ప్రగతి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం); కె.సుధాపావని (ప్రగతి కళాశాల, ప్రత్తిపాడు); జి.స్వర్ణలత, వై.చంద్రకళ, డి.మణిచందన (జీజేసీ, కొత్తపేట). చదరంగం (బాలికలు) : ఆర్.రాగజోత్య్న (గీతం కాలేజీ, కాకినాడ); కె.అనిత (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రాజోలు); డి.సిరి (శ్రీచైతన్య, కాకినాడ); వీఎస్ఎస్ ప్రత్యుష. చదరంగం (బాలురు) : వై.గాబ్రేష్, కె.సుధీష్, (నారాయణ, కాకినాడ); కె.సుధీర్, వై.శేఖర్ (డాక్టర్ బీవీఎస్ఆర్ కాలేజీ, కొత్తూరు); ఎల్.ఆనంద్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, ఎ.మల్లవరం); ఎస్.ఫణీంద్ర (జీజేసీ ఆలమూరు); పి.వీరాస్వామి (ఎస్వీజేసీ, తుని). విలువిద్య (బాలికలు) : కె.జస్వంతి (శ్రీచైతన ్య జూనియర్ కళాశాల, అమలాపురం) విలువిద్య (బాలురు) : జేహెచ్ఎస్ అరుణ్‌తేజ (నారాయణ కాలేజీ, రాజోలు); ఎన్ఎల్ వంశీకృష్ణ, బీఎస్ఎన్ నరేంద్ర (తిరుమల జూనియర్ కళాశాల, కాతేరు); సీహెచ్.నవీన్, కె.మహేష్‌బాబు, ఎం.స్వరూప్‌కుమార్ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, కొత్తూరు); కె.వెంకటకృష్ణ, కె.అజయ్ (జీజేసీ, మామిడికుదురు). -
రేపటి నుంచి జట్ల ఎంపిక
ఉయ్యూరు : కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని గేమ్స్ నిర్వహణా కమిటీ ప్రతినిధి బాలు తెలిపారు. స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8న షటిల్, బ్యాడ్మింటన్, 9న అథ్లెటిక్స్ జట్ల ఎంపిక చేస్తామన్నారు. ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే ఈ ఎంపికకు ధృవపత్రాలతో విద్యార్థులు హాజరుకావాలని కోరారు. -
3న సైకిల్‌పోలో జిల్లా జట్ల ఎంపికలు
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్) : సైకిల్ పోలో కృష్ణాజిల్లా సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం.10గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాలుర జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనియాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు «ధ్రువీకరణ పత్రం, క్రీడాదుస్తులు, షూస్‌తో క్రీడా మైదానంలో హాజరు కావాలని చెప్పారు. ఎంపికైన జట్లు సెప్టెంబర్ 11, 12వ తేదీలలో కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగే ఏపీ అంతర్ జిల్లాల సైకిల్ పోలో ఛాంపియన్ షిప్ పోటీలకు పంపటం జరుగుతుందని చెప్పారు. -
త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : త్రోబాల్ జిల్లా జట్టును ఆదివారం స్థానిక శ్రీ శివాణి గురుకుల పాఠశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాuý శాలల నుంచి వచ్చిన 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా 12 మందితో కూడిన బాలబాలికల జట్లను వేర్వేరుగా ఎంపిక చేశారు. ఎంపికలో త్రోబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కార్యదర్శి చీరటి ప్రభాకర్, పీఈటీలు వి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.కిషన్, ఎం.రాజు, జి.మనోహర్, ఎం.రాజేందర్, ఎ.అశోక్, సాంబయ్య, కె.రవి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు వీరే... త్రోబాల్ బాలుర జట్టు : ఎస్.ఆంజనేయులు, ఎం.సాంబరాజు, స్వరాజ్యం, మధు, అశోక్, ప్రతాప్, రవి, రాజు, సుమన్, చంద్రశేఖర్, ఎం.రాజు, వి.సంజీవ. బాలికల జట్టు : శారద, సాయిశ్రీ, నవ్యశ్రీ, రజిత, అశ్విని, అంజలి, సాత్విక, రమాదేవి, కవిత, కపిల, రమ్య, అనూష ఎంపికయ్యారు. -
రేపు త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండలంలోని శివునిపల్లి శ్రీవాణి గురుకుల విద్యాలయంలో ఈ నెల 7న త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు త్రోబాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కిరణ్‌గౌడ్, కోశాధికారి నీరటి ప్రభాకర్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఆదివాంర పాఠశాలలో నిర్వహించే ఎంపిక పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 13న సికిందరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు తరపున పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9951180497 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు.