Hemoglobin Count: నీరసం.. నిస్సత్తువ.. కళ్ళు తిరిగినట్టుండడం.. చర్మం పాలినట్టుండడం.. ఊపిరాడక పోవడం.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరి చేతులు చల్లగా ఉండడం.. తలనొప్పి... వీటిలో రెండు అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయా? అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్టే? ఏంటిది?
హీమోగ్లోబిన్
ఇది ఎర్రరక్త కాణాల్లోని ప్రోటీన్. ఇది కొరియర్లా పని చేస్తుంది. శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హీమోగ్లోబిన్ శాతం పురుషుల్లో 13 - 16.6 మధ్యలో ఉండాలి. స్త్రీలలో 11.6 - 15 మధ్యలో ఉండాలి.
మన దేశంలో సుమారుగా అరవై కోట్లమంది అనీమియాతో అంటే తక్కువ హీమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నారు. తక్కువ హీమోగ్లోబిన్కు ప్రధాన కారణం తీసుకొనే ఆహారంలో ఇనుము తక్కువగా ఉండడం.
టెస్టులొద్దు ..
ఇటీవల అయినదానికీ కానిదానికి డియాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగెత్తడం... టెస్ట్లు చేసుకోవడం ఒక రివాజుగా మారింది. మన హీమోగ్లోబిన్ శాతమెంత? అని ఈ మెసేజ్ని చదివిన వారు టెస్టులకు పరుగెత్తొద్దు.
ఇవి సమృద్ధిగా ఉండాలి
పై లక్షణాల్లో ఒకటో రెండో కనిపించినా ... కనిపించకపోయినా... హీమోగ్లోబిన్ను తగినంతగా ఉంచుకొనేలా చేయండి . నేను చెప్పిన పద్ధతుల్లో హీమోగ్లోబిన్ పెరుగుతుంది . దీనికి అదనపు ఖర్చుండదు. ఒకవేళ మీకు హీమోగ్లోబిన్ ఇదివరకే తగినంతగా ఉన్నా ఇలా చెయ్యడం వల్ల నష్టం జరగదు. సైడ్ రియాక్షన్లు ఉండవు. మీరు తీసుకొనే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి .
1.పాల కూర
2. క్యాబేజీ
3.బీన్స్
4. పన్నీర్
ఇక మాంసాహారులకు అనీమియా అరుదుగా మాత్రమే వస్తుంది. కారణం మటన్ ముఖ్యంగా మటన్ కు సంబందించిన లివర్ కిడ్నీ మొదలైనవి ఐరన్ రిచ్ ఫుడ్స్.
వేగంగా పెరగాలా
మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నపుడు { చాల మందిలో ఇది 8 కంటే తక్కువగా ఉంటుంది. 5 కంటే తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది) ఏం చేయాలంటే?
►ఆపిల్ పండును తొక్క తీయకుండా అదేనండి ఎర్రటి పై పొట్టును సోకు కోసం తీసేయకుండా తినండి . ఇంకా ద్రాక్ష , అరటిపండు , పుచ్చకాయ కూడా ఉపయుక్తం.
►బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. మీకు ఇది వరకే షుగర్ ఉంటే మీరు ఇతర ఆహార నియమాలు పాటించకుండా ఉంటే పళ్ళు తీసుకోలేరు.
ఇవి మానేయండి
►పళ్ళు తీసుకొంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. పళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది. రెండూ పరస్పర విరుద్ధ మాటలు కదా? కానీ రెండు సరైనవే . అది వేరే టాపిక్. మీకు ఇదివరకే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, ఇవి వాడకండి { తినడం / తాగడం }
1 . టీ
2 కాఫీ
3. పాలు
4. కోడి గుడ్లు .. ముఖ్యంగా తెల్ల సొన.
5 . సొయా ప్రోటీన్ { సొయా పచ్చి విషం . హీమోగ్లోబిన్ బాగున్నా వాడొద్దు . వాడితే థైరాయిడ్ లాంటివి వచ్చే ప్రమాదం}
ఇవి మంచి మార్గాలు
►వ్యాయాయం
►తగినంత నీరు తాగడం
►తగినంత నిద్ర .. అనీమియా రాకుండా ఉండడానికి మంచి మార్గాలు .
పోలీసైతేమియా అంటే?
గత ఆరునెలల్లో వేర్వేరు ఘటనల్లో కనీసం డజను మంది తమ బ్లడ్ రిపోర్ట్స్ మెసెంజర్ ద్వారా నాకు పంపించారు. వారి హీమోగ్లోబిన్ 17 కంటే ఎక్కువ ఉంది. ఇలా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం పోలీసైతేమియా కావొచ్చు.
వారందరూ నాకు రిపోర్ట్స్ పంపించడానికి 2- 5 నెలల ముందు వాక్సిన్ వేసుకొన్నవారే. అంటే వాక్సీన్ కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది కూడా ఒకటి .దీనికి మరో పేరు బ్లడ్ కాన్సర్. చైనా లో అయితే లక్షలాది మంది ఇదే సమస్య తో బాధపడుతున్నారు . హీమోగ్లోబిన్ బాగా ఎక్కువగా ఉంటే అంటే పోలీసైతేమియా ఉంటే
1 . విపరీతంగా చెమటలు పడుతాయి
2 . నీరసం తలనొప్పి { హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నా ఇవి ఉంటాయి }
౩. కీళ్ల నొప్పులు
4 . ఉన్నట్టుండి బరువు తగ్గడం
5 . పచ్చ కామెర్లు వచ్చిన్నట్టు కళ్ళు యెల్లోగా మారడం
ఒకటి గుర్తు పెట్టుకోండి . ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తిన్నా పోలీసైతేమియా రాదు.
-వాసిరెడ్డి అమర్‌నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు
(ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం)
చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
Comments
Please login to add a commentAdd a comment