![Health Precautions And Tips To Be Taken Before Sleeping](/styles/webp/s3/article_images/2024/06/8/Sleeping.jpg.webp?itok=3MeUAsIP)
నిద్రపోయేముందు నీళ్లు తాగి పడుకునే అలవాటు అందరికీ ఉన్నప్పటికీ దానిపై అశ్రద్ధ చూపేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలా చేయడం అనరోగ్యాలకు దారి తీస్తుంది. అలాగే నిద్రకు ఉపకరించే ముందు మీరు తాగే గ్లాసు నీళ్లలో వీటిని కలిపితే ఎంతో మేలు..
ఇలా చేయండి..
రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతోపాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో పాలు చల్లగా మారుతాయి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా మూడు రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది.
రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి చదవండి: నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment