'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.'
బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు.
హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇవి చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!
Comments
Please login to add a commentAdd a comment