selection
-
గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ కొలువుల తివాచీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతున్నాయి. రూ.లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ.. తమ సంస్థల్లో ఉద్యోగాలిస్తున్నాయి. ఈసారి నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి ఏకంగా 473 మంది విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్లలో వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. కొందరు విద్యార్థులైతే రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి సైతం ఎంపికయ్యారు. సాకారమవుతున్న వైఎస్సార్ ఆశయం.. పేదల పిల్లలకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయం నెరవేరుతోంది. ట్రిపుల్ ఐటీల్లో చదివే వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, కూలీలు, చిరుద్యోగుల పిల్లలే. వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు దక్కించుకున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చదువు పూర్తికాకముందే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో 11 బ్యాచ్‌లు చదువు పూర్తిచేసుకొని వెళ్లగా.. దాదాపు ఏడు వేల మందికి పైగా విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో, మరికొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈసారి 2018–24 బ్యాచ్‌కు చెందిన 473 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ.. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కెరీర్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ సెల్ ఎంతో కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్‌లు, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహింపజేస్తోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, థాట్ వర్క్స్, ఎఫ్ట్రానిక్స్, అచల ఐటీ సొల్యూషన్స్, పర్పుల్ టాక్, పర్పుల్ డాట్‌కామ్, ఈజ్ సాఫ్ట్, ఎన్సీఆర్, ఏడీపీ, అన్‌లాగ్ డివైజస్, టెక్ మహీంద్రా తదితర ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహించేలా ప్రత్యేక కృషి చేస్తోంది. దీంతో గత విద్యా సంవత్సరంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో 56 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించాయి. ఆరుగురికి అత్యధిక ప్యాకేజీ.. క్యాంపస్ సెలక్షన్లకు 746 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 473 మంది విద్యార్థులు రూ.4.5 లక్షల నుంచి రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. బెంగళూరుకు చెందిన అన్‌లాగ్ డివైసెస్ కంపెనీ రూ.27.6 లక్షల వార్షిక వేతనానికి ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. వీరికి ఏడాది పాటు ఇచ్చే ట్రైనింగ్‌లో సైతం నెలకు రూ.40 వేల స్టైఫండ్ ఇవ్వనుంది. అలాగే సినాప్సిస్ కంపెనీ రూ.20 లక్షల వార్షిక వేతనంతో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మైక్రాన్ కంపెనీ రూ.16 లక్షల వార్షిక వేతనంతో ఇద్దరిని, బెంగళూరుకు చెందిన వేదాంతు కంపెనీ రూ.15 లక్షల వార్షిక వేతనంతో నలుగురిని, బెంగళూరుకు చెందిన బీఈఎల్ కంపెనీ రూ.12.45 లక్షల వార్షిక వేతనానికి నలుగురిని, హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ఫౌండేషన్ రూ.11 లక్షల వార్షిక వేతనానికి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.క్యాంపస్ సెలక్షన్స్‌పై ప్రత్యేక తర్ఫీదు విద్యార్థులకు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నుంచే క్యాంపస్ సెలక్షన్ల కోసం నిరంతరం శిక్షణ అందిస్తుంటాం. మాక్ టెస్ట్‌లు, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దీంతో విద్యార్థులు ఎలాంటి భయం, బెరుకు లేకుండా క్యాంపస్ సెలెక్షన్లలో అన్ని దశలను ఎదుర్కొని.. సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.– బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
క్యాంపస్ సెలక్షన్స్‌లో టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థినీ గ్లోబల్ ఉద్యోగిగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఉద్యోగ నైపుణ్య ఆధారిత విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. విద్యార్థి చదువు సమయంలోనే వృత్తి నైపుణ్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీల్లో సులభంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలకు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.ఇంటర్న్‌షిప్, ఫ్యూచర్ స్కిల్స్‌లో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో నిలిచింది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్‌షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇంజనీరింగ్, డిగ్రీలోనే కాకుండా డిప్లొమా విద్యార్థులూ మంచి మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వీటన్నింటికీ తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పేదింటి బిడ్డల విద్యకు ఆరి్థక భరోసా లభిస్తోంది. ఇందుకోసం సీఎం జగన్ ఈ ఐదేళ్లలో రూ.18,600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పెరిగిన క్యాంపస్ కొలువులు చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ కొలువులు సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది (2022–23లో) ఏకంగా 1.80 లక్షల మందికి పైగా ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 1.20 లక్షల మందికి పైగా సాంకేతిక విద్యనభ్యసించిన వారు కాగా, సాధారణ డిగ్రీ అభ్యసించి ఉద్యోగాలు పొందిన వారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 11 వేలకు పైగా డిప్లొమా విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు రూ.8.60 లక్షల వరకు ప్యాకేజీని అందుకున్నారు. ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగ నైపుణ్యంఉన్నత విద్యలో 30కి పైగా గ్లోబల్ సర్విసు ప్రొవైడర్ల ద్వారా వర్చువల్, మరో 27 వేలకు పైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసి ఎక్స్పీరియన్స్ ఇంటర్న్‌షిప్‌లకు వైఎస్ జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో 52.80 శాతం ఐటీ, 13.43 శాతం అకౌంటింగ్, 8.45 శాతం విద్యా, 5.47 శాతం ఫార్మా, 8.68 శాతం మార్కెటింగ్, 4.39 శాతం గవర్నమెంట్ సెక్టర్, 2.01 శాతం ఉత్పత్తి, 1.78 శాతం వ్యవసాయం, 1.36 శాతం ఆతిథ్యం, 0.9 శాతం అడ్వరై్టజింగ్, 0.7 శాతం బయోటెక్నాలజీ రంగంలో పేరు గడించిన సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను అందించింది. తద్వారా చదువు సమయంలోనే విద్యార్థులు సంపాదనను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే 1.25 లక్షల మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్ సర్టీఫికేషన్, మరో 1.50 లక్షల మంది ఇతర సర్టిఫికేషన్లు సాధించారు. ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీ సర్టీఫికేషన్ కోర్సులు పూర్తి చేసి 1.73 లక్షలకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. వీటన్నింటి ఫలితంగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. నైపుణ్యాన్ని పెంచే సర్టీఫికేషన్ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్‌లో భాగంగా డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 37 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ద్వారా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పైథాన్, క్లౌడ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. నాస్కామ్ ప్యూచర్ స్కిల్స్ పేరినేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజుకి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బీఎఫ్ఎస్ఐ అనలిస్ట్ తదితర అంశాల్లో శిక్షణ అందించింది. అదేవిధంగా ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఈ సంస్థ వర్చువల్ ఇంటర్న్‌షిప్ అందించింది. 281మంది ఏయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన 281 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఏపీఎండీసీలో రూ 8.4 లక్షల వార్షిక వేతనంతో ఐదుగురు, ప్రధాన్ ఎన్జీఓలో రూ.10 లక్షల వార్షిక వేతనంతో పదిమంది, శ్రీ చైతన్య కళాశాలల్లో 60 మంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌లో 58 మంది, హెటిరో డ్రగ్స్‌లో 109 మంది, సింధు సంస్థలో 39 మంది మొత్తం 281 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో కొంతమందికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. విశ్వవిద్యాలయం నుంచి వెళ్లే సమయంలో విద్యార్థి చేతిలో ఉద్యోగ నియామక పత్రం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి పాల్గొన్నారు. రూ.16.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది మా స్వస్థలం ఒంగోలు. నాన్న రైతు. రాష్ట్రంలో సాంకేతిక విద్య కరిక్యులమ్‌లో తెచ్చిన మార్పులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చదువు సమయంలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను క్యాంపస్‌లోనే నేర్చుకున్నాం. సాధారణ పాఠ్యాంశాలతో విషయ పరిజ్ఞానం వస్తుంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాం. కంప్యూటర్ సైన్స్ చివరి ఏడాదిలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది. డారి్వన్బాక్స్ డిజిటల్ సొల్యూషన్స్‌లో రూ.16.30 లక్షల ప్యాకేజీతో లభించింది. – అల్లాడి సంధ్య, జేఎన్టీయూ కాకినాడ మా ఫ్యామిలీ ఫుల్ ఖుష్మాది విశాఖపట్నం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఇప్పుడు థాట్ వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. అక్కడ ఉద్యోగం చేసేవారికి ఉన్నత చదువులకు ఆ కంపెనీ సహకారం అందిస్తుంది. ప్రత్యేకంగా మార్కెట్లో జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్‌పై మాకు తరగతి గదిలోనే నేరి్పంచారు. ఇంటర్న్‌షిప్, ఆన్లైన్ కోర్సులతో సిలబస్‌ను దాటి చాలా విషయాలు నేర్చుకున్నాం. గడిచిన రెండేళ్లుగా మా కాలేజీలో క్యాంపస్ ఎంపికలు బాగున్నాయి. – ఆర్.అజయ్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనకాపల్లి -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
రాహుల్ అవుట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్‌రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్‌పెద్దలున్నట్టు సమాచారం. -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి..
‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఈ మూవీ 10వ ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి. -
కన్నప్పలో కథానాయికగా..
కన్నప్పలో భాగమయ్యారు ప్రీతీ ముకుందన్. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిల్యాండ్‌లో జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ప్రీతికి ఇది తొలి సినిమా. ‘కన్నప్ప’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది. నాట్య కళలో ప్రీతికిప్రావీణ్యం ఉంది. ‘కన్నప్ప’లో ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజస్థాన్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారం ప్రకటించారు. విష్ణుదేవ్ సాయికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఇంకా సీఎం ఎవరనేది ఖరారు కాలేదు. సోమవారం మధ్యప్రదేశ్‌లో శాసనసభా పక్ష సమావేశం జరగాల్సివుంది. అయితే రాష్ట్రపతి లక్నో పర్యటన కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశం మంగళవారం జరగనుంది. ఇక రాజస్థాన్ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన సత్తాను చాటుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాజే జైపూర్‌లోని తన నివాసంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, మాజీ మంత్రి రాజ్‌పాల్ సింగ్ షెకావత్, మాజీ మంత్రి దేవి సింగ్ భాటీ కూడా రాజేను కలిశారు. మరోవైపు ఎమ్మెల్యేలతో ఆదివారం జరగాల్సిన పరిశీలకుల సమావేశం కూడా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమ, మంగళవారాల్లో లక్నోలో పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగానే శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది. వసుంధర రాజేను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ కూడా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అటువంటి పరిస్థితిలో అనుభవమున్న నేత మాత్రమే చక్కదిద్దగలరని.. అందుకు వసుంధర రాజే మాత్రమే సరైనవారని పేర్కొన్నారు. కాగా ఆదివారం జైపూర్ చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ సీంఎం ఎంపికకు సంబంధించి త్వరలోనే పార్టీ హైకమాండ్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: 19న ‘ఇండియా’ భేటీ -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
గృహలక్ష్మి పథకం.. ఆరు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల ఐదో తేదీ నాటికి మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ కసరత్తు పూర్తి చేయాలనే అక్టోబర్ 5 డెడ్‌లైన్‌గా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దరఖాస్తులు 15 లక్షలు..అర్హత ఉన్నవి 11లక్షలు సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించి.. వారే ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లు మొత్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇటీవల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహా్వనించగా 15 లక్షల వరకు అందాయి. వాటిల్లో 11 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా ఎంపిక చేశారు. వాటి నుంచి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఏ ఊరు.. ఎవరు లబ్ధిదారులు నియోజకవర్గంలో ఏఏ ఊళ్ల నుంచి ఎవరెవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనే విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని గతంలోనే మౌఖికంగా ఆదేశాలందాయి. ఇప్పుడు అధికారులకు ఎమ్మెల్యేలు అందించే వివరాల ఆధారంగా జాబితాలు రూపొందుతున్నాయి. ఏఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వేగంగా వివరాలు అందిస్తున్నారో, ఆయా ప్రాంతాల్లో జాబితాలు అంత వేగంగా సిద్ధమవుతున్నాయి. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందితో జాబితా సిద్ధమైంది. మిగతా లబ్దిదారుల జాబితా వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం లోపు ఖరారు చేయాలని తాజాగా సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖికంగా అదేశాలందినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆ పనిలో వేగం పెంచారు. ఇప్పటికీ దరఖాస్తుల స్వీకరణ గతంలో అందిన దరఖాస్తులే కాకుండా ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిసింది. అందిన దరఖాస్తులు కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ‘అవసరం’అని భావిస్తే, ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని జాబితాలో పేరు చేరుస్తున్నట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేది నిరంతర ప్రక్రియే అన్న మాటతో ఈ తంతు కానిస్తున్నట్టు సమాచారం. -
తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి?
