ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్‌రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది.
బీట్ రూట్ క్రీమ్
తొక్కతీసిన అరకప్పు బీట్‌రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్‌రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్‌రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్
స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్‌రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి.
15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది.
చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్‌రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్‌రూట్‌లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్‌టోన్‌ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment