Throwball
-
త్రోబాల్ క్రీడాకారుడికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, గుంటూరు(తాడికొండ): భారత త్రోబాల్ జట్టు మాజీ కెప్టెన్ చావలి సునీల్‌కు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ చెక్కును మంత్రి ఆర్కే రోజా, ఎంపీ నందిగం సురేష్ శుక్రవారం సునీల్‌కు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన చావలి రాజు కుమారుడు సునీల్ 2012 నుంచి అనేక ఏళ్ల పాటు భారత త్రోబాల్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సునీల్ ఆయన వద్దకు పలుమార్లు వెళ్లి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోకపోవడంతో దళితుడైన సునీల్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే ఆటను కొనసాగించారు. అనంతరం పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసిన సునీల్.. తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక న్యాయం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇటీవల సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి సునీల్‌కు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, ఎంపీ సురేష్ శుక్రవారం సునీల్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సునీల్ కెప్టెన్‌గా ఎన్నో మ్యాచ్‌లలో భారత్‌ను విజయాల బాటలో నడిపించారని ప్రశంసించారు. తన ప్రతిభను గుర్తించి.. ఆర్థిక సాయం అందించినందుకు సీఎం జగన్, మంత్రి రోజా, ఎంపీ సురేష్‌కు సునీల్ కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్) -
తెలంగాణ త్రోబాల్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను బుధవారం ప్రకటించారు. బాలికల జట్టుకు కోచ్‌గా ఎం. అవినాశ్, మేనేజర్‌గా అరుణ కుమారి... బాలుర జట్టుకు కోచ్‌గా కె. అరుణ్ కుమార్, మేనేజర్‌గా జి. అశ్విన్ కుమార్ వ్యవహరించనున్నారు. హరియాణాలోని పానిపట్‌లో ఈనెల 23 నుంచి 25 వరకు జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ త్రోబాల్ సంఘం కార్యదర్శి ఎస్. సోమేశ్వర్ స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీవైఎస్ఓ ఎస్. సుధాకర్ రావు పాల్గొన్నారు. జట్ల వివరాలు బాలికలు: ప్రాచి దేశ్‌పాండే, సైనా కుమారి, రుక్మిణీ కుమారి మిశ్రా, మహీన్ రూహి, అమృత వర్షిణి, యశస్వి, కె. మిరెల్లీ, ప్రియాంక చౌదరి, శ్రీహా రెడ్డి, స్రవంతి రెడ్డి, శాలిని ప్రియ, ఎ. స్నేచ్ఛ సోనాల్, టి. హారిక, హిమాని, యు. ఇందు. బాలురు: టి. రాజారామ్, పి. శ్రీనివాస్, బాలాజీ, ఎన్. స్వామి, బి. రాజు, ఎం. అక్షిత్, జి. నితిన్, కె.కుల్దీప్, రుణీత్ రెడ్డి, మణికాంత్, సందేశ్, జి.గణేశ్, సిద్ధార్థ్ రెడ్డి, జి. భగవంత్ రావు. -
విజేత భారత్
సాక్షి, హైదరాబాద్: ఇండో–థాయ్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 25–23, 25–20తో థాయ్‌లాండ్ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ఆసియా త్రోబాల్ కార్యదర్శి మొహమ్మద్ లతీఫుద్దీన్, థాయ్‌లాండ్ కార్యదర్శి మన్నత్ బూన్చాన్ భారత జట్టును అభినందించారు. , -
రన్నరప్ తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకున్నాయి. సోమవారం జరిగిన బాలుర టైటిల్ పోరులో కర్ణాటక జట్టు 25–21, 25–23తో తెలంగాణపై గెలుపొందింది. బాలికల తుదిపోరులోనూ కర్ణాటక 25–20, 25–22తో తెలంగాణను ఓడించింది. బాలుర జట్టు తరఫున బి. వేణుగోపాల్, బాలికల జట్టులో ఆర్. మౌనిక రాథోడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరికీ ‘బెస్ట్ అటాకర్’ అవార్డులు దక్కాయి. -
