carat
-
బంగారం ఎక్కడైనా బంగారమే : అసలేంటీ క్యారెట్ కథ
ప్రపంచంలో ఏ దేశంలోనైనా బంగారం(Gold) అత్యంత విలువైన లోహంగా గౌరవం అందుకుంటోంది. బంగారం స్వచ్ఛత గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిష్పత్తిని అనుసరిస్తుంటారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్ (Carot) ల బంగారం. ఆభరణం తయారు చేయాలంటే కొన్ని ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలుపుతారు. బంగారం మెత్తటి లోహం. కాబట్టి ఆభరణం ఆకారం గట్టిదనం కోసం ఇతర లోహాలను కలపాలి. అలా లోహపు మిశ్రమాల కలయిక తర్వాత ఆభరణం తయారు చేయడానికి ఉపయోగించే బంగారం స్వచ్ఛత 22 క్యారట్లు ఉంటుంది. క్యారట్ అనే పదం అయోమయానికి గురి చేస్తుంది. బంగారం స్వచ్ఛత విషయంలో ఉపయోగించే క్యారట్ అనే పదం ఇంగ్లిష్ అక్షరం ‘కె’తో సూచిస్తారు. మరో క్యారట్ రాళ్ల (వజ్రంతో సహా అన్ని రకాల రాళ్లు) బరువును సూచించే పదం. ఈ క్యారట్‌ను ‘సి’తో అనే అక్షరంతో సూచిస్తారు. ఒక క్యారట్ అంటే 200 మిల్లీగ్రాములు. బంగారం ధర పెరగడం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారట్లకు బదులు 18, 14, 9 క్యారట్ స్వచ్ఛతతో ఆభరణాలు చేస్తున్నారు. క్యారట్ స్వచ్ఛత తగ్గేకొద్దీ గట్టిదనం పెరుగుతుంది. వజ్రాలు పొదిగే ఆభరణాలకు సాధారణంగా 18 క్యారట్ బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు 9 క్యారట్ బంగారంతో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు. తక్కువ క్యారట్ బంగారు ఆభరణాలను కొంటే తిరిగి అమ్మేటప్పుడు ఆ బంగారానికి విలువ రాదనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం కొన్న ఆభరణంలో ఎంత నిష్పత్తి బంగారం ఉందో కరిగించినప్పుడు ఆ మేరకు బంగారమే తిరిగి వస్తుంది. బీఐఎస్ హాల్‌మార్క్ వేసిన 18 క్యారట్ బంగారాన్ని కరిగిస్తే 75 శాతం బంగారం వస్తుంది. అంతకంటే క్యారట్ తగ్గితే ఆ మేరకే బంగారం వస్తుంది. అంతే తప్ప తిరిగి ఏమీ రాదనేది అ΄ోహ మాత్రమే. సర్టిఫికేట్లో ఆభరణంలో ఉన్న బంగారం స్వచ్ఛతతో పాటు క్యారట్ వివరం తాలూకు పర్సెంటేజ్ కూడా ఉంటుంది. – విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ ఇదీ చదవండి: Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు -
రేట్లు పెరిగి.. క్యారెట్లు తరిగి...
24కు 9 మార్క్ పడింది బంగారం ధర రోజు రోజుకూ కొండెక్కుతోంది. కొన్నాళ్లలో పది గ్రాముల ధర అక్షరాలా లక్ష అవుతుందంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవల గొలుసు దొంగతనాలు కూడా పెరిగాయని క్రైమ్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు బంగారం ధరను దించేదెలా? ఈ ఆలోచనతో కేంద్రం 9 కేరెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. పది గ్రాముల 9 క్యారెట్ల బంగారం ధర 20 వేల నుంచి 30 వేల రూ΄ాయల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ బంగారం వల్ల లాభం ఎంత? నష్టం ఎంత? అనే సందేహాలు అంతటా వినిపిస్తున్నాయి.తొమ్మిది క్యారెట్ బంగారంతో ఎలాంటి ఆభరణాలు తయారవుతాయి అనే సందేహం చాలా మందిలో తలెత్తవచ్చు. ఇప్పటికే మార్కెట్లో 22కె, 18కె, 14కె, 9కె బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.లెక్కల్లో బంగారంబంగారం స్వచ్ఛతను కొలిచే యూనిట్‌ను క్యారెట్లలో లెక్కిస్తారు. 24 క్యారెట్ బంగారంలో 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత స్థాయి 91.7 శాతం కాగా 18 క్యారెట్ల బంగారం 75 శాతం ఉంటుంది. 14 క్యారెట్ల బంగారం 58.3 శాతం స్వచ్ఛమైనది. 12 క్యారెట్ల బంగారం 50 శాతం, 10 కారెట్ల బంగారంలో స్వచ్ఛత 41.7 శాతం కాగా, 9 క్యారెట్లలో బంగారం స్వచ్ఛత 37.5 శాతం మాత్రమే ఉంటుంది. క్యారెట్ తగుతోంది అంటే ఇందులో వెండి, రాగి, జింక్, నికెల్ వంటి లోహాలు కలుపుతారని అర్థం. హాల్‌మార్క్ తప్పనిసరి!పెరుగుతున్న ధరల ప్రతికూల ప్రభావాన్ని ఐబిజెఎ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ ‘బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 9 క్యారెట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను అనుమతించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. సావరిన్ గోల్డ్ బాండ్ల ధరను నిర్ణయించడంలో ఐబీజేఏ సహకారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించడం ముఖ్యం’ అంటున్నారు. 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,000గా ఉంది. దీనిపై 3 శాతం జీఎస్టీ అదనం. ఈ బంగారానికి హాల్‌మార్కింగ్ ఆమోదిస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది.నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో2021తో ΄ోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకొని దొంగలకు ముట్టజెప్పడం దేనికి అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారాన్ని హాల్‌మార్క్‌తో అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.కాంటెంపరరీ డిజైన్లకే ్ర΄ాధాన్యతభారతదేశానికి చెందిన నగల కంపెనీలవాళ్లు ఇప్పటికే 9కె బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిని డిజైన్, తయారీ, మార్కెటింగ్‌తో అనుసంధానించి, నగల డిజైన్ల అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ ఆభరణాలు పెట్టుబడిగా కాకుండా రోజువారీ ఉపయోగకరమైన, కాంటెంపరరీ డిజైన్లతో వస్తున్నాయి. సన్నటి చైన్లు, రింగులు మాత్రమే ఉంటున్నాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ఈ జాబితాలో లేవు. 9కెలో వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఈ నగలపైన ఆ జ్యువెలరీ బ్రాండ్ లోగో ఉంటోంది. పది గ్రాముల బంగారం ధర 30 వేల లోపే ఉంటుంది అంటున్నారు. మేం ఎంత తక్కువ క్యారెట్లో ఉన్న లోహాలతోనైనా నగలు డిజైన్ చేస్తాం. అయితే, ప్రజలు ఎప్పుడూ క్వాలిటీ గోల్డ్‌నే కొంటారు. హాల్‌మార్క్ వేసి, తిరిగి అమ్ముకున్నా నష్ట΄ోం అనే నమ్మకం వుంటే 9 క్యారెట్ల నగలు అమ్ముడు΄ోవచ్చు. సాధారణంగా 9.16 బంగారంతో చేస్తే వేస్టేజ్‌లో కొంత బంగారం ΄ోతుంది. ఇక 9 క్యారెట్ గోల్డ్‌లో అంటే వేస్టేజ్ ఇంత ఉంటుందని ఇతమిద్ధంగా చెప్పలేం. ఆభరణం డిజైన్‌ను బట్టి వేస్టేజ్ ఖర్చు రెట్టింపు ఉండవచ్చు. – మలుగు రమేష్‌చారి, స్వర్ణకారుడుకరిగిస్తే తరుగే..!9 క్యారెట్ గోల్డ్ వల్ల అమ్మకాలు ఎక్కువ ఉండవచ్చు అని అనుకోవచ్చు. మార్కెట్లో ప్యూర్ గోల్డ్ గ్రామ్ ధర రూ.7 వేల కు పైనే ఉంది. 22 క్యారెట్ బంగారాన్ని ఆభరణాల కోసం, 18 క్యారెట్ గోల్డ్ ను డైమండ్ జ్యువెలరీకి ఉపయోగిస్తారు, దీంట్లో గోల్డ్ కాం΄ోజిషన్ తక్కువ ఉంటుంది. 14 క్యారెట్ గోల్డ్‌ను కాంటెంపరరీ డిజైన్స్ కోసం ఉపయోగిస్తారు. గోల్డ్ శాతం ఇంకా తగ్గి 9 క్యారెట్‌కి తీసుకురావచ్చు. అయితే, ఈ నగలను కరిగించినప్పుడు ఏ లాభం రాదు. అయితే, ఈ గోల్డ్ ఎంత మేరకు అమ్మడు΄ోతుంది అనేది మార్కెట్లోకి వచ్చాక మాత్రమే చెప్పగలం. – కళ్యాణ్‌కుమార్, జ్యువెలరీ మార్కెట్ నిపుణులు -
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్‌మార్క్ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్‌సీజన్‌లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్‌లో పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సవరించిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్‌పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్‌గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి!
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మృతి తర్వాత బ్రిటన్ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది. బ్రిటన్ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి. అవన్ని బ్రిటీష్ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే. ఐతే ప్రస్తుతం రాణీ మరణించింది కాబట్టి 'మా వ్రజాలు మాకిచ్చేయండి' అంటూ పలు దేశాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. ఆయ దేశాల సరసన దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆప్రికాలో ప్రసిద్ధిగాంచిని కల్లినన్ I అనే వజ్రాన్ని వలస పాలకులు బ్రిటీష్ రాజకుటుంబానికి అప్పగించాయి. ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తిపొడుస్తూ...తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయమంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్లైన్లో.. change.org అనే వెబ్సైట్లో పిటిషన్ కూడా వేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిటన్ చేసిన నిర్వాకానికి పరిహారం ఇవ్వాల్సిందేనని, పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుందని, 1600 ఏళ్ల నాటి పట్టాభిషేక వేడుకలో రాజ దండంలోని క్రాస్ గుర్తులో పొదగబడి ఉందని దక్షిణాఫ్రికా పేర్కొంది. ఈ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినదని చెబుతోంది. దీన్ని లండన్ టవర్లోని జ్యువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొంది. (చదవండి: వెస్ట్‌మినిస్టర్ హాల్: రాణి శవపేటికను అక్కడే ఎందుకు ఉంచారంటే..) -
బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే..
శరీరంలో ఏ అవయవానికి జబ్బుచేసినా కష్టమే. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో కాలేయం(లివర్) సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తింటే ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. ►యాంటీ ఆక్సిడెంట్స్.. బీట్ రూట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందువల్ల బీట్ రూట్‌ను కూరగా గానీ, సలాడ్‌గా కానీ తీసుకోవాలి. ►క్యారట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల క్యారట్‌ను నేరుగా గానీ జ్యూస్, సలాడ్, లేదా కూరగా చేసుకుని తింటే మంచిది. ►రోజూ నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు పాలతో చేసిన టీ కాకుండా గ్రీన్ టీ తాగితే లివర్‌కు మంచిది. లివర్‌కు కావాల్సిన పోషకాలు దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. ►కాలేయం చెడిపోకుండా చక్కగా ఉండాలంటే దైనందిన ఆహారంలో తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. దీనిలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలకూరను సూప్‌గా గానీ, కూరగా గానీ చేసుకుని తీసుకోవాలి. చదవండి: Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే -
ఇవి వండితే బెస్ట్... ఇవి వండకపోతే మరింత బెస్ట్!
టొమాటో, క్యారెట్ల లాంటి వెజిటబుల్స్‌ను పచ్చిగా కూడా తినవచ్చు . కానీ పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటిని వండితేగానీ తినలేం. పచ్చిగా కూడా తినగలిగే వాటిని పచ్చిగా తిన్నా పర్లేదు. కానీ వాటిల్లో కొన్నిటిని వండుకొని తింటే... పచ్చిగా తిన్నప్పటి కంటే ఎక్కువ పోషకాలు దొరుకుతాయంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. అలాగే వండుకుతినేవి కొన్నింటిని పచ్చిగా తింటే మరింత ప్రయోజనం అంటున్నారు. అలాంటి కొన్నింటిని