
న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్ సంస్థ బ్లూ స్పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాథమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి.
కెప్టెన్‌గా ఆర్యన్
సాక్షి, హైదరాబాద్: ఇన్‌లైన్ హాకీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత సీనియర్ జట్టుకు తెలంగాణకు చెందిన ఆర్యన్ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటలీలోని రొకారాసోలో ప్రస్తుతం ఈ టోర్నీ జరుగు తోంది. పురుషుల విభాగంలో 16 మంది సభ్యుల, మహిళల విభాగంలో 10 మంది సభ్యుల జట్టు పోటీల్లో తలపడుతోంది.
చదవండి: Prime Volleyball League: త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు
Comments
Please login to add a commentAdd a comment