రాష్ట్ర త్రోబాల్ జట్టు కెప్టెన్‌గా అజిత్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం తెలంగాణ త్రోబాల్ సంఘం ప్రకటించింది. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎం. అజిత్ కుమార్, కోచ్‌గా ఎం. చంద్ర ప్రకాశ్ వ్యవహరించనున్నారు. మహిళల జట్టుకు కె. ఎమీమా సారథిగా, సుచేతన కోచ్‌గా ఎంపికయ్యారు. చెన్నైలో 20, 21 తేదీల్లో సౌత్‌జోన్ జాతీయ త్రోబాల్ టోర్నీ జరుగుతుంది. జట్ల వివరాలు పురుషులు: ఎం. అజిత్ కుమార్ (కెప్టెన్), ఎస్. కురుమూర్తి, కె. ప్రవీణ్ కుమార్, వై. సాయి నిక్షయ్ రెడ్డి, ఎం. యాదయ్య, ఎస్. సాయి కుమార్, కె. మల్లేశం, ఎ. గాంధీ, ఎం. శ్రీనాథ్, డి. కిరణ్ చారి, ఎం.జె. టైసన్, కె. చరణ్ కుమార్, ఎస్. మధుసూదన్, ఎం. చంద్ర ప్రకాశ్ (కోచ్), చక్రపాణి (మేనేజర్). మహిళలు: కె. ఎమీమా (కెప్టెన్), పి. ఇందు రెడ్డి, ఎం. ఇషా సాయి, డి. శ్వేత, పూజ సురేశ్, బి. వైష్ణవి, వి. రాణి, ఎస్. నిహారిక, రిచా శర్మ, జె. సరిత, గురుప్రీత్ కౌర్, జెజ్రీల్ జోయ్సీన్, కృష్ణ ఇందూజ, షరోన్, సుచేతన (కోచ్), పూర్వ (మేనేజర్). -
హైదరాబాద్ జట్లకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి అండర్–17 త్రోబాల్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు నిరాశ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ బాలబాలికల జట్లు రెండో స్థానంలో నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో హైదరాబాద్ 13–15, 12–15తో నిజామాబాద్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నల్లగొండ 15–11, 15–9తో కరీంనగర్‌పై గెలుపొందింది. బాలికల టైటిల్‌పోరులో నల్లగొండ 15–10, 15–11తో హైదరాబాద్‌పై గెలుపొందింది. నిజామాబాద్ 15–10, 15–13తో కరీంనగర్‌పై నెగ్గి మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఫొనిక్స్ స్పోర్ట్స్ క్లబ్ చీఫ్ కో ఆర్డినేటర్ సాయికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ప్రిన్సిపల్ కామేశ్వరి, ఎస్జీఎఫ్ అబ్జర్వర్ పి. జగన్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల శుభారంభం
అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. నిజామాబాద్ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జీఎస్ఏ గ్రౌండ్సలో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు 15-1, 15-1తో మెదక్ జట్టుపై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో 15-12, 11-15, 15-12తో నిజామాబాద్ జట్టును ఓడించింది. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 15-4, 15-6తో కరీంనగర్ జట్టుపై, మరోమ్యాచ్‌లో 15-3, 15-6తో నిజామాబాద్ జట్టుపై గెలిచి ముందంజ వేసింది. ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ త్రోబాల్ సంఘం కార్యదర్శి పి. జగన్మోహన్, కోశాధికారి కె. వెంకట్, నిజామాబాద్ జిల్లా త్రోబాల్ సంఘం కార్యదర్శి నాంచారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషులు: మహబూబ్‌నగర్ 15-2, 15-6తో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి 15-3, 15-12తో ఖమ్మంపై, నిజామాబాద్ 15-3, 15-0తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. మహిళలు: రంగారెడ్డి 15-3, 15-1తో మెదక్‌పై, ఖమ్మం 15-9, 15- 13తో మహబూబ్‌నగర్‌పై, నిజామాబాద్ 15- 9, 15-13తో కరీంనగర్‌పై గెలుపొందాయి. -
హోరాహోరీగా జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలు
– లీగ్దశలో దూసుకెళ్తున్న ఏపీ, హర్యానా ఉమెన్స్ జట్లు కల్లూరు: కర్నూలు నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఆలిండియా త్రోబాల్ ఫెడరేషన్ కప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండవ రోజు శనివారం లీగ్ దశ ఉమెన్స్ విభాగంలో ఆం్ర«దప్రదేశ్ జట్టు, రాజస్థాన్ జట్లు పోటీ పడగా బెస్టాఫ్ త్రీ సెట్లలో 15–6, 15–9 పాయింట్ల తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో తెలంగాణ జట్టు, హర్యానా జట్టు పోటీ పడగా 15–6, 15–9 పాయింట్ల తేడాతో హర్యానా జట్టు జయకేతనం ఎగురవేసింది. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు, మధ్యప్రదేశ్ జట్టు తలపడ్డాయి. 15–10, 3–15, 5–15 పాయింట్లతో హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. మూడవ రోజు నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. -
హైదరాబాద్ జట్లకే టైటిల్స్
హైదరాబాద్: తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు దక్కించుకున్నాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు 13-15, 15-9, 15-11తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందగా... మహిళల విభాగంలోనూ హైదరాబాద్ జట్టు 13-15, 15-10, 15-12తో రంగారెడ్డి జట్టుపైనే విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్లు వరుసగా రెండోసారి గెలుచుకోవడం విశేషం. పురుషుల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో వరంగల్ జట్టు 15-09, 13-11తో నిజామాబాద్‌పై, మహిళల కేటగిరీలో ఖమ్మం 15-1, 15-10తో కరీంనగర్‌పై పైచేయి సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్, బోయిన్పల్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్ ప్రిన్సిపాల్ సునీర్ నాగి పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
కీసర: నాగారం గ్రామంలోని విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ ఆద్వర్యంలో జిల్లా త్రోబాల్ క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. పురుషుల విభాగంలో కెప్టెన్‌గా నిఖిల్, వైస్ కెప్టెన్‌గా హరీష్, సభ్యులుగా దుర్గా, సాయిజేత, రాకేష్, వంశి, జీవన్, హరికృష్ణ, భార్గవ్, సాయి, కీర్తిరామ్, నితిన్, భార్గవ్, బిము, సాయిచరణ్, కోచ్‌లుగా నానాజీ, మనేందర్, సుభాన్లు ఎంపికయ్యారు. మహిళల విభాగం కెప్టెన్‌గా దీపిక, వైస్ కెప్టెన్‌గా అనిశా, సభ్యులుగా శ్రీలత, మమత, శ్రీలేఖ, శృతి, సరిత, రజిని, హేమ, శ్వేత, హర్షిత, రేవతి, మేద, శృతి, కోచ్‌లుగా జాన్‌రెడ్డి, మనేందర్లు ఎంపికయ్యారు. కాగా నేటినుంచి నగరంలోని అల్వాల్‌లో జరిగే రాష్ర్ట స్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా తరపున ఈ రెండు జట్లు పాల్గొననున్నట్లు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఏఓ నాగేంద్ర, ప్రిన్సిపాల్ కవిత, సెలక్షన్స్ కమిటీ చైర్మన్ రేవంత్, పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
త్రోబాల్ జిల్లా జట్టు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : త్రోబాల్ జిల్లా జట్టును ఆదివారం స్థానిక శ్రీ శివాణి గురుకుల పాఠశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాuý శాలల నుంచి వచ్చిన 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా 12 మందితో కూడిన బాలబాలికల జట్లను వేర్వేరుగా ఎంపిక చేశారు. ఎంపికలో త్రోబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కార్యదర్శి చీరటి ప్రభాకర్, పీఈటీలు వి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.కిషన్, ఎం.రాజు, జి.మనోహర్, ఎం.రాజేందర్, ఎ.అశోక్, సాంబయ్య, కె.రవి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు వీరే... త్రోబాల్ బాలుర జట్టు : ఎస్.ఆంజనేయులు, ఎం.సాంబరాజు, స్వరాజ్యం, మధు, అశోక్, ప్రతాప్, రవి, రాజు, సుమన్, చంద్రశేఖర్, ఎం.రాజు, వి.సంజీవ. బాలికల జట్టు : శారద, సాయిశ్రీ, నవ్యశ్రీ, రజిత, అశ్విని, అంజలి, సాత్విక, రమాదేవి, కవిత, కపిల, రమ్య, అనూష ఎంపికయ్యారు.