Panner
-
Health: నీరసం, నిస్సత్తువ.. ఛాతిలో నొప్పి ఉందా? ఇవి తిన్నా, తాగినా...
Hemoglobin Count: నీరసం.. నిస్సత్తువ.. కళ్ళు తిరిగినట్టుండడం.. చర్మం పాలినట్టుండడం.. ఊపిరాడక పోవడం.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరి చేతులు చల్లగా ఉండడం.. తలనొప్పి... వీటిలో రెండు అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయా? అయితే ఆ వ్యక్తి అనీమియాతో బాధపడుతున్నట్టే? ఏంటిది? హీమోగ్లోబిన్ ఇది ఎర్రరక్త కాణాల్లోని ప్రోటీన్. ఇది కొరియర్లా పని చేస్తుంది. శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ ను తీసుకొని వెళుతుంది. హీమోగ్లోబిన్ శాతం పురుషుల్లో 13 - 16.6 మధ్యలో ఉండాలి. స్త్రీలలో 11.6 - 15 మధ్యలో ఉండాలి. మన దేశంలో సుమారుగా అరవై కోట్లమంది అనీమియాతో అంటే తక్కువ హీమోగ్లోబిన్ శాతంతో బాధపడుతున్నారు. తక్కువ హీమోగ్లోబిన్‌కు ప్రధాన కారణం తీసుకొనే ఆహారంలో ఇనుము తక్కువగా ఉండడం. టెస్టులొద్దు .. ఇటీవల అయినదానికీ కానిదానికి డియాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగెత్తడం... టెస్ట్‌లు చేసుకోవడం ఒక రివాజుగా మారింది. మన హీమోగ్లోబిన్ శాతమెంత? అని ఈ మెసేజ్‌ని చదివిన వారు టెస్టులకు పరుగెత్తొద్దు. ఇవి సమృద్ధిగా ఉండాలి పై లక్షణాల్లో ఒకటో రెండో కనిపించినా ... కనిపించకపోయినా... హీమోగ్లోబిన్ను తగినంతగా ఉంచుకొనేలా చేయండి . నేను చెప్పిన పద్ధతుల్లో హీమోగ్లోబిన్ పెరుగుతుంది . దీనికి అదనపు ఖర్చుండదు. ఒకవేళ మీకు హీమోగ్లోబిన్ ఇదివరకే తగినంతగా ఉన్నా ఇలా చెయ్యడం వల్ల నష్టం జరగదు. సైడ్ రియాక్షన్లు ఉండవు. మీరు తీసుకొనే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండేలా చూసుకోండి . 1.పాల కూర 2. క్యాబేజీ 3.బీన్స్ 4. పన్నీర్ ఇక మాంసాహారులకు అనీమియా అరుదుగా మాత్రమే వస్తుంది. కారణం మటన్ ముఖ్యంగా మటన్ కు సంబందించిన లివర్ కిడ్నీ మొదలైనవి ఐరన్ రిచ్ ఫుడ్స్. వేగంగా పెరగాలా మీకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నపుడు { చాల మందిలో ఇది 8 కంటే తక్కువగా ఉంటుంది. 5 కంటే తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది) ఏం చేయాలంటే? ►ఆపిల్ పండును తొక్క తీయకుండా అదేనండి ఎర్రటి పై పొట్టును సోకు కోసం తీసేయకుండా తినండి . ఇంకా ద్రాక్ష , అరటిపండు , పుచ్చకాయ కూడా ఉపయుక్తం. ►బీట్ రూట్ రసం వేగంగా హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. మీకు ఇది వరకే షుగర్ ఉంటే మీరు ఇతర ఆహార నియమాలు పాటించకుండా ఉంటే పళ్ళు తీసుకోలేరు. ఇవి మానేయండి ►పళ్ళు తీసుకొంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. పళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది. రెండూ పరస్పర విరుద్ధ మాటలు కదా? కానీ రెండు సరైనవే . అది వేరే టాపిక్. మీకు ఇదివరకే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే, ఇవి వాడకండి { తినడం / తాగడం } 1 . టీ 2 కాఫీ 3. పాలు 4. కోడి గుడ్లు .. ముఖ్యంగా తెల్ల సొన. 5 . సొయా ప్రోటీన్ { సొయా పచ్చి విషం . హీమోగ్లోబిన్ బాగున్నా వాడొద్దు . వాడితే థైరాయిడ్ లాంటివి వచ్చే ప్రమాదం} ఇవి మంచి మార్గాలు ►వ్యాయాయం ►తగినంత నీరు తాగడం ►తగినంత నిద్ర .. అనీమియా రాకుండా ఉండడానికి మంచి మార్గాలు . పోలీసైతేమియా అంటే? గత ఆరునెలల్లో వేర్వేరు ఘటనల్లో కనీసం డజను మంది తమ బ్లడ్ రిపోర్ట్స్ మెసెంజర్ ద్వారా నాకు పంపించారు. వారి హీమోగ్లోబిన్ 17 కంటే ఎక్కువ ఉంది. ఇలా హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం పోలీసైతేమియా కావొచ్చు. వారందరూ నాకు రిపోర్ట్స్ పంపించడానికి 2- 5 నెలల ముందు వాక్సిన్ వేసుకొన్నవారే. అంటే వాక్సీన్ కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది కూడా ఒకటి .దీనికి మరో పేరు బ్లడ్ కాన్సర్. చైనా లో అయితే లక్షలాది మంది ఇదే సమస్య తో బాధపడుతున్నారు . హీమోగ్లోబిన్ బాగా ఎక్కువగా ఉంటే అంటే పోలీసైతేమియా ఉంటే 1 . విపరీతంగా చెమటలు పడుతాయి 2 . నీరసం తలనొప్పి { హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నా ఇవి ఉంటాయి } ౩. కీళ్ల నొప్పులు 4 . ఉన్నట్టుండి బరువు తగ్గడం 5 . పచ్చ కామెర్లు వచ్చిన్నట్టు కళ్ళు యెల్లోగా మారడం ఒకటి గుర్తు పెట్టుకోండి . ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత ఎక్కువ తిన్నా పోలీసైతేమియా రాదు. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు (ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
వాన చినుకులు కాదు... నూనె చినుకులు
ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం. పొటాటో లాలీపాప్ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి ► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్‌ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి ► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్‌కేక్‌లా అయ్యేలా పాన్‌ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి ► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి) ► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి ► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, చల్లారబెట్టాలి ► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి ► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్‌ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో రుచిగా ఉంటాయి. స్టఫ్డ్ పనీర్ ఢోక్లా కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి ► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి ► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి ► రెండవ ప్లేట్లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది) ► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి ► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి. -
ద్వితీయానికి సవాల్
► అపోలోలో అన్నాడీఎంకే అధినేత్రి జయ ► కరుణానిధికి అస్వస్థత ► పన్నీర్, స్టాలిన్లపై ఉప ఎన్నికల గెలుపు భారం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ఎన్నికల చరిత్రలో తొలిసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల అధినేతలు ఇద్దరూ ఒకేసారి అస్వస్థలుగా ఉన్న తరుణంలో ఉప ఎన్నికలు రావడం, అభ్యర్థులను గెలిపించే బాధ్యత ద్వితీయశ్రేణి నేతలపై పడడం విచిత్రకరమైన పరిణామం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో ఓటర్లకు నగదు, మద్యం, పంచెలు, చీరలు, బహుమతులు పంపిణీ జరిగినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే తిరుప్పరగున్రం స్థానం నుంచి అన్నాడీఎంకే టికెట్టుపై గెలిచిన శీనివేల్ అనారోగ్య కారణాలతో ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే మృతి చెందారు. ఈ కారణాలతో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ సాగుతుండగా వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. డీఎంకే 98, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. మిత్రపక్షాన్ని కలుపుకుంటే 106 స్థానాలు సాధించుకున్న డీఎంకే తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కేవలం కొద్ది సీట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న అన్నాడీఎంకేకు, 28 సీట్లు తక్కువై తృటిలో అధికారాన్ని కోల్పోయిన డీఎంకేకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో గెలుపు ఎంతో అవసరం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. అన్నాడీఎంకే 4, డీఎంకే 2 దక్కించుకున్నాయి. ఆ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు కాకుండా, డీఎంకే అభ్యర్థులు గెలిచి ఉంటే డీఎంకేకు అదనంగా మరో రాజ్యసభ సీటు దక్కి ఉండేది. ఆస్పత్రిలో అమ్మ: సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు గడిచిపోయిన ఆరునెలల కాలంలో వచ్చిన ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేకు ప్రతిష్టాత్మకం. ఒక్క సీటు చేజారినా అధికార పార్టీపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని ప్రచారం చేసేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత జనాకర్షణ నేతగా ఎదిగిన జయలలిత ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదు. కనీసం వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఇప్పట్లో అవకాశం లేదు. ఉప ఎన్నికల అభ్యర్థులను గెలిపించగల స్థాయిలో జనాకర్షణ కలిగిన నేత అపోలో ఆసుపత్రికి పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీంతో అన్నాడీఎంకేలో అగ్రస్థాయిలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వమే ఉప ఎన్నికల గెలుపు భారాన్ని మోయకతప్పదు. ఆస్పత్రిలో ఉన్న అమ్మ కోలుకుని ఇంటికి రాగానే ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల గెలుపును బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానంగా సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం పై ఉంది. అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బలమైన ప్రతి పక్షంగా అవతరించిన డీఎంకే అమ్మ అస్వస్థతను అవకాశంగా తీసుకోవడం, మూడు స్థానాల్లో గెలిచేం దుకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ రకంగా ఉప ఎన్నికలు అన్నాడీఎంకే నేతలకు సవాలుగా మారాయి. అస్వస్థతతో రాజకీయ కురువృద్ధుడు : డీఎంకే అధ్యక్షులు కరుణానిధి 92 ఏళ్లు దాటిన వయస్సులోనూ తమిళనాడు రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. ఎత్తులు వేయడంలో అపర చాణుక్యుడు, రాజకీయ కురువృద్ధుడైన కరుణానిధి సైతం ఉప ఎన్నికల సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులను గెలిపించే బాధ్యత సహజంగానే స్టాలిన్‌పై పడింది. పార్టీకి కాబోయే వారసుడు అని కరుణానిధి ఇప్పటికే స్టాలిన్‌కు కితాబు ఇచ్చిన నేపథ్యంలో ఉపఎన్నికలను స్టాలిన్ ఒక చాలెంజ్‌గా తీసుకునే అవకాశం లేక పోలేదు. అమ్మ ఆసుపత్రికి పరిమితమై ఉన్న తరుణంలో ద్వితీయశ్రేణిలో నాయకత్వ పటిమ, జనాకర్షణలపై అన్నాడీఎంకేతో పోల్చుకుంటే డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎంతో మెరుగు. అమ్మ ప్రచారానికి రాకున్నా ఆమెపై ఉన్న అభిమానం, అనారోగ్య సానుభూతి పవనాలు ఉప ఎన్నికలపై ప్రభావం చూపగలవు. అలాగే నాయకత్వలేమి, స్టాలిన్‌కు ఉన్న జనాకర్షణ ప్రతికూల ప్రభావానికి కూడా అవకాశం లేక పోలేదు. పార్టీ అగ్రజులు (జయలలిత, కరుణానిధి) ఎన్నికల ప్రచారానికి రాలేని తరుణంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు పన్నీర్ సెల్వం, స్టాలిన్లకు సవాలు విసురుతున్నట్లు భావించక తప్పదు.