చలికాలంలో చర్మసౌందర్యంపై దృష్టి పెట్టడం మరింత ముఖ్యం. లేదంటే తొందరగా పొడిబారుతుంది. అందుకే ఇంట్లోనే సింపుల్ టిప్స్‌తో సహజంగా ఎలా మెరిసిపోవచ్చో చూసేద్దాం.
►ఓట్స్‌లో పాలు లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు రోజూ చేస్తూ ఉంటే స్కిన్‌టోన్ పెరుగుతుంది.
►పొడిచర్మం గలవారు బాదం పొడిలో పాలు లేదా పెరుగు, తేనె, కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. బాదం పొడి, తేనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్లుగా ఉపయోగపడతాయి.
►పొడిబారిన చర్మానికి తేమను అందించడంలో షియా బటర్ చక్కగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో సహకరిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది.
► కొబ్బరినూనెకు రెండు క్యాప్సూల్స్ విటమిన్ ఇ నూనె, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ఓ డబ్బాలో స్టోర్ చేసుకోండి. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు తేమను అందించడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
►స్ట్రాబెర్రీ లేదా కమలాలు చర్మానికి రసాయనాలు లేని బ్లీచ్‌లా ఉపయోపడతాయి. వీటి రసాన్ని ముఖానికి రాసి, 5–10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మంపైన జిడ్డు తగ్గి పిగ్మెంటేషన్, మొటిమల వంటి సమస్యలను నివారిస్తాయి.
►గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, గొంతుకు రాయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖంపైన అతి సన్నని వెంట్రుకలను కూడా నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment