24కు 9 మార్క్ పడింది బంగారం ధర రోజు రోజుకూ కొండెక్కుతోంది. కొన్నాళ్లలో పది గ్రాముల ధర అక్షరాలా లక్ష అవుతుందంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటీవల గొలుసు దొంగతనాలు కూడా పెరిగాయని క్రైమ్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు బంగారం ధరను దించేదెలా?
ఈ ఆలోచనతో కేంద్రం 9 కేరెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. పది గ్రాముల 9 క్యారెట్ల బంగారం ధర 20 వేల నుంచి 30 వేల రూ΄ాయల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ బంగారం వల్ల లాభం ఎంత? నష్టం ఎంత? అనే సందేహాలు అంతటా వినిపిస్తున్నాయి.
తొమ్మిది క్యారెట్ బంగారంతో ఎలాంటి ఆభరణాలు తయారవుతాయి అనే సందేహం చాలా మందిలో తలెత్తవచ్చు. ఇప్పటికే మార్కెట్లో 22కె, 18కె, 14కె, 9కె బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.
లెక్కల్లో బంగారం
బంగారం స్వచ్ఛతను కొలిచే యూనిట్‌ను క్యారెట్లలో లెక్కిస్తారు. 24 క్యారెట్ బంగారంలో 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత స్థాయి 91.7 శాతం కాగా 18 క్యారెట్ల బంగారం 75 శాతం ఉంటుంది. 14 క్యారెట్ల బంగారం 58.3 శాతం స్వచ్ఛమైనది. 12 క్యారెట్ల బంగారం 50 శాతం, 10 కారెట్ల బంగారంలో స్వచ్ఛత 41.7 శాతం కాగా, 9 క్యారెట్లలో బంగారం స్వచ్ఛత 37.5 శాతం మాత్రమే ఉంటుంది. క్యారెట్ తగుతోంది అంటే ఇందులో వెండి, రాగి, జింక్, నికెల్ వంటి లోహాలు కలుపుతారని అర్థం.
హాల్‌మార్క్ తప్పనిసరి!
పెరుగుతున్న ధరల ప్రతికూల ప్రభావాన్ని ఐబిజెఎ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ ‘బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 9 క్యారెట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను అనుమతించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. సావరిన్ గోల్డ్ బాండ్ల ధరను నిర్ణయించడంలో ఐబీజేఏ సహకారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించడం ముఖ్యం’ అంటున్నారు. 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,000గా ఉంది. దీనిపై 3 శాతం జీఎస్టీ అదనం. ఈ బంగారానికి హాల్‌మార్కింగ్ ఆమోదిస్తే వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో
2021తో ΄ోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకొని దొంగలకు ముట్టజెప్పడం దేనికి అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారాన్ని హాల్‌మార్క్‌తో అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.
కాంటెంపరరీ డిజైన్లకే ్ర΄ాధాన్యత
భారతదేశానికి చెందిన నగల కంపెనీలవాళ్లు ఇప్పటికే 9కె బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిని డిజైన్, తయారీ, మార్కెటింగ్‌తో అనుసంధానించి, నగల డిజైన్ల అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ ఆభరణాలు పెట్టుబడిగా కాకుండా రోజువారీ ఉపయోగకరమైన, కాంటెంపరరీ డిజైన్లతో వస్తున్నాయి. సన్నటి చైన్లు, రింగులు మాత్రమే ఉంటున్నాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ఈ జాబితాలో లేవు. 9కెలో వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఈ నగలపైన ఆ జ్యువెలరీ బ్రాండ్ లోగో ఉంటోంది.
పది గ్రాముల బంగారం ధర 30 వేల లోపే ఉంటుంది అంటున్నారు. మేం ఎంత తక్కువ క్యారెట్‌లో ఉన్న లోహాలతోనైనా నగలు డిజైన్ చేస్తాం. అయితే, ప్రజలు ఎప్పుడూ క్వాలిటీ గోల్డ్‌నే కొంటారు. హాల్‌మార్క్ వేసి, తిరిగి అమ్ముకున్నా నష్ట΄ోం అనే నమ్మకం వుంటే 9 క్యారెట్ల నగలు అమ్ముడు΄ోవచ్చు. సాధారణంగా 9.16 బంగారంతో చేస్తే వేస్టేజ్‌లో కొంత బంగారం ΄ోతుంది. ఇక 9 క్యారెట్ గోల్డ్‌లో అంటే వేస్టేజ్ ఇంత ఉంటుందని ఇతమిద్ధంగా చెప్పలేం. ఆభరణం డిజైన్‌ను బట్టి వేస్టేజ్ ఖర్చు రెట్టింపు ఉండవచ్చు.
– మలుగు రమేష్‌చారి, స్వర్ణకారుడు
కరిగిస్తే తరుగే..!
9 క్యారెట్ గోల్డ్ వల్ల అమ్మకాలు ఎక్కువ ఉండవచ్చు అని అనుకోవచ్చు. మార్కెట్లో ప్యూర్ గోల్డ్ గ్రామ్ ధర రూ.7 వేల కు పైనే ఉంది. 22 క్యారెట్ బంగారాన్ని ఆభరణాల కోసం, 18 క్యారెట్ గోల్డ్ ను డైమండ్ జ్యువెలరీకి ఉపయోగిస్తారు, దీంట్లో గోల్డ్ కాం΄ోజిషన్ తక్కువ ఉంటుంది. 14 క్యారెట్ గోల్డ్‌ను కాంటెంపరరీ డిజైన్స్ కోసం ఉపయోగిస్తారు. గోల్డ్ శాతం ఇంకా తగ్గి 9 క్యారెట్‌కి తీసుకురావచ్చు. అయితే, ఈ నగలను కరిగించినప్పుడు ఏ లాభం రాదు. అయితే, ఈ గోల్డ్ ఎంత మేరకు అమ్మడు΄ోతుంది అనేది మార్కెట్‌లోకి వచ్చాక మాత్రమే చెప్పగలం.
– కళ్యాణ్‌కుమార్, జ్యువెలరీ మార్కెట్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment