
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్‌లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజని ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది.
భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్‌సియామి, ఉదిత.