చూద్దాం. వీటిని వండాక తినడం బెస్ట్... క్యారెట్లూ, టొమాటోలు, క్యాబేజీ వంటివి వండిన తర్వాత తిన్నప్పుడు వాటి నుంచి దొరికే పోషకాలు రెట్టింపు అవుతాయట. ఎందుకలా జరుగుతోందో బ్రిటిష్ న్యూట్రిషనిస్టు పరీక్షించి చూశారు. అప్పుడు వారికి తెలిసినదేమిటంటే... టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతోందట. మరి పోషకాలు రెట్టింపు కావడం మంచిదే కదా. అలాగని పచ్చిగా తినగలిగే వాటిని మీరు సరదా తినదలచుకుంటే ఎలాంటి ఆంక్షలూ లేవు. నిరభ్యంతరంగా తినండి. కాకపోతే పరిశోధనల్లో తేలిన విషయం న్యూట్రిషనిస్టులు చెబుతున్నారంతే! వీటిని పచ్చిగా కూడా తినవచ్చు... సాధారణంగా మనం క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి ఉడికించాకే తింటాం కదా. కానీ వాటిని పచ్చిగా తింటేనే మంచి ప్రయోజనం ఉంటుందని బ్రిటన్ ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, క్యాప్సికమ్‌లో ఉండే విటమిన్ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే ఒంటికి పుష్కలంగా అందుతాయట. కాబట్టి ఆ పోషకాలు కావాలనుకున్నవారూ, ఆరోగ్యస్పృహతో మెలుగుతూ ఇలాంటి సూచనలను పాటించేవారు కావాలనుకుంటే పచ్చిగానూ తినవచ్చు. డయాబెటిస్ ముప్పు తప్పాలంటే శాకాహారం బెస్ట్... పనిలో పనిగా బ్రిటిష్ ఆహార పరిశోధకులు మరో విషయాన్నీ చెప్పారు. శాకాహారం వల్ల టైప్–2 డయాబెటిస్ ముప్పు గణనీయంగా తగ్గుతుందట. పైగా వాటిని తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం మరింత చక్కగా ఉంటుందని బ్రిటిష్ డైటీషియన్ హెలెన్ బాండ్ పేర్కొన్నారు. -
వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ ప్రత్యేక డిస్కౌంట్స్
-
రుచైనా
ఏ రుచైనా... పదార్థాలన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే కదా నాలుకకు తృప్తి! ఎంతైనా చైనా రుచులు కదా.. మనకెలా కుదురుతుందనుకుంటున్నారా..? మరేం ఫర్వాలేదు.. భేషుగ్గా కుదురుతుంది. మన దగ్గర విరివిగా దొరికే పదార్థాలతోనే... మన వంటిళ్లలో చైనా ఘుమఘుమలు గుబాళించడం సాధ్యమవుతుంది. లెమన్ కోరియండర్ సూప్ కావల్సినవి: క్యారట్లు - 2 క్యాబేజీ - చిన్న ముక్క బీన్స్ - 6 (ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) వెజ్ స్టాక్ (క్యాబేజీ, క్యారట్, బీట్రూట్.. ఇలా నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను సన్నగా కోసి అందులో 4 నల్లమిరియాలు, 4 వెల్లుల్లి, బిర్యానీ ఆకు, లీటరు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ నీళ్లు సగం అయ్యేంతవరకు ఉడికించాలి) - అర లీటరు కొత్తిమీరను మెత్తగా రుబ్బిన ముద్ద - 3 చెంచాలు మొక్కజొన్న పిండి - చెంచాడు (మూడు చెంచాల నీళ్లలో ఉండలు లేకుండా కలుపుకోవాలి)ఉప్పు - తగినంత నిమ్మరసం - పెద్ద చెంచా తయారీ: ఒక గిన్నెలో కాయగూరల ముక్కలన్నీ వేసి, గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. నీళ్లను వంపేసి కూరగాయల ముక్కలను ఒకగిన్నెలోకి తీసుకోవాలి. మరుగుతున్న వెజ్ స్టాక్‌లో సిద్ధంగా ఉంచుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమం పోసి, నూరిన కొత్తిమీర ముద్ద, ఉప్పు కలిపి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. 5-7 నిమిషాలు ఉడికాక దించి, అందులో సిద్ధంగా ఉంచుకున్న కూరగాయల ముక్కలు, నిమ్మరసం కలిపి, అందించాలి. కావల్సినవి: నూడుల్స్ - 300 గ్రా.లు; రొయ్యాలు (ప్రాన్స్) - 200 గ్రా.లు క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్, బఠాణీలు, క్యాప్సీకమ్.. తరుగు - అన్నీ 2 టేబుల్ స్పూన్ల చొప్పున వెల్లుల్లి - 3 (తరగాలి); కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నూనె - 3 టీ స్పూన్లు సోయా సాస్ (టొమాటో గుజ్జు కూడా వాడుకోవచ్చు)- అవసరమనుకుంటే 2 టీ స్పూన్లు తయారీ: నూడుల్స్‌ను ఉడికించి, నీళ్లన్నీ వార్చి పక్కనుంచాలి. శుభ్రం చేసుకున్న ప్రాన్స్‌లో అర టీ స్పూన్ పసుపు వేసి, ఉడికించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి, వేడయ్యాక కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. టొమాటో గుజ్జు కూడా వేసి ఉడికాక, ఇందులో రొయ్యలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరగా నూడుల్స్, సోయా సాస్ వేసి బాగా కలిపి, కొత్తిమీర చల్లి దించాలి. ఘాటుగా కావాలనుకుంటే సోయాసాస్, మసాలా పొడి వాడుకోవచ్చు. ట స్ప్రింగ్ రోల్స్ కావల్సినవి: క్యాబేజీ తరుగు - కప్పు; క్యారెట్ - 1 (సన్నగా తరగాలి) పాలకూర - కప్పు; ఉల్లికాడలు - అర కప్పు పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్; ఛీజ్ తరుగు - అర కప్పు వెల్లుల్లి - 2 సన్నగా (తరగాలి); ఉప్పు - తగినంత స్ప్రింగ్ రోల్ రేపర్స్- 6 (ఇంట్లో చేసుకోవాలంటే కప్పు మైదాలో చిటికెడు ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు కలిపి, చిన్న చిన్న ఉండలు చేసుకొని, పూరీలా చాలా పలచగా వత్తుకోవాలి) తయారీ: కూరగాయల ముక్కలు, ఉల్లికాడలు, పాలకూర, ఛీజ్, ఉప్పు ఒక గిన్నెలో వేసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాతో చేసిన పూరీలో పెట్టి రోల్ చేయాలి. రెండు చివరల మూసి ఉంచాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక రోల్స్‌ని అందులో వేసి అన్ని వైపులా దోరగా వేయించుకోవాలి. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చికెన్ ఖీమా/మటన్ ఖీమాని కలిపి కూడా వీటిని తయారుచేసుకోవచ్చు. (మైదాకు బదులుగా బియ్యం పిండిని వాడి, నూనెలో వేయించకుండా వీటిని ఇడ్లీ కుకర్‌లో పెట్టి, ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు) మిక్స్డ్ వెజిటబుల్ రైస్ కావల్సినవి: అన్నం - 5 కప్పులు మొక్కజొన్న గింజలు - 3 చెంచాలు; క్యారట్ తరుగు - 2 చెంచాలు పచ్చి బఠానీ - 2 చెంచాలు బీన్స్ తరుగు - 2 చెంచాలు ఉప్పు - రుచికి తగినంత నూనె - 2 చెంచాలు వెజిటబుల్ బ్రోత్ పౌడర్ - (ఎండిన కొత్తిమీర ఆకులు గుప్పుడు, వెల్లుల్లి పొడి చెంచాడు, ఉప్పు అర చెంచాడు, అర చెంచాడు మిరియాలు, అర చెంచాడు పసుపు కలిపి పొడి చేయాలి) తయారీ: కడాయిలో నూనె వేసి వేడయ్యాక చెంచాడు జీలకర్ర- ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి వేగాక, మొక్కజొన్న గింజలు, క్యారెట్, బీన్స్, ఉప్పు, వెజిటబుల్ బ్రోత్ పౌడర్ వేసి, చివరగా అన్నం వేసి కలిపి గిన్నెలోకి తీసుకొని వడ్డించాలి. డేట్ పాన్ కేక్స్ కావల్సినవి: మైదా - పావు కప్పు; నీళ్లు - కప్పు బేకింగ్ పౌడర్ - 1 పెద్ద చెంచాడు; కోడిగుడ్లు - 4 పంచదార - 1 పెద్ద చెంచాడు; ఖర్జూరం - అర కప్పు (గింజ తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసి, చెంచాడు నువ్వుల నూనె వేసి కలిపి ఉంచాలి); పంచదార పాకం - 1 పెద్ద చెంచాడు దాల్చిన చెక్క - చిన్న ముక్క తయారీ: మైదా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఈ పిండిలో పంచదార, గుడ్ల సొన వేసి బాగా కలపాలి. అర గంటపాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. ఖర్జూరం మిశ్రమాన్ని చిన్న చిన్న పరిమాణంలో తీసుకొని, అదిమి, పక్కన