hockey tournmet
-
హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్ సంస్థ బ్లూ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాథమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి. కెప్టెన్‌గా ఆర్యన్ సాక్షి, హైదరాబాద్: ఇన్లైన్ హాకీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత సీనియర్ జట్టుకు తెలంగాణకు చెందిన ఆర్యన్ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటలీలోని రొకారాసోలో ప్రస్తుతం ఈ టోర్నీ జరుగు తోంది. పురుషుల విభాగంలో 16 మంది సభ్యుల, మహిళల విభాగంలో 10 మంది సభ్యుల జట్టు పోటీల్లో తలపడుతోంది. చదవండి: Prime Volleyball League: త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు -
ప్రపంచకప్ హాకీ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజని ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, ఉదిత. -
ఆసియా కప్ హాకీ టైటిల్ లక్ష్యంగా...
కకమిగహర (జపాన్): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నేడు జరిగే టైటిల్‌పోరులో భారత్, చైనా జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో చెలరేగుతూ అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ‘ఆసి యా టైటిల్’తో పాటు వరల్డ్ కప్ బెర్తునూ సాధించాలని తహతహలాడుతోంది. ఫైనల్లో గెలిస్తే భారత అమ్మాయిలు వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు. క్వార్టర్స్‌లో కజకిస్థాన్‌పై, సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌పై గెలవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీనితో పాటు టైటిల్ పోరులో తలపడనున్న చైనాను పూల్ స్థాయిలో భారత్ 4–1తో ఓడించింది. ఇదే ఫలితాన్ని ఫైనల్లోనూ పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. పూల్‌లో ఓడించినప్పటికీ చైనాను తేలిగ్గా తీసుకోబోమని, సరైన వ్యూహాంతో ఫైనల్లోనూ మట్టికరిపిస్తామని జట్టు కెప్టెన్ రాణి చెప్పింది. ‘ఆసియా కప్’ టైటిల్‌ను నెగ్గిన పురుషుల జట్టు నుంచి తాము స్ఫూర్తి పొందామని, అమ్మాయిలంతా ఫైనల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొంది. పూల్ స్థాయి నుంచి చెలరేగి ఆడుతున్న భారత అమ్మాయిలు ఈ టోర్నీ మొత్తంలో 27 గోల్స్ చేయడం విశేషం. భారత డ్రాగ్ ఫ్లిక్కర్ గుర్జీత్‌సింగ్ ఇప్పటివరకు 8 గోల్స్ సాధించి టోర్నీలో ఎక్కువ గోల్స్ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. నవ్‌జ్యోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్ చెరో నాలుగు గోల్స్‌తో, దీప్ గ్రేస్ ఎక్కా, రాణి చెరో మూడు గోల్స్ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్లోనూ రాణించి చాంపియన్లుగా నిలవాలనుకుంటున్నారు. -
బిస్తివాడ పీజీకి టైటిల్
జీహెచ్ఎంసీ హాకీ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ హాకీ టోర్నమెంట్లో బిస్తివాడ ప్లేగ్రౌండ్.. టీమ్ టైటిల్‌ను గెలుచుకుంది. రెడ్‌హిల్స్ ప్లేగ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన బాలుర విభాగం ఫైనల్లో బిస్తివాడ ప్లేగ్రౌండ్ జట్టు 1-0 స్కోరుతో రెడ్‌హిల్స్ ప్లేగ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది. బిస్తివాడ పీజీ జట్టు ఆటగాడు హైదర్ ఖాన్ ఏకైక గోల్‌ను నమోదు చేసి త న జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్స్‌లో బిస్తివాడ పీజీ జట్టు 1-0తో అంబర్పేట్ పీజీ జట్టుపై గెలుపొందగా... రెడ్‌హిల్స్ పీజీ జట్టు 2-0తో షేక్‌పేట్ పీజీ జట్టును ఓడించింది.