ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్‌హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి ముఖాన్ని నీట్‌గా మారుస్తుంది.
ఈ డివైస్‌లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్‌ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్‌హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్‌తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.
రెండో లెవల్ ఆప్షన్‌తో సెన్సిటివ్ స్కిన్‌కి, మూడో లెవెల్ ఆప్షన్‌తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్‌తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్‌తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.
ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
Comments
Please login to add a commentAdd a comment