స్టేట్ సివిల్ సర్వీసెస్ జట్ల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ :
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన బుధవారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, గాంధీనగర్‌లోని సిమ్మింగ్‌పూల్, దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, స్విమ్మింగ్ జట్లను ఎంపిక చేశారు. శాప్ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, శాప్ కోచ్ పర్యవేక్షణలో ఈ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగాయి.