ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..
ఇలా చేయండి..
– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.
– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి.
– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
– ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి..
Comments
Please login to add a commentAdd a comment