రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎనిమిది మంది ఎంపిక
రాజమహేంద్రవరం సిటీ :
ప్రతిభ చూపితే ఉన్నత శిఖరాలు సునాయసంగా అధిరోహించవచ్చని రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు అన్నారు. స్థానిక ఇన్నీసుపేట అల్యూమినియం కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల చదరంగం పోటీలను ఆయన ప్రారంభించారు. సుమారు 60 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో ఎన్.చైతన్య సాయిరామ్, ఎస్.సాయి గృహికేష్, జీఎంవీ అజయ్, ఎం.స్టీఫెన్; బాలికల విభాగంలో ఎన్.లాస్య మయూక, సాయి రిషిత, ఎం.మాధుర్య, పి.ప్రవల్లిక రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు ఆగస్ట్ 12, 13, 14 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జీవీ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ విభాగం మేనేజర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
23ఆర్‌జేసి235 : రాష్ట్ర చదరంగం పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు