Summer Healthy Drinks: Top 5 Juices For Glowing Skin And Look Younger - Sakshi

Summer Healthy Juices: టొమాటో జ్యూస్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా.. అయితే!

Published Sat, Mar 11 2023 7:04 PM | Last Updated on Sat, Mar 11 2023 7:56 PM

Summer Healthy Drinks: Top 5 Juices For Glowing Skin Look Younger - Sakshi

వేసవి వచ్చేసింది. చలికాలంలో లాగే వేసవిలో కూడా చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే, వేసవిలో చర్మం ట్యానింగ్, నిగారింపు కోల్పోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందాలంటే రోజూ ఈ డ్రింక్స్‌ తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వీటివల్ల చర్మకాంతి పెరిగి యౌవనంగా కనిపిస్తారు. 

ఆరెంజ్‌ జ్యూస్‌
చర్మకాంతిని పెంచే విటిమిన్‌ సి సమృద్ధిగా ఉండేవాటిలో నారింజ లేదా కమలా పండ్లు ముందుంటాయి. నారింజ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా ఆరంజ్‌ జ్యూస్‌ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

టొమాటో జ్యూస్‌
టొమాటోలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకత శక్తిని కలిగిస్తాయి. రోజూ టొమాటో జ్యూస్‌ తీసుకోవడం వల్ల చర్మం యౌవనంగా, కాంతిమంతంగా ఉంటుంది. టొమాటోను సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

బీట్‌రూట్‌ జ్యూస్‌
ఆరోగ్యానికి అద్భుత ఔషధం బీట్‌రూట్‌ జ్యూస్‌. ప్రతిరోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

దానిమ్మ జ్యూస్‌
శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా ఉండేది దానిమ్మలోనే. అందువల్ల రోజూ దానిమ్మ జ్యూస్‌ సేవించడం ద్వారా చర్మంలో నిగారింపు వస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. షుగర్‌ వ్యాధిగ్రస్థులు కూడా దానిమ్మ జ్యూస్‌ తీసుకోవచ్చు. అయితే అందులో రుచికి పంచదార కలుపుకోకూడదు. 

గ్రీన్‌ టీ
కేవలం బరువు తగ్గించేందుకే కాకుండా చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్‌ టీ. రోజుకు రెండుసార్లు గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

చదవండి: ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement