
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి అండర్–17 త్రోబాల్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు నిరాశ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ బాలబాలికల జట్లు రెండో స్థానంలో నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో హైదరాబాద్ 13–15, 12–15తో నిజామాబాద్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నల్లగొండ 15–11, 15–9తో కరీంనగర్‌పై గెలుపొందింది.
బాలికల టైటిల్‌పోరులో నల్లగొండ 15–10, 15–11తో హైదరాబాద్‌పై గెలుపొందింది. నిజామాబాద్ 15–10, 15–13తో కరీంనగర్‌పై నెగ్గి మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఫొనిక్స్ స్పోర్ట్స్ క్లబ్ చీఫ్ కో ఆర్డినేటర్ సాయికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ప్రిన్సిపల్ కామేశ్వరి, ఎస్‌జీఎఫ్ అబ్జర్వర్ పి. జగన్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment