హోరాహోరీగా జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలు
– లీగ్‌దశలో దూసుకెళ్తున్న ఏపీ, హర్యానా ఉమెన్స్ జట్లు
కల్లూరు: కర్నూలు నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియంలో ఆలిండియా త్రోబాల్ ఫెడరేషన్ కప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండవ రోజు శనివారం లీగ్ దశ ఉమెన్స్ విభాగంలో ఆం్ర«దప్రదేశ్ జట్టు, రాజస్థాన్ జట్లు పోటీ పడగా బెస్టాఫ్ త్రీ సెట్లలో 15–6, 15–9 పాయింట్ల తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో తెలంగాణ జట్టు, హర్యానా జట్టు పోటీ పడగా 15–6, 15–9 పాయింట్ల తేడాతో హర్యానా జట్టు జయకేతనం ఎగురవేసింది. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు, మధ్యప్రదేశ్ జట్టు తలపడ్డాయి. 15–10, 3–15, 5–15 పాయింట్లతో హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. మూడవ రోజు నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు.