త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
Published Mon, Aug 8 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : త్రోబాల్ జిల్లా జట్టును ఆదివారం స్థానిక శ్రీ శివాణి గురుకుల పాఠశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాuý శాలల నుంచి వచ్చిన 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా 12 మందితో కూడిన బాలబాలికల జట్లను వేర్వేరుగా ఎంపిక చేశారు. ఎంపికలో త్రోబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కార్యదర్శి చీరటి ప్రభాకర్, పీఈటీలు వి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.కిషన్, ఎం.రాజు, జి.మనోహర్, ఎం.రాజేందర్, ఎ.అశోక్, సాంబయ్య, కె.రవి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు వీరే...
త్రోబాల్ బాలుర జట్టు : ఎస్.ఆంజనేయులు, ఎం.సాంబరాజు, స్వరాజ్యం, మధు, అశోక్, ప్రతాప్, రవి, రాజు, సుమన్, చంద్రశేఖర్, ఎం.రాజు, వి.సంజీవ.
బాలికల జట్టు : శారద, సాయిశ్రీ, నవ్యశ్రీ, రజిత, అశ్విని, అంజలి, సాత్విక, రమాదేవి, కవిత, కపిల, రమ్య, అనూష ఎంపికయ్యారు.
Advertisement
Advertisement