మన దేశానికి తొలి ఒలింపిక్ పతకం ఎవరు సాధించిపెట్టారు? మన దేశానికి మొదటి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన జట్టుకు కెప్టెన్ ఎవరు? దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి ప్రధాన మంత్రి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలిసేవుంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన మొదటి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్లముందు సత్యేంద్రనాథ్ ఠాగూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నాటిరోజుల్లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలిస్తున్నారు. వారు భారతీయులను చాలా ఏళ్లపాటు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించలేదు. అయితే సత్యేంద్ర ఠాగూర్ తన అపార ప్రతిభతో ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, ఇక్కడ పాలన ప్రారంభించారు. అప్పట్లో వారి ప్రభుత్వం ఉండేది. సమస్తం వారి నియంత్రణలో ఉండేది. చాలా ఏళ్లపాటు బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో భారతీయులు పనిచేసేందుకు వీలు కల్పించలేదు. 1832లో మొదటిసారిగా మున్సిఫ్, సదర్ అమీన్ పదవులకు భారతీయులు ఎన్నికయ్యేందుకు అనుమతించారు. తరువాత డిప్యూటీ మేజిస్ట్రేట్, కలెక్టర్ పదవులకు పోటీపడేందుకు భారతీయలను అనుమతించారు. కానీ 1860ల వరకు భారతీయులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కాలేదు. 1861లో ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థాపితమయ్యింది. ఫలితంగా భారతీయులను సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనుమతించారు. అయితే ఈ పరీక్షకు హాజరుకావడం భారతీయులకు అంత సులభం కాలేదు. ఈ పరీక్షలకు హాజరు కావడానికి లండన్‌కు వెళ్లవలసి వచ్చేది. పాఠ్యాంశాలు గ్రీక్, లాటిన్ భాషలలో ఉండేవి. గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లుగా ఉండేది. 1842 జూన్‌లో జన్మించిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ పొంది తన ప్రతిభచాటారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదం పొందిన తరువాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ తన స్నేహితుడు మోనోమోహన్ ఘోష్‌తో కలిసి ఈ పరీక్షకు వెళ్లాలని భావించారు. ఇద్దరూ లండన్ వెళ్లి పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. అయితే ఘోష్ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. సత్యేంద్ర ఠాగూర్ (1863లో) ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, 1864లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను తొలుత బాంబే ప్రెసిడెన్సీలో నియమితులయ్యారు. తరువాత అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. సత్యేంద్ర ఈ పదవిలో 30 సంవత్సరాల పాటు ఉన్నారు. 1896లో మహారాష్ట్రలోని సతారా నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ 1922లో ప్రారంభమైంది. అప్పుడు దానిని ఇండియన్ ఇంపీరియల్ సర్వీసెస్ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని సివిల్ సర్వీసెస్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: ‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత? -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
ట్రైన్ టిక్కెట్ల కేటాయింపు కసరత్తు సాగుతుందిలా..
ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 12 కోచ్‌లు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు. వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు. ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది. -
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
కూతురి శుభలేఖ సెలక్ట్ చేసేందుకు పోటీపడుతున్న అలీ దంపతులు (ఫొటోలు)
-
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్‌తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
ఫిబ్రవరిలో ఆర్మీ స్పోర్ట్స్ కంపెనీ సెలక్షన్స్
కంటోన్మెంట్: ఇండియన్ ఆర్మీ ఆర్టిల్లరీ సెంటర్ ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో స్పోర్ట్స్ క్యాడెట్ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ర్యాలీ కొనసాగుతుందని వెల్లడించారు. 8 నుంచి 14 ఏళ్ల లోపు బాయ్స్‌కు ఫిబ్రవరి 1 నుంచి 9వ తేదీ వరకు ప్రాథమిక ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ (స్ప్రింట్స్, జంప్స్), విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు త్రివేండ్రమ్, జైపూర్, కౌశాంబీ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు గుంటూరు, భివానీ (హరియాణా) జలంధర్ (పంజాబ్)లలో ప్రాథమిక ఎంపిక ఉంటందని తెలిపారు. హ్యాండ్ విభాగానికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు గోరఖ్‌పూర్ (యూపీ)లో.. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఒంగోలు, భివానీ (హరియాణా)లో.. జలంధర్ (పంజాబ్)లో ప్రాథమిక స్థాయి ఎంపిక కొనసాగుతుందన్నారు. -
అమ్మఒడికి శ్రీకారం
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జనగన్న అమ్మఒడి’ పథకం అమలుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన షెడ్యూల్ వివరాలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సిన అంశాలను డీఈఓ జి.నాగమణి సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలను వివరించారు. పథకానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతను నిర్ధారిస్తారు. అర్హులందరికే ఈ పథకం అందేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే పథకం అమలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమ్మ ఒడి జిల్లా స్థాయి షెడ్యూల్ ఇలా... -పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి. ఈ నెల 19వ తేదీలోగా ధ్రువీకరించాలి. -ఇతర పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్ధులను తిరిగి నమోదు చేసుకోవాలి. -గుర్తించిన జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 20న పంపించి 25న నోటీసు బోర్డులో పెట్టాలి. అప్డేట్ అయిన చైల్డ్ ఇన్ఫో డేటా రాష్ట్ర స్థాయిలో ఏపీ ఆన్లైన్ ద్వారా ఏపీసీఎఫ్ఎస్ఎస్కు అందజేస్తారు. -ఏపీ ఆన్‌లైన్‌కు అందిన చైల్డ్ ఇన్ఫో రేషన్ కార్డుల జాబితా మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో పోల్చి అమ్మ ఒడికి అర్హులైన తల్లులు/సంరక్షకుల సమాచారాన్ని నిర్ధారించి ఈ నెల 21న ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రకటిస్తారు. -ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు లాగెన్ ఐడీ మరియు పాస్వర్డ్ కేటాయిస్తారు. ∙కొత్తగా అర్హతలను జోడించడానికి అవసరమైన మూడు ఫార్మేట్స్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ విడుదల చేస్తుంది. -వాటిలో ఫార్మేట్–1 తెల్ల రేషన్ కార్డు కలిగిన తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడి ఉన్న విద్యార్థుల జాబితా ఉంటుంది. ఇందులో సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి