బంగారం కొంటున్నారా?!
ఎంపిక
కొనుగోలు చేసే ప్రతి ఆభరణానికీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) హాల్‌మార్క్ ముద్ర ఉండాలి. దానికి సంబంధించి కొనుగోలు పత్రాన్ని కూడా జాగ్రత్తపరుచుకోవాలి.
24 క్యారట్‌ల బంగారం నూటికి నూరు శాతం స్వచ్ఛమైనది.
22 క్యారెట్‌ల బంగారమైతే 2 భాగాలు ఇతర లోహాన్ని( రాగిని) జత చేసి ఆభరణాలను తయారుచేస్తారు.
వాడుకలో ఎక్కువగా ఉన్నది 91.6 శాతం బంగారం.
18 క్యారెట్‌ల బంగారం, 6 భాగాలు ఇతర లోహాలతో కలిపి ఆభరణాలను తయారుచేస్తారు. ఇది 75 శాతం బంగారం అని చెప్పవచ్చు.
స్వచ్ఛమైన బంగారానికే ధర నిర్ధారించి ఆభరణాల తయారీ ఖర్చును జోడించి ఖరీదును నిర్ణయిస్తారు. 18 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు దీర్ఘకాలం మన్నుతాయి. అందుకని వజ్రాలు, ఇతర జాతిరత్నాలను 18 క్యారెట్ బంగారంతోనే పొదుగుతారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేసేవారికి నాణేలు మంచి ఆప్షన్. వీటిని స్టోర్ చేయడం సులువు. ఆభరణాల నిపుణులు వీటినే ఎక్కువ కొనుగోలు చేస్తారు.