ఉంచాలి. దోసెల పెనం (నాన్‌స్టిక్ పాన్) పైన రెండు చోట్ల చెంచాతో కొద్ది కొద్దిగా మైదా మిశ్రమం వేసి, గరిటతో వెడల్పు చేయాలి. కిందివైపు మిశ్రమం కాలుతుండగా ఆ పైన ఖర్జూరం మిశ్రమం పెట్టి, ఆ పైన కాలుతున్న రెండో పాన్ కేక్‌తో మూసేయాలి. సన్నని మంటమీద ముదురు గోధుమరంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలా తయారుచేసుకున్న పాన్‌కేక్స్‌ను త్రికోణాకారంలో కట్ చేసుకోవచ్చు. పైన పంచదార పాకం పోసి, ఐస్‌క్రీమ్ కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. ట ఆరెంజ్ చికెన్ కావల్సినవి: చికెన్ బ్రెస్ట్ - 2 (బోన్‌లెస్, స్కిన్ లెస్) మైదా - కప్పు ఉప్పు - (పావు చెంచాడు/తగినంత) మిరియాల పొడి - పావు చెంచాడు ఆలివ్ ఆయిల్/వంటనూనె - 3 చెంచాలు సాస్ కోసం కావల్సినవి: నీళ్లు - ఒకటిన్నర కప్పు ఆరెంజ్ జ్యూస్ - 2 టేబుల్ స్పూన్లు వెనిగర్ - అర కప్పు సోయాసాస్ - 2 చెంచాలు ఆరెంజ్ జెస్ట్ (ఆరెంజ్ తొక్కను సన్నగా తరిగినది) - చెంచాడు అల్లం తరుగు - అర చెంచాడు వెల్లుల్లి తరుగు - అర చెంచాడు ఉల్లికాడల తరుగు - 2 చెంచాలు ఎండుమిర్చి (కచ్చాపచ్చా చేసినది) - పావు చెంచా మొక్కజొన్న పిండి - 2 చెంచాలు (మూడు చెంచాల నీళ్లలో కలపాలి) నీళ్లు - 3 చెంచాలు తయారీ: కడాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి సాస్ కోసం ఇచ్చిన పదార్థాలలో మొక్క జొన్న పిండి మినహా అన్నీ వేసి, మరిగించి, దించి, చల్లారనివ్వాలి. ప్లాస్టిక్ కవర్ బ్యాగ్‌లో చికెన్ వేసి, అందులో అర కప్పు సాస్, ఉప్పు కలిపి, మూట గట్టి, ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచాలి. మరొక ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ తీసుకొని అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి, ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్ వేసి బాగా షేక్ చేయాలి. దీంతో మైదా మిశ్రమం పైన పొరలా చికెన్‌కు పడుతుంది.కడాయిలో నూనె వేసి వేడయ్యాక బాగా నానిన చికెన్ ముక్కలను వేసి, వేయించి, పేపర్ టవల్ మీద వేయాలి. మరిగించి, చల్లారిన ఆరెంజ్ జ్యూస్ మిశ్రమాన్ని వేడిచేసి, అందులో మొక్కజొన్న పిండి మిశ్రమం కలిిపి ఉడకనివ్వాలి. ఇది చిక్కటి గ్రేవీలా తయారయ్యాక మంట తగ్గించి, చికెన్ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉంచి, దించాలి. -
బంగారం కొంటున్నారా?!
ఎంపిక కొనుగోలు చేసే ప్రతి ఆభరణానికీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) హాల్‌మార్క్ ముద్ర ఉండాలి. దానికి సంబంధించి కొనుగోలు పత్రాన్ని కూడా జాగ్రత్తపరుచుకోవాలి. 24 క్యారట్ల బంగారం నూటికి నూరు శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారమైతే 2 భాగాలు ఇతర లోహాన్ని( రాగిని) జత చేసి ఆభరణాలను తయారుచేస్తారు. వాడుకలో ఎక్కువగా ఉన్నది 91.6 శాతం బంగారం. 18 క్యారెట్ల బంగారం, 6 భాగాలు ఇతర లోహాలతో కలిపి ఆభరణాలను తయారుచేస్తారు. ఇది 75 శాతం బంగారం అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బంగారానికే ధర నిర్ధారించి ఆభరణాల తయారీ ఖర్చును జోడించి ఖరీదును నిర్ణయిస్తారు. 18 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు దీర్ఘకాలం మన్నుతాయి. అందుకని వజ్రాలు, ఇతర జాతిరత్నాలను 18 క్యారెట్ బంగారంతోనే పొదుగుతారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేసేవారికి నాణేలు మంచి ఆప్షన్. వీటిని స్టోర్ చేయడం సులువు. ఆభరణాల నిపుణులు వీటినే ఎక్కువ కొనుగోలు చేస్తారు.