లోపాలు ఉన్నట్లయితే సరిదిద్ది గ్రామ సచివాలయ లాగిన్‌లో ఈ నెల 24లోపు క్రోడీకరించాలి. -ఫార్మేట్–1ను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యాయుల నుంచి అందిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్థులకు మూడు రోజులు గడువు ఇవ్వాలి. -ఫార్మేట్–2 తెల్లరేషన్ కార్డు లేని తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడిన విద్యార్థుల జాబితా ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు పరిశీలించి గ్రామ సచివాలయం లాగిన్‌కు ఈ నెల 24వ తేదీలోగా పంపాలి. -ఫార్మేట్–3 ఆధార్ నంబర్/ఈఐడీ నంబర్ లేని విద్యార్థుల జాబితా సేకరించడం కోసం ఉపయోగించాలి. ప్రధానోపాధ్యాయుల ద్వారా అందిన ఫార్మేట్–2, ఫార్మేట్–3వ లను విద్య సంక్షేమ, సహాయకునికి గ్రామవలంటీర్లు అందజేయాలి. -గ్రామ వలంటీర్లు ఆ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి... సమాచారంలో లేని తల్లుల పేర్లు, రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు నంబర్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ వివరాలు సేకరించాలి. కుటుంబాలు అర్హత కలిగిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన ద్వారా ధ్రువీకరించుకోవాలి. సమాచార సేకరణ గ్రామ వలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు చేపట్టాలి. -సేకరించిన సమాచారాన్ని తిరిగి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఏపీసీఎఫ్ఎస్ఎస్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -ముసాయిదా జాబితా సిద్ధం చేసేటప్పటికీ 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ పరిశీలించాలి. 75 శాతం హాజరు లెక్క కట్టేటప్పుడు వీలైనంత విద్యార్థి పక్షంగా ఉండాలి. -వచ్చేనెల 9వ తేదీన గ్రామ సచివాలయంలో జాబితా ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్తులకు వచ్చే నెల 13 వరకు గడువు ఇవ్వాలి.వచ్చేనెల 15 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభలో జాబితాను ప్రకటించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. -ఆమోదించిన జాబితా వచ్చేనెల 20వ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి అదే నెల 23వ తేదీలోగా అందజేయాలి. ∙ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేసినప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి. జిల్లా స్థాయిలో హెల్త్‌లైన్ సెంటర్: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అర్హులను క్రోడీకిరించే ప్రక్రియలో ఎలాంటి సందేహాలు వచ్చినా ప్రధానోపాధ్యాయు లు సంప్రదించుకోవడానికి జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ సెంటర్‌ని ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సందేహాలను సత్వరమే నివృత్తి చేసుకోవడానికి ఫోన్: 9440011576, 8008686988 నంబర్లను సంప్రదించాలి. – జి.నాగమణి, డీఈఓ -
ప్రపంచకప్ హాకీ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజని ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, ఉదిత. -
అన్న... తమ్ముడు... క్రికెట్!
కొత్త బంగారం అరవింద్ అడిగా ముంబయిలో నివసిస్తున్న కుమార్ల కుటుంబంతో నవల ప్రారంభం అవుతుంది. 14 ఏళ్ల రాధాకృష్ణ (రాధ), 13 ఏళ్ల మంజునాథ్ (మంజు), తండ్రి మోహన్! ఆయన తన కొడుకులను పేరొందిన క్రికెటర్లుగా తయారు చేయడానికి, కర్ణాటక నుండి ముంబయి మురికివాడకు వస్తాడు. కుర్రాళ్లు తమ బాల్యాలను ఆరోగ్యం, శుభ్రత కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, తండ్రిని అసహ్యించుకుంటారు. భార్య వదిలేసి పోతుంది. మోహన్ రైల్లో ప్రయాణికులతో చెప్తుంటాడు: ‘నేను అద్భుతమైన చట్నీలమ్ముతాను. రోజుకి 24 రకాలైన చట్నీలు. పుదీనా, వెల్లుల్లీ, మిరపా, తీపీ. అన్నీ నూరు శాతం శాకాహారం’. అబ్బాయిలు టీనేజీలోకి ప్రవేశించినప్పుడు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ కోసం పని చేసే ‘టామీ సర్’ కుర్రాళ్ళ ప్రతిభ గుర్తించి, స్పాన్సర్షిప్ ఇప్పిస్తాడు. ఆ డబ్బుని మితంగా ఖర్చుపెడుతూ కుమార్ల కుటుంబం చెంబూర్‌కు మారుతుంది. మంజూ, రాధా క్రికెట్ ఆడుతున్నప్పుడు, వారి జట్టులో ఉండే జావెద్ అన్సారీ వాళ్ళకి పోటీగా నిలబడతాడు. అన్నదమ్ములకీ తండ్రికీ మధ్య ఘర్షణ ఎక్కువవుతూ ఉంటుంది. సెలెక్షన్ డే సమీపిస్తున్నప్పుడు, తనవల్ల ఇతరులకి కావలసినదేమిటో, తనకోసం తాను కోరుకున్నదేమిటో అని పరిశీలించుకునే అవసరం పడుతుంది మంజుకి. ఇక, సెలెక్షన్ డే నాడు తండ్రి నమ్మకం పెట్టుకున్న రాధ ఎంపికవక, క్రికెట్ ఆడటం ఇష్టం లేని మంజు ఎంపికవుతాడు. అన్నదమ్ముల మధ్య ఈర్షా్యద్వేషాలు పుడతాయి. మంజుకీ, జావెద్కీ ఉన్న సంబంధం లైంగిక రూపం దాలుస్తుంది. పుస్తకంలో స్త్రీలు ఉండరు. వారి గురించిన క్లుప్తమైన ఉదహరింపులుంటాయంతే. నవలలో అధికభాగం తోబుట్టువుల మధ్య పోటీ గురించినదే. పుస్తకం, క్రికెట్లో పేరు ప్రఖ్యాతుల కోసం మార్గం వెతకడం కన్నా, ఆ క్రీడవల్ల మూసుకోబడిన ఇతర మార్గాల గురించినది. తన పాత్రలకున్న భయాలనీ, మనఃస్థితులనీ, తమకి తాము నిర్మించుకున్న వారి ఖైదులనీ– రచయిత వారి అంతర్గత కంఠాల లోపలకీ, బయటకీ త్వరితంగా ప్రయాణిస్తూ, వర్ణిస్తారు. చిన్న పాత్రలకి కూడా రచయిత విషాదాన్నీ, గంభీరతనీ ఆపాదిస్తారు. వ్యంగ్య చిత్రాలు లేవు నవల్లో. ఇతివృత్తం ఆహ్లాదకరమైనది. 1983 అనంతరపు క్రికెట్ చుట్టూ కథ అల్లారు రచయిత. నవల నేపథ్యం క్రికెట్ మీదనున్న భారతదేశపు ఆరాధన. ఆ క్రీడ మీద సవిమర్శక పరిశీలనతోనే నడిచే నవల ఇది. క్రికెట్ అంటే మనకి దేవుడు, అది జాతీయ వ్యామోహమే కాక ఒక మతంలా కూడా తయారయిందన్న ఉదహరింపులున్నాయి. పుస్తకం, లైంగిక మేల్కొలుపు గురించినది కూడా! రచయిత రాసిన విధానం వల్ల కథను ఆస్వాదించాలంటే పాఠకులకి క్రికెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉండదు. క్రీడల మీద రాయబడిన ఇతర పుస్తకాల్లాగే ఇక్కడ కూడా, క్రికెట్ అన్న అంశం– విస్తృత సమస్యలను అన్వేషించే పరికరం మాత్రమే. ఈ క్రీడ మనుష్యులని ఎలా ఏకం చేస్తుందో, విడదీస్తుందో, ఉత్తేజపరుస్తుందో అన్న సంగతులనీ, తెర వెనకాతల సాగే లంచగొండితనాలూ, సాధికారతలన్నిటినీ రచయిత వర్ణిస్తారు.తన తొలి నవల ‘ద వైట్ టైగర్’కు 2008లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా మూడో నవల ఈ ‘సెలెక్షన్ డే’. 2016లో వచ్చింది. u క్రిష్ణవేణి -
నేడు హజ్ యాత్రికుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికుల 2018 ఎంపికకు సంబంధించిన కంప్యూటరైజ్డ్ డ్రా పద్ధతిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లో ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు 17,146 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 ఏళ్లకు పైబడిన కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 508 మందిని నిబంధనల ప్రకారం డ్రా లేకుండా నేరుగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం దేశ హజ్ కోటాలో 5 వేలు పెంచడంతో రాష్ట్ర కోటాలో 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడేళ్లు యాత్రకు దరఖాస్తు చేసుకున్నా డ్రాలో ఎంపిక కానివారిని నాలుగోసారి నేరుగా ఎంపిక చేసే కేటగిరీని కేంద్ర హజ్ కమిటీ రద్దు చేసిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మందికి డ్రా ద్వారా యాత్రకు వెళ్లే అవకాశం దక్కనుందని పేర్కొన్నారు.