శరీరంలో ఏ అవయవానికి జబ్బుచేసినా కష్టమే. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో కాలేయం(లివర్) సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తింటే ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
►యాంటీ ఆక్సిడెంట్స్.. బీట్ రూట్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అందువల్ల బీట్ రూట్‌ను కూరగా గానీ, సలాడ్‌గా కానీ తీసుకోవాలి.
►క్యారట్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల క్యారట్‌ను నేరుగా గానీ జ్యూస్, సలాడ్, లేదా కూరగా చేసుకుని తింటే మంచిది.
►రోజూ నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉన్న వాళ్లు పాలతో చేసిన టీ కాకుండా గ్రీన్ టీ తాగితే లివర్‌కు మంచిది. లివర్‌కు కావాల్సిన పోషకాలు దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి.
►కాలేయం చెడిపోకుండా చక్కగా ఉండాలంటే దైనందిన ఆహారంలో తప్పనిసరిగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. దీనిలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల పాలకూరను సూప్‌గా గానీ, కూరగా గానీ చేసుకుని తీసుకోవాలి.
చదవండి: Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే
Comments
Please login to add a commentAdd a comment