బిస్తివాడ పీజీకి టైటిల్ | Bistawada team won hockey tournment | Sakshi
Sakshi News home page

బిస్తివాడ పీజీకి టైటిల్

Published Sat, May 31 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

Bistawada team won hockey tournment

జీహెచ్‌ఎంసీ హాకీ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ హాకీ టోర్నమెంట్‌లో బిస్తివాడ ప్లేగ్రౌండ్.. టీమ్ టైటిల్‌ను గెలుచుకుంది. రెడ్‌హిల్స్ ప్లేగ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన బాలుర విభాగం ఫైనల్లో బిస్తివాడ ప్లేగ్రౌండ్ జట్టు 1-0 స్కోరుతో రెడ్‌హిల్స్ ప్లేగ్రౌండ్ జట్టుపై విజయం సాధించింది.
 
  బిస్తివాడ పీజీ జట్టు ఆటగాడు హైదర్ ఖాన్ ఏకైక గోల్‌ను నమోదు చేసి త న జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్స్‌లో బిస్తివాడ పీజీ జట్టు 1-0తో అంబర్‌పేట్ పీజీ జట్టుపై గెలుపొందగా... రెడ్‌హిల్స్ పీజీ జట్టు 2-0తో షేక్‌పేట్ పీజీ జట్